విద్యార్థుల పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వైరస్ లక్షణాలున్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి వస్తే… వారిని దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించాలని సూచించింది.
కరోనాతో బాధపడుతున్న విద్యార్థులకు మరో తేదీన లేదా వేరే మార్గంలో పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. పరీక్ష కేంద్రాల వద్ద ఎక్కువమంది ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ సూచనలు అన్ని కాలేజీలకు, యూనివర్సిటీలకు వర్తిస్తాయని తెలిపింది.