అక్టోబర్ 2 నుంచి విజయనగరం పైడితల్లి జాతర, ఇంతకీ పైడితల్లి ఎవరు?

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర తేదీలను దేవస్థానం ప్రకటించింది.జాతర అక్టోబర్   నుంచి మొదలవుతుంది. నంబర్ 11 న చండీ హోమం ముగుస్తుంది.
కార్యక్రమాలు
అక్టోబర్ 2న మండల దీక్షలు ప్రారంభం మరియు పందిరిరాట కార్యక్రమం
అక్టోబర్ 22 న అర్ధ మండల దీక్షలు ప్రారంభం
అక్టోబర్ 26 న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం
27న అమ్మవారి ఉత్సవంలో ప్రధాన ఘట్టం సిరిమనోత్సవం
నవంబర్ 3న తెప్పోత్సవం
నవంబర్ 10 న ఉయ్యాల కాంబల ఉత్సవం
నవంబరు11 న చండీహోమం.
చండీహోమం తో ముగుస్తున్న అమ్మవారి ఉత్సవాలు
పైడి తల్లి ఎవరు?
పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య గ్రామ దేవత . ఇలాగే పూసపాటి రాజుల ఇలవేల్పుకూడా. అమ్మవారి దేవాలయాన్ని విజయనగరం పట్టణలోంని మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు.
paiditalli temple (source : internet)
అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయని ఇక్కడి ప్రజలు చెబుతారు.

  ప్రతిసంవత్సరం సెప్టెబర్ లో లేదా అక్టోబర్  లో మొదలవుతాయి.ఇందులో సిరిమాను ఉత్సవం ప్రముఖ ఘట్టం.దీనిని వీక్షించేందుకు రెండ మూడు లక్షల మంది ప్రజలు వస్తారు.
ఆలయానికి నిర్ధిష్టమయిన చరిత్ర లేదు. ప్రచారంలో ఉన్నగాధల ప్రకరాం క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు  విజయనగరం పెద్ద చెరువులో అమ్మవారి విగ్రహం బయలప్పడింది.  అవి బొబ్బిలి యుద్ధం జరుగుతున్న రోజులు.
 అమ్మవారి విగ్రహాన్ని మొదట పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి చెరువులోనుంచి  పైకి తీశాడు. ఫలితాంగా అప్పలనాయుడే  అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పైడిమాంబ ఆలయానికి  పూజారులుగా ఉంటున్నారని ప్రజలు చెబుతారు. ఈ కుటంబానికి చెందిన పూజారే సిరిమాను ఉత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆసీర్వదిస్తారు.
అమ్మవారు విగ్రహం చెరువులో దొరకడం వెనక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.
 పైడిమాంబ ఇతర గ్రామ దేవత వంటి దేవత కాదు. ఆమె గజపతి వంశానికి చెందిన ఆడపడు.గజపతి రాజు విజయరామరాజు చెల్లెలు. ఆమె కు చన్నప్పటినుంచి అధ్యాత్మికత అలవాటు పడింది.  దేవీ ఉపాసన చేసేది. అందుకే యుధ్దాలన్నా హింసా అన్నా గిట్టేది కాదని చెబుతారు.
ఈ కారణానే ఆమె బొబ్బిలి యుధాన్ని వ్యతిరేకించింది. నివారించేదుకు ప్రయత్నించింది.  సోదరుడు విజయరామరాజు  పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెకు నచ్చలేదు.  ఇందులో ప్రెంచి జనరల్  బుస్సీ కుట్ర ఉందని, అతగాడికి అన్న  లొంగిపోయి యుద్ధానికి తలపడ్డాడని ఆమె అనుమానం.
అందుకే యుద్ధం వద్దని నచ్చ చెప్పింది. నీ ప్రాణాలకు ముప్పు వుందని హెచ్చరించింది. ఈ ప్రాంతంలో మశూచి ప్రబలడం మంచిశకున కాదని చెప్పింది. నిజానికి విజయరామరాజు భార్యకూడా మశూచి బారిన పడ్డారు.  అయితే,  విజయరామరాజు చెల్లెలి సలహాలను ఖాతరు చేయలేదు .
1757 జనవరి 23న లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. శత్రుపక్షానికి చెందిన  బొబ్బిలి సైనికులు తాండ్రపాపరాయుడి నాయకత్వంలో   విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు.
బొబ్బిలియుద్ధానికి విజయరామరాజు ఎలా వెళ్లాడో ఆనందరంగ పిళ్లె తన డైరీలో    (The Diary of Ananda Ranga Pillai) విపులంగా రాశాడు. ఈ యుధ్దం ఎంత అన్యాయయిందో కూడా ఆయన డైరీ వల్ల తెలుస్తుంది. తనఆధిపత్యాన్ని అంగీకరించడంలేద, తనని గౌరవించడం లేదని బొబ్బిలి రాజు అంతమొందించాలనుకుని, విజయరామరాజు బుస్సిదొరతోచేతులు కలిపాడు. రెండు వేల గుర్రాలు, 40వేల మందిసైనికులు, 8వేల ఫిరంగులతో  దాడి  బొబ్బిలిమీద దాడి జరిపాడు. ఒకవైపు బుస్సీ సైన్యం మరొక వైపు నుంచి విజయరామ రాజు సైన్యం కోటలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు.  ఏ ఒక్కరు బతికినా శత్రువుగా ఎదుగుతాడని బుస్సీ చెప్పడంతో కోటలో ఉన్న అడ,మగ, పిల్ల తేడాలేకుండా చంపాలని ఆదేశించాడు.  దాదాపు పది వేల మంది చనిపోయారని ఆనందరంగపిళ్లే రాశారు.
కానీ విజయం విజయరామరాజునే వరించింది. బొబ్బిలి కోట్ల పతనమయిన రోజు  రాత్రి  విజయరామరాజు విజయగర్వంతో కోట సమీపంలో గుడారం వేసుకుని ఉన్నపుడు  తాండ్ర పాపరాయుడే వచ్చి కత్తి పొడిచి చంపాడు. ( అయితే, ఆనందరంగ పిళ్లే డైరీలో మాత్రం బొబ్బిరాజు రంగా రావు మనిషి ఒకడు వచ్చి గుడారంలోకి చొరబడి చంపాడని, తర్వాత అతనిని సైనికులు చంపారని వుంది.)
పైడిమాంబ చెప్పింది ఇలా నిజమయింది.
అయితే,ఆమె  చివరి క్షణం వరకు ఈ యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేసింది. యుద్ధ సన్నాహాలు జరుగుతున్నపుడు  రోజు రాత్రి ఒక దేవి ఆమెకలలోకి వచ్చింది. ఆమెసోదరుడు హతం కాబోతున్నట్లు చెప్పింది.
దీనితో పైడిమాంబ భయపడింది. సోదరుడిని కాపాడుకోవాలని భావించింది.  పతివాడ అప్పలనాయుడు మరికొందరితో కలసి బొబ్బిలి ప్రయాణమంది.  మార్గమధ్యంలో ఆమె మైకం వచ్చింది. తన వాళ్లందరిని పిలిచి తాను వెళ్లిపోతున్నట్లు, యుద్ధాన్నినివారించడం కష్టమవేుతన్నట్లు చెప్పింది.  వూహించినట్టే  ముప్పుజరుగబోతున్నదని చెప్పింది. అంతేకాదు, తను వెళ్లిపోయాక థన  విగ్రహం  పక్కనున్న చెరువులో లభిస్తుందని, దానికి  నిత్త్య పూజలు చేయాలని కూడా చెప్పంది. తర్వాత ఆమె చనిపోయింది.
అప్పలనాయుడు చెరువులోనుంచి విగ్రహం తీసుకువచ్చి ప్రతిష్టించాడు.