విత్తుముందా చెటు ముందా అనే చర్చ అందిరికీ తెలిసిందే. అయితే, ఇది ఇప్పట్లో తెగేది కాదు. అందుకని చర్చ ఇపుడు మరొక అంశం మీదకు మళ్లింది. ఒక విత్తనం భూమిలోపడితే, కొద్దిగా తేమ, గాలి,వెలుతురు సోకితే మెలకెత్తుతుంది. అలా కాకపోతే, విత్తనం విత్తనం లాగా చెడిపోకుండా ఎంతకాలముంటుంది?
సాధారణంగా రైతులు పంట నుంచి విత్తనాలు తీసి వచ్చేఏడాదికి భద్రపరుస్తుంటారు. ఇలా ఒక విత్తనాన్ని ఎంతకాలం భ్రద పరచచ్చు. ఒక విత్తనం ఎంతకాలం సజీవంగా ఉంటుందనే ప్రశ్న తలెత్తింది.దీనిని కనిపెట్టేందుకు ప్రపంచంలోనే ఒక ఆరుదైన ఒక అంతర్జాయ ప్రయోగం మంచకోండల్లో పాతాళంలో జరుగుతూ ఉంది.
పంటలూ అంతరించిపోతుంటాయో. ఎన్నో పోయాయి కూాడా. ఆశోకుడి కాలంలో పండిన పంటలెమిటి, అంతకు ముందు హరప్పా మొహంజోదారోల ప్రజలే పంటలు పండిచారు.శ్రీ కృష్ణ దేవరాయలు బియ్యం తిన్నాడా, జొన్నఅంబలి తిన్నాడా? ఇవన్నీ ప్రశ్నలే.
విత్తనాలు నశిస్తాయిన కాబట్టి రాజుల శాసనాలలాగా మిగలేదు. ఇపుడు విత్తనాలను శాశ్వతంగా భద్రపరించే వీలుందేమో చూసేందుకు ఒకప్రయోగం మొదలుపెట్టారు
రాబోయే తరాలకి నేటి పంటల గురించి తెలియచెప్పటమెలా, వాళ్లు ఈ విత్తనాలను విత్తి పంటలు పండిచుకోవడమెలా? దీనికి సమాధానమే ఈ ప్రయోగం.
ఇపుడు ప్రపంచంలో ఉన్న విత్తనాలన్నింటిని భద్రపరిచి భవిష్యత్తరాలకు అందించేందుకు ఈ ప్రయోగంచేపట్టారు. నార్వేకి ఉత్తర దృవానికి మధ్య స్వాల్ బార్డ్ (Svalbard) ద్వీపకల్పంలోని ఒక దీవిలోని కొండల కింద లోతైన పాతరలో విత్తనాలను నిలువ వుంచేందుకు వాల్ట్ ఏర్పాటు చేశారు. దీనిని గ్లోబల్ సీడ్ వాల్ట్ (Global Seed Vault) అని పిలుస్తారు.
విత్తనాలను సేకరించి ఎన్ని శతాబ్దాలైనా ఇక్కడ నిల్వ వుంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రకృతివైపరీత్యాలను, మనిషి సృష్టించే యుద్ధాల వంటి ఉపద్రవాలను తట్టుకుని నిలబడగలిగేలా ఈ వాల్ట్ ను తయారు చేశారు.
ప్రపంచంలో ఎక్కడా లేనంత వైవిద్యం ఇక్కడ విత్తనాలను సేకరించి భద్రపరుస్తున్నారు. దీని వెనక ఇక్రిశాట్ (ICRISAT)వంటి ఆరు అంతర్జాతీయ వ్యవసాయపరిశోధనా సంస్థల జీన్ బ్యాంకులున్నాయి. ఈ సంస్థలు 13 రకాల విత్తనాలను నిల్వచేసేందుకు అందిస్తున్నాయి. ఇందులో ఇక్రిశాట్ నాలుగు రకాల విత్తనాలను అందిస్తూ ఉంది. అవి: వేరుశనగ(Groundnut), శనగ (pegion pea) సజ్జలు (Pearl millet), లావు శనగలు (chick pea) ఉన్నాయి.
గ్లోబల్ సీడ్ వాల్ట్ ఉద్దేశం
గ్లోబల్ సీడ్ వాల్ట్ 2008లో ప్రారంభమయింది. దీనిని క్రాప్ ట్రస్ట్ (crop trust), నార్వే ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. క్రాప్ ట్రస్టు ని అంతర్జాతీయ అహార సంస్థ (FAO), కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ ఆగ్రికల్చరల్ రీసెర్చ్ (CGIAR) సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.
పంటలకు నశించే స్వభావం ఉంటుంది. ఒక పంట అంతరిస్తే, డైనోసార్ అంతరించినట్లే. ఇక మళ్లీ తిరిగిరాదు. అందువల్లప్రపంచ ఆహార భద్రత రీత్యాపంటలను కాపాడుకోవాలనే చర్చ ప్రపంచమంతా ఎపుడో 1996లోనే మొదలయింది. 150 దేశాలుకలిసి దీనికోసం Global Action Plan తయారు చేశాయి. దీని పలితమే సీడ్ వాల్ట్.
ఈ పంటల విత్తనాలు కాపాడుకునేందుకు ప్రపంచంలో అక్కడక్కడా లోకల్ గా 1700 జీన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి కాని వాటి పనితీరు శాశ్వత భద్రత కల్పించేలా లేదు.
