పేటీఎం పేరుతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పేటీఎం కస్టమర్లకు ఫోన్ చేసి మాయమాటలు చెప్పి డబ్బులు కొట్టేస్తున్నారు. ఫోన్ చేసి టీమ్ వ్యూయర్ క్విక్ సపోర్ట్ (Teamviewer Quicksupport), ఎనీ డెస్క్ (AnyDesk) వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయిస్తున్నారు.
అనంతరం ఆ యాప్స్ ద్వారా కస్టమర్ ఫోన్ లోని వివరాలను యాక్సెస్ చేస్తున్నారు. తర్వాత కెవైసి (KYC), క్రెడిట్ కార్డు (Credit card), డెబిట్ కార్డు (Debit card) వివరాలు ఎంటర్ చేయించి ఖాతాలోని డబ్బును నొక్కేస్తున్నారు. అందుకే ఇలాంటి ఫోన్ కాల్స్, థర్డ్ పార్టీ యాప్స్ విషయంలో Paytm కస్టమర్లు అలెర్ట్ గా ఉండాలి.