ఎందాకా ఈ పయనం? నాసా 1977లో పంపిన వాయేజర్లు ఇపుడు ఎక్కడ ఉన్నాయి?

అమెరికా 43  సంవత్సరాల కిందట అంతరిక్షంలోకి పంపిన వాయేజర్లు (వాయోజర్-1, వాయోజర్ -2)ఇపుడెక్కడ ఉన్నాయి. అవి ఎంతకాలంలో విశ్వంలో ప్రయాణిస్తుంటాయి? మొన్న సెప్టెంబర్ 5 నాటికి వాయేజర్ 1 యాత్ర విశ్వయాత్ర ప్రారంభించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంకా దూసుకుపోతూనే ఉన్నాయి.
వయోజవర్ 1 ని  1977 సెప్టెంబర్ 5 ప్రయోగించారు. ఇది ఆగస్టు 25, 2012 వాయేజర్ 1 సౌరమండలం దాటి పోయింది. మానవ జాతి చరిత్రలో ఎవరూ , ఏ వస్తువూ వెళ్లనంతదూరం ప్రయాణించిన మానవ నిర్మిత వాహనంగా ఇదిచరిత్రలో మిగిలిపోయింది.
వాయేజర్ 2 ని ఆగస్టు 20,1977న అంటేవాయేజర్ 1 కంటే ముందుగానే ప్రయోగించారు. దీనికి కారణం, వీటికి నిర్దేశించిన రూట్  వేగంగా వెళ్లేందుకు వీలయ్యే రూట్. అందుకే 16 రోజులు ఆలస్యంగా ప్రయోగించినా, వాయేజర్ 1 డిసెంబర్ 15 నాటికి  వాయేజర్ 2 ను అధిగమించింది.
తర్వాత 2018 నవంబర్ 5 వాయేజర్ 2 కూడా సౌర మండలం దాటి నక్షత్ర లోకంలో (Interstellar space)లోకి ప్రవేశించింది.
దీనితో ఇవి మహాద్బుత ప్రయోగాలయ్యాయి.  ఈ వార్త రాస్తున్నప్పుడు ఈ రెండు వాయేజర్లు ఇంకా భూమికి దర్జాగా సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నాయి. వాయేజర్లను కంట్రోల్ చేయడం, వాటినుంచి వచ్చే సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడం డీప్ స్పేస్ నెట్ వర్క్ (DSN) నుంచి జరుగుతుంది. డిఎస్ ఎన్ అంటే అనేది గ్లోబల్ స్పేష్ క్రాఫ్ట్ ట్రాకింగ్ సిస్టమ్. దీనిని నాసా నడిపిస్తూ ఉంటుంది. డిఎస్ ఎన్ కు క్యాలిఫోర్నియా దగ్గిర మెజావ్ ఎడారిలో, మాడ్రిడ్ (స్పెయిన్ ), తిడిబిన్బిల్లా(అస్ట్రేలియా)లో యాంటెనా  కాంప్లెక్స్ లున్నాయి.
సెప్టెంబర్ 8న మధ్యాహ్నం తర్వాత 5 గంటలపుడు ఈ వార్త రాస్తున్నపుడు  వాయేజర్1   43 సంవత్సరాల, రెండు రోజుల  23 గంటల 15 నిమిషాల ప్రయాణం  పూర్తిచేసింది.  భూమినుంచి 13,979,085,107 మైళ్ల దూరాన ఉంది. సూర్యూనినుంచి 13,979,858,824 మైళ్ల దూరానా ఉంది. వాయేజర్ 1 గంటకు 38,026.77 మైళ్ల వేగంతో, వయేజర్2,  34,390.98 మైళ్ల వేగంతో దూసుకుపోతున్నాయి.

వాయేజర్  ఇంటర్ స్టెల్లార్ మిషన్  (VIM) లో అయిదు రకాల సైన్స్ ఇన్వేస్టిగేషన్స్ సాగుతున్నాయి. ఒక ఇన్వెస్టిగేషన్ కు ఒక్కొక్క శాస్త్రవేత్త ల బృందం ఉంది. ఇన్వెస్టిగేఫషన్లు ఇవే: మాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వెస్టిగేసన్ (MAG), లో ఎనర్జీ చార్జడ్ పార్టికల్ ఇన్వెస్టిగేషన్ ఏ(LECP), ప్లాస్మా ఇన్వెస్టిగేషన్ (PLS), కాస్మిక్ రే ఇన్వెస్టిగేషన్(CRS) , ప్లాస్మా వేవ్ ఇన్వెస్టిగేషన్ (PWS).
Heliosphere/NASA
వాయేజర్ 1 లో నాలుగు రకాల ఇన్వెస్టిగేషన్ పరికాలున్నాయి.  పైన పేర్కొన్న అయిదుఇన్వెస్టిగేషన్లను వీటితో చేస్తారు. అయితే ఇందులో కొన్నింటి చేత విద్యుత్ అదాచేసేందుకు పని మానిపించారు. వాయేజర్ 1 లో  ప్లానెటరీ రేడియో ఆస్ట్రానమీ ఇన్వెస్టిగేషన్ పనిచేయడం లేదు.  ఇదే విధంగా వాయేజర్ 2లో  అల్ట్రావయెలెట్ స్పెక్ట్రో మీటర్ సబ్ సిస్టమ్ పనిచేయడం నిలిపివేశారు.
విఐఎం (Voyager Interstellar Mission) లక్ష్యం ఏమిటి?
వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్ తొలి ఉద్దేశం వేరు, ఇపుడు జరుగుతున్నది వేరు.  సోలార్ సిస్టమ్ లోని ఇరుగుపొరుగు గ్రహాలను పరిశీలించేందుకు నాసా ఈ మిషన్ ప్రారంభించింది.ఇంకా స్పష్టంగా చెబితే జూపిటర్ (బృహస్పతి), శాటన్(శని)గ్రహాలను దగ్గిరనుంచి పరిశీలించేందుకు నాసా ఈ మిషన్ ప్రారంభించింది. ఈ రెండు ఈ గ్రహాలకు ఉన్న చందమామలను, శనిగ్రహ వలయాలను పరిశీలించడం వీటిపని. ఇవి చక్కగా చెప్పిన పనులన్నీ చేస్తుండటంతో రిమోట్ కంట్రల్ తో  వీటి శక్తి పెంచి సౌరమండలం చివరి గ్రహాలైన యురేనస్, నెప్ట్యూన్ లను పరిశీలించే పనిని కూడా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) శాస్త్రవేత్తలు వాటికి  అప్పగించారు.
నిజానికి వీటి జీవితకాలన్ని శాస్త్రవేత్తలు అయిదేళ్లుగా నిర్ణయించారు. ఈ అయిదేళ్ల జీవిత కాలాన్ని తర్వాత 12 సంవత్సరాలకు పెంచారు. దీనితో సౌరమండలంలో సూదూరంగా ఉన్న నాలుగు గ్రహాలను, వాటికి ఉన్న 48 చందమామలను అధ్యయం చేసే కార్యకమ్రం వీటికి అప్పచెప్పారు.

 

 

ఇవి తమకు అప్పగించిన పూర్తి చేసినా  ఇంకా ముందుకు పోతూ ఉండటం విశేషం. 1993లో  వాయేజర్ హీలియోపాజ్ (సౌరమండలం సరిహ్దద్దు)కు చేరింది.  ఈ సరిహద్దు దాటితే సౌరపవనాలు వెళ్లలేవు. అంటే ఆ స్థలాన సౌరావరణం (Heliosphere) ఒక బుడగలాగా కనిపిస్తుంది (పైపోటో). దీనిని బట్టి శాస్త్రవేత్తలు సౌరావరణం 120 ఆస్ట్రనామికల్ యూనిట్లు(ఎయు) దూరాన అంతమవుతుందని లెక్కించారు. ఒక ఎయు అంటే150 మిలియన్ కిలోమీటర్లు. అంటే సూర్యుడికి, భూమికి మధ్య దూరంతో సమానం. ఇక్కడ వాయేజరల్లో ఉన్న బ్యాటరీల విద్యుత్ ఆదా చేసుకునేందుకు అనేక పరికరాలను ఆపేశారు.
వాయేజర్ 1 లోని ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, రేడియో  మీటర్ హీటర్లను  2011డిసెంబర్ 1 ఆపేశారు. ఇలా ఒక్కొక్కటే అనే పరికాలను ఆఫ్ చేస్తూ వచ్చారు.ముఖ్యంగా కెమెరాలనుకూడా ఆఫ్ చేశారు. వీటినిఅవసరమయినపుడు ఆన్ చేయవచ్చు. ఇపుడది ముఖ్యం కాదు. ఎందుకంటే, నక్షత్రలోకంలో గాఢాంధకారం అలుముకుని ఉంది. అక్కడ నక్షత్రాల మిణుకుమిణుకులు తప్ప మరొకటి   కనిపించదు.అందువల్లకెమెరాల ఆన్ లో ఉంచి చేసేదేమీ లేదు.

వాయేజర్లు ఎంతకాలం పనిచేస్తాయి?
వాయేజర్1 లోని సైన్స్ పరికాల విభాగం 2021 దాకా పనిచేస్తుంది. వాయేజర్ 2  మాత్రం 2020 దాకా మించకపోవచ్చని అనుకుంటున్నారు. ఈ రెండింటిలో విద్యుచ్ఛక్తి సరఫరాకు  రేడియో ఐసోటోప్ ధర్మోఎలెక్ట్రిక్  జనరేటర్లున్నాయి. సంవత్సరానికి వీటి శక్తి 4 వాట్లు పడిపోతుంది. అందువల్ల ఏ పరికరాలను పనిచేయించాలి, వేటిని ఆపేయాలని వాయేజర్ టీములు నిర్ణయిస్తుంటాయి. 2025 దాకా ఒక  సైన్స్ పరికరమయినా పనిచేసేలా జాగ్రత్త తీసుకుంటున్నారు.

Like this story? Share it with a friend

2025 తర్వాత సైన్స్ డేటా అందకపోయినా, ఇంజనీరింగ్ డేటా ఇంకా కొన్ని సంవత్సరాలు అందుతూనే ఉంటుంది. అంత సుదూర నక్షత్ర లోకం నుంచి  భూమ్మీదికి సంకేతాలు పంపేందుకు ఎంత కరెంటు అవసరమనేదాన్నిబట్టి ఈ రెండు వాయేజర్లు డీప్ స్పేష్ నెట్ వర్క్ (DSN)కు 2036 దాకా అందుబాటులో నే ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అవి అలాగే నిరంతర బాటసారిలాగా ప్రయాణిస్తూఉంటాయి. వాయేజర్ 1  క్రీశ. 40,272 నాటికి అంటే ఇప్పటినుంచి మరొక 38,200 సంవత్సరాల తర్వాత, 1.7 ఉస్రా మైనర్  (లిటిల్ బేర్ లేదా లిటిల్ డిప్పర్) నక్షత్ర కూటమి (constellation) లోని ఒక నక్షత్రానికి 1.7  కాంతిసంవత్సరాల దూరానికి చేరుకుంటుంది. ఇలాగే, వాయేజర్ 2, క్రీ.శ 40,000 నాటికి  ఆండ్రామీడియా నక్షత్ర కూటమి లోని రాస్ 248 (Ross 248) అనే ఒక చిన్న నక్షత్రానికి 1.7 కాంతిసంవత్సరాల సమీపానికి చేరుకుంటుందని నాసా లెక్కించింది.
వాయేజర్ 1 లో గోల్డెన్ రికార్డు
Golden Record /NASA
ఏదో ఒక మూల ఎక్కడ ఒక చోట ఈ వాయేజర్ మానవ నాగరికతో సమానమయిన నాగరికత కలిగిన  జాతిని కనిపెడితే, భూమి గురించి ,ఇక్కడి ప్రజల గురించి వారికి తెలియచెప్పేందుకు ఒక గోల్డెన్ రికార్డును ఇందులో భద్రపరించారు. ఇందులో 55 భాషల్లో శుభాకాంక్షలు చెప్పడం రికార్డు చేశారు.  ఆరువేల సంవత్సరాల కిందట మాట్లాడిన సుమేరు భాష ఎక్కాడియన్ కూడా ఈ జాబితాలో  ఉంది.  అనేక ప్రాంతాలలోని మనుషుల ఫోటోలు, ప్రాంతాల విశేషాలు, బీతోవెన్ నుంచి చుక్ బెర్రీ దాకా వివిధప్రాంతాల సంగీతం తో 90 నిమిషాల  రికార్డింగ్, సముద్ర అలల సవ్వడి, పక్షలు కిలకిలా రావాలుఈ గోల్డెన్ రికార్డులో ఉన్నాయి.  ‘అంతేకాదు, ఈరికార్డును ఎలా ప్లేచేయాలో కూడా గ్రాఫిక్ గా  వివరించారు.
అయితే, విచారమేమిటంటే,అలుపెరుగని ఈ బాటసారుల ప్రయానం, తిరుగురాని ప్రయాణం

‘T is not too late to seek a newer world.
Push off, and sitting well in order smite
The sounding furrows; for my purpose holds
To sail beyond the sunset, and the baths
Of all the western stars, until I die.

(Ulysses: Alfred, Lord Tennyson)

Bon Voyage!