తిరుపతి, ఆగస్టు 30: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.
ఆదివారం ఉదయం కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, చందనంతో అభిషేకం నిర్వహించారు.
రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర, వేద శాత్తుమొర నిర్వహించారు.
అనంతరం ఉత్సవమూర్తులు కుంభం విమానప్రదక్షిణంