కోవిడ్-19 నుంచి కోలుకున్నాక ఆచాప్టర్ క్లోజ్ అయిందనుకోవడానికి వీల్లేదు. కోవిడ్ ప్రభావం చాలా రోజులు కొనసాగుతుంది. మళ్లీ ఆసుపత్రి అవసరం కావచ్చు. ఈ రోజు కేంద్ర మాజీ మంత్రి, ఒక నాటి ఆర్ జెడి జాతీయ ఉపాధ్యక్షుడు రఘవంశ్ ప్రసాద్ యాదవ్ పోస్టు-కోవిడ్(Post-Covid-19) కాంప్లికేషన్స్ తో మృతిచెందారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పోస్టు-కోవిడ్ అంటే కోవిడ్ అనంతరం ఎదురయ్యే సమస్యల్లేకుండా చూసుకునేందుకు ఆసుపత్రిలో చేరారు. అమిత్ షా ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31 దాకా ఆసుపత్రిలో ఉండి కోవిడ్ నుంచి పూర్తి గా కోలుకున్నారు. అయితే, మళ్ళీ ఈ రోజు ఆయన ఎయిమ్స్ లో చేరారు. పార్లమెంటు సమావేశాల ముందర ఆయన మరొక ఆసుపత్రిలో పరీక్షల కోసం చేరారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
భారతదేశంలో కోవిడ్ నయంమయినా అనంతర సమస్యలతో బాధపుడుతున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు.మొత్తం కరోనా కేసుల్లు 10 నుంచి 15 శాతం మందికి వెంటిలేటర్ సపోర్ట్ అవసరమయితే, వారిలో అయిదు నుంచి పదిశాతం మంది పోస్టు కోవిడ్ సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
కొవిడ్ నుంచి కోలుకున్న వారు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని సూచనలతో కూడిన ప్రొటోకాల్ని జారీ చేసింది.
కోలుకున్న వారిలో కూడా అత్యంత అరుదుగానే అయినా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ తెలిపింది.
కోవిడ్ నుంచి కోలుకున్న వారికోసం ఈరోజు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా నియమాలను విడుదల చేసింది.
ఒక వేళ పొడి దగ్గు,గొంతురాపిడి కోవిడ్ నయమయిన తర్వాత కూడా కొనసాగితే, ఉప్పునీళ్లతో పుక్కిలించాలి. అవిరిపీల్చాలి. కావాలంట వీటికి ఏవైనా మూలికలు కలుపుకోవచ్చు. వైద్యుల సలహామేరకు,లేదా ఆయుష్ ప్రాక్టిషనర్ సలహా మేరకు దగ్గు మందు కొనసాగించాలి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతున్నదేమో గమనిస్తూ ఉండాలని కేంద్రం సూచించింది.
ఓపిక ఉన్నంతవరకు ప్రాణాయామం, యోగ, మెడిటేషన్ చేయాలి. అదే విధంగా రోజు పొద్దునో సాయంకాలమో అలసట లేనంతవరకు వాక్ కూాడా చేయాలి.
తప్పనిసరిగా ఇంటి వద్ద బిపిని, బ్లడ్ షుగర్ ని, టెంపరేచర్ తో పాటు పల్స్ ఆక్సిమెట్రీని గమనిస్తూ ఉండాలి.
మాస్క్ని తప్పనిసరిగా వాడాలి, చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. భౌతిక దూరం పాటించాలి..గోరు వెచ్చని నీరు తాగుతూ ఉండాలి.. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్ మెడిసిన్ని వాడాలి.
ఆరోగ్యం బావుంటేనే ఇంట్లో పనులు చేసుకోవాలి. దశల వారీగా ఆఫీసు పనుల్లో చేరాలి.. వైద్యులు సూచించిన విధంగా రోజు యోగాసన, ప్రాణాయామ, మెడిటేషన్ చేయాలి. . వైద్యుడు చెబితేనే బ్రీతింగ్ వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర, విరామం తప్పనిసరి.
అధిక జ్వరం, శ్వాససంబంధ సమస్యలు, గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు ఉంటే ముందుగానే అప్రమత్తం అవ్వాలి.. కరోనాపై అవగాహన కలిగించేలా మీ అనుభవాలను స్నేహితులు, బంధువులతో సోషల్ మీడియా వేదికల మీద పంచుకోవాలి.