భూకంపాలవల్ల, యుద్ధాల వల్ల, టెక్నికల్ లోపాల వల్ల ఇవన్నీ చెడిపోయే అవకాశం ఉంది. అందువల్ల శాశ్వత ఏర్పాటు అవసరమని భావించి సీడ్ వాల్ట్ ఏర్పాటుచేశారు.
విత్తనాలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ఇలాంటి పంటల విత్తనాలను కనీసం వందేళ్ల పాటు నిల్వచేసేలా ఈ వాల్ట్ ను నిర్మించారు. దాని వల్ల భవిష్యత్తులో కూడా ఈ పంటలు అందుబాటులో ఉంటాయి. ప్రపంచంలో ఇపుడు ఆహారంగా ఉపయోగపుడుతున్న కొన్ని లక్షల రకాల విత్తనాలను భద్రపరచాలి. ఎంతవరకు, అవిజీవించి ఉండేంతవరకు?
ఈ వాల్ట్ ఎక్కడుంది ?
నార్వేకి ఉత్తర దృవానికి మధ్య మంచుకొండల్లో, మనుషులు అంత ఈజీగా ప్రవేశించలేనివిధంగా ఒకకొండదిగువన ఈ వాల్ట్ నిర్మించారు. స్వాల్ బార్డ్ ను ఎంపిక చేయడం వెనక కారణం మారమూల ప్రాంతం కావడమే. సాధారణంగా మనుషలెవరూ వెళ్లలేనంత దూరాన ఉంటుంది.ప్రత్యేక ఏర్పాటు ఉంటే తప్ప అక్కడికి చేరుకోలేరు.
వాల్ట్ ప్రవేశ ద్వారం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ కొండ దిగవన 100 మీటర్ల లోతున వాల్ట్ ఉంటుంది. భూకంపం వంటి ప్రమాదాల ముప్పులేని జియోలాజికల్ స్టేబుల్ ప్రదేశం. ఇక్కడి గాలితేమ కూడా బాగా తక్కువ. వాతావరణంలో మార్పు లొచ్చి సముద్రమట్టం పెరిగిన సముద్రవరద కూడా తాకలేనంత దూరంగా వాల్ట్ ఉంటుంది. ఈ ప్రాంతం పెర్మాఫ్రోస్టు కిందకువస్తుంది. అంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఎపుడూ మైనస్ 32 డిగ్రీల సెంటిగ్రేడ్ లలో ఉంటుంది. అంటే, ఇక్కడ కోల్డ్ సోర్టేజి వ్యవస్థ విఫలమయినా న్యాచురల్ కండిషన్స్ వల్ల ఎపూడూ టెంపరేచర్ ఫ్రీజింగ్ స్థాయిలో ఉంటుంది.
ఎన్ని విత్తనాలు భద్ర పరవచ్చు
ఈ సీడ్ వాల్ట్ లో 45 లక్షల రకాల పంటలను భద్రపరచవచ్చు. ప్రతి వెరైటీకి 500 విత్తనాలుభద్రపర్చవచ్చు. అంటే మొత్తంగా 2.5 బిలియన్ విత్తనాలను ఇక్కడ భద్రపర్చవచ్చు. ఇప్పటికి 980,000 వేల విత్తనాలు సేకరించారు. ఇందులో ఆసియా, ఆఫ్రికా దేశాల ఆహారపంటలై మొక్కజొన్న, వరి, గోదుమ, అలసందలు (cowpea),జొన్న, యూరోప్, దక్షిణ అమెరికా కి చెందిన వంకాయ, లెట్యూస్, బార్లీ, ఆలు వంటి పంటలున్నాయి.అంటే ప్రపంచంలో ప్రజలు తింటున్న ఆహారపంటలలో చాలా మటుకు ఇక్కడి వచ్చేశాయన్నమాట.
ఎలా నిల్వ చేస్తున్నారు?
విత్తనాలను నిల్వ చేయాలంటే మైనస్ 18 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ అవసరం. ఇందుల ప్రత్యేకంగా తయారు చేసిన త్రీఫ్లై ఫాయిల్ కవర్లలో విత్తనాలను భద్రపరుస్తారు. ఈ ఫాయిల్స్ ను మళ్లీ ప్రత్యేకంగా తయారుచేసిన పెట్టెల్లో పెట్టి వాల్ట్ లో భద్రపరుస్తారు.వాల్ట్ లో కనిష్ట ఉష్ణోగ్రత, తేమ వల్ల విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండుదు. విత్తనాలలో జీవభౌతిక చర్యలన్నీ స్తంభించి పోయి ఉంటాయి. దీని వల్ల అవి ఎక్కువ కాలం బతికి ఉంటాయి. ఎంతకాలం బతుకి ఉంటాయో ఈప్రయోగం వల్ల తెలుస్తుంది కూడా.
విత్తనాల వారసత్వం ఎవరికి అందిస్తారు
విత్తానాలను ఒక అంతర్జాతీయ ఒప్పందం మేరకే ఇక్కడ డిపాజిట్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఒప్పందం లోని అర్టికల్ 15 కిందికి వచ్చే విత్తాలను, లేదా దేశీయ రకాలను మాత్రమే వాల్ట్ భద్రపరించేందుకు స్వీకరిస్తుంది. ఇక్కడ భద్రపరిచిన విత్తనాలు ఆదేశాలకు తప్ప మరొకరికి అందుబాటులో ఉండవు. దీనిని బ్లాక్ బాక్స్ సిస్టమ్ అంటారు.దీని ప్రకారం డిపాజిటర్ మాత్రమే ఈ విత్తనాలను తీసుకోవాలి. ఇక్కడి విత్తనాల పెట్టెలను వాళ్లు మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉంటుంది.