(Ahmed Sheriff)
చిత్ర నిర్మాణానికి సంబంధించి భారతదేశం సూపర్ పవర్ అయిపోయింది. యేటా 11.5 శాతం పెరుగుదలతో మొత్తం బిజినస్ 2020 నాటికి 3.7 బిలియన్ డార్లకు చేరకుంటుందని ఆ మధ్య అంచనా వేశారు.కోవిడ్ తో కొంత స్తబ్ధత రావచ్చుగాని, మళ్లీ మూవీ ఇండస్ట్రీ పుంజుకుంటుందనడంలో అనుమానం లేదు. 2017లో సినిమా ఇండస్ట్రీ బిజినెస్ 2.1 బిలియన్ డాలర్లు. సినిమాకు భారతదేశానికి ఉన్న అనుబంధం ఏమిటి?
సినిమా, అనేది ప్రతి రోజూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో, ప్రతి భారతీయుడిని ఒక నిముషమైనా తాకే ఒక శక్తి వంతమయిన మాట. మనకు సమాచారాన్ని అందించడం లోనూ, ఒక వినోద మాధ్యమంగానూ సినిమాకు ఎంతో ప్రాధాన్యత వుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ మనదేశం లో మనుషులకు వినోదాన్ని పంచి, ఉల్లాస పరిచే ఏకైక సాధనంగా సినిమా వుండిందనడం లో అతిశయోక్తి లేదు.
అప్పట్లో ప్రజలు పావలా పెట్టి ఒక సినిమా చూసేసి దాన్లో ని విషయాలను పది వారాల పాటు చర్చించి అనందించేవారు. ఎవరైనా దూరపు బంధువులు, వచ్చినపుడు వారు సినిమా చూపిస్తారు అని ఆనందపడిన రొజులున్నాయంటె మనుషుల జీవితాల్లో సినిమా ప్రాధాన్యత ఎంత వుండిందో తెలుస్తుంది.
అప్పట్లో ఈ మాధ్యమం దాదాపూ అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులో వుండింది. సినిమా చూడటం అనేది ఒక ఉల్లాస విషయంగా మనుషుల జీవితాల్లో భాగమైపోయి వుండింది. కొంతకాలం వరకూ అది ఒక వినోద కాలక్షేపంగానే వుండింది. కాని రాను రాను సినిమా రంగం సినిమాల ద్వారా విజ్ఞాన సమాచారాన్ని ప్రాపంచిక విషయాలనూ ప్రజలకు చేరవేసే ప్రక్రియను, చేపట్టింది. మెల్లగా ఈ సినిమా మాధ్యమం జీవన శైలీ, సాంప్రాదాయాలు, సాంఘిక దురాచారాలూ, సంక్షేమాలు లాంటి సందేశాల్తో ప్రజల జీవితాల్లోకి దూసుకు వచ్చింది.
1931 ముందు వరకూ మూకీ సినిమాలన్నీ దాదాపు పౌరాణికాలే వుండేవి. 1931 లో మొదటి టాకీ ఆలం ఆరా ఒక జానపదంగా వచ్చింది. సినిమాను భారత ప్రజలు ఆదరించే తీరు నిర్మాతల్లో ఉత్సాహన్ని పెంచింది. ఆలం ఆరా సినిమా చూడటం కోసం ప్రజలు ఎగబడిఉన తీరు ఔత్సాహిక నిర్మాతల్లో సినిమా నిర్మాణం పట్ల ఆసక్తిని పెంచింది. మెల్లగా లో బడ్జెట్ సాంఘికాలు మొదలయ్యాయి. ప్రజలు సినిమాలంటే ఆసక్తి చూపడం మొదలు పెట్టారు.
భారత దేశం లో సినిమారంగం వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో, సినిమా నిర్మాణం ముఖ్యంగా ముంబై లో జరిగేది. భారత సినిమాలకు హింది సినిమా రంగం చిరునామా గా వుండేది. అనతి కాలం లోనె దక్షిణ భారత దేశం లో సినిమా రంగం ఉరుకులూ పరుగుల తో వ్యాప్తి చెందడం మొదలు పెట్టింది. హిందీ భాష సినిమాతో (బాలీ వుడ్) పాటు, అతి శీఘ్రంగా కన్నడ, మలయాళ భాషల సినిమాలూ (కోలీ వుడ్), తెలుగు తమిళ భాషల సినిమాలూ (టాలీ వుడ్) చిత్రసీమలు అభివృద్ధి చెంది ప్రపంచ స్థాయి సినిమా నిర్మాణానికి దారితీశాయి.
మామూలూ ఫార్మూలా చిత్రాలు వదిలి నిర్మాతలు అనేక జోనర్ల లోకి చొచ్చుకు పోయారు. బహు భాషా చిత్రలు రా సాగాయి అవకాశాల పరిధి పెరిగింది. ఆదాయం ఆకాశానికి ఎగిసింది. సినిమా అనేది ఒక మంచి వ్యాపార కారకంగా మారింది.
ఆలం ఆరా సినిమాకి రూ 45,000 ఖర్చు అయ్యాయని దాని నిర్మాత అర్దేశిర్ ఇరాని ఒక ఇంటర్వూ లో పేర్కొన్నాడు. ఇప్పుడు నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు అంటె, సినిమా అదాయం తెస్తుందనే.
ఈ పరిశ్రమ నటన, సంగీతం, నృత్యం, రచన లాంటి అనేక కళాత్మక రంగాల్లోనే కాకుండా ఛాయా చిత్రణ, శబ్ద గ్రహణం లాంటి సాంకేతిక విషయాల్లోనూ అనేక రకాల అవకాశాల్ని జీవనో పాధుల్నీ కల్పించింది .
ప్రపంచ స్థాయి సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు. ముందు పాన్ ఇండియా సినిమాలూ ఆ తరువాత అంతర్జాతీయ సినిమాలూ. విదేశీ మదుపరులు కూడా భారతీయ సినిమా రంగం కేసి ఆశావహంగా చూపు సారించారు.
“ స్లం డాగ్ మిలియనేర్”, “లైఫ్ ఆఫ్ పై” లాంటి చిత్రాల విజయం తరువాత విదేశీ నిర్మాతలు తమ సినిమాలను భారత దేశం లో తీయడానికి మొగ్గు చూపుతున్నారు. గతం లో రోజర్ మూర్ జేమ్స్ బాండు గా నటించిన “ఆక్టో పస్సీ”, టాం క్రూస్ “మిషన్ ఇంపాసిబుల్ – ఘోస్ట్ ప్రొటొకాల్” లాంటి సినిమాల కొన్ని భాగాలు భారత దేశం లో చిత్రీకరించ బడ్డాయి.
అయితే సినిమా నిర్మాణమేమీ పూల పానుపు కాదు సినిమా నిర్మాణం లో ని అంతర్గత కష్టాలతో పాటు, అనేక రకాల అనుమతులు పొందడమనే చట్ట బధ్ధ మైన మరో బాహ్య కష్టం కూడా వుంది. ఒక నిర్మాత దాదాపు 30 మంది అధికారుల దగ్గరినుండి 70 రకాల అంగీకార పత్రాలను పొందాలని చెబుతారు. ఈ పేపర్ వర్కు లోని జాప్యాలను అధిగ మించడానికి నిర్మాతలు ఇతర దేశాల లొకెషన్లు చూసుకోవడం పరిపాటి. ఇది వ్యయ ప్రయాసల తో కూడుకున్నది. ఈ అంగీకార పత్రాల జాప్యం తగ్గించ గలిగితే చిత్ర నిర్మాణం మరింత చురుగ్గా సాగే అవకాశం వుంటుంది.
ఇక రెండో సమస్య ఏమిటంటే, భారత దేశం లో అనేక కారణల వల్ల ఖర్చు కు తగ్గ రాబడి రావటం లేదు. థియేతర్ల కు వెళ్ళి సినిమాలు చూసే జనం తగ్గి పోయారు. దీనికి ఒక ముఖ్య కారణం పైరసీ ద్వారా ఈ చిత్రాలు ఇతర మాధ్యమాల్లో ఉపలబ్ధం కావడమే. దీన్ని ఆపాలి.
ఒక అంచనా ప్రకారం దాదాపు 1500 చిత్రాలు నిర్మాణమయినప్పుడు భారత సినిమా పరిశ్రమ వల్ల ఒక సంవత్సరం వచ్చిన వార్శ్షిక ఆదాయం 2.1 బిలియన్ల డాలర్లు. ఇదే ఆ సంవత్సరం అమెరికా కెనడాలు నిర్మించిన 700 చిత్రాల వల్ల వారికి వచ్చిన వార్షిక ఆదాయం 11 బిలియన్ల డాలర్లు. అయితే పైన చర్చించిన అనేక కారణాల వల్ల భారత సినీ పరిశ్రమకు వ్యయానికి తగ్గ ఆదాయం రావటం లేదు. ఈ కారణల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల్ని ఆప గల్గి తే భారత చిత్ర పరిశ్రమ, దాని చిత్ర నిర్మాణ సంఖ్య పరంగా, ప్రపంచ స్థాయి ని దాటిన ఆదాయాన్ని జమ చేయ గలదు.
యునెస్కో సంస్థ ఒక అంచనా ప్రకారం ఫీచర్ సినిమాల కొన్ని వివరాలు ఇలా వున్నాయి. 2005 వ సంత్సరం లో భారత దేశం లో 1041 చిత్రాలు నిర్మించబడ్డాయి. అదే అమెరికా లో 699 చిత్రాలు, చైనా లో 260 చిత్రాలు నిర్మించ బడ్డాయి. 2010 సంవత్సరం లో భారత దేశం లో 1274 , అమెరికాలో 792, చైనా లో 584 చిత్రాలు నిర్మించ బడ్డాయి. 2013 వ సంవత్సరానికి కల్లా భారత దేశం లో నిర్మించ బడిన చిత్రాల సంఖ్య 1724 కి పెరిగింది. అమెరికాలో 738 చిత్రాలు, చైనా లో 638 చిత్రాలు నమోదయ్యాయి. మిగతా దేశాల్తో పోలిస్తే చిత్రాల సంఖ్యలో వార్షికాభివృద్ధ్ధి భారత దేశం లో గణనీయంగా వుంది.
భారతీయ సినిమా స్థాయి ప్రపంచ స్థాయి సినిమాల తో పోటీ పడటమే కాకుండా, వార్శిక భారతీయ సినిమాల నిర్మాణ సంఖ్య ప్రపంచం లో ఏ దేశానికి అందని సంఖ్య గా ఎదిగి పోయింది. గత కొద్ది సంవత్సరాలుగా భారత సినీ పరిశ్రమ అదాయం చక్ర వడ్డీ పెరిగే రీతిలో ప్రతి సంవత్సరం పది శాతం రేటు తో పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం 2018 లో భారత సినీ పరిశ్రమ ఆదాయం దాదాపు 13,800 కోట్ల రూపాయలు. ఇది 2020 సంవత్సరపు చివరికి 23,800 కోట్ల కు చేరుతుందని అంచనా.
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610
Mob: +91 9849310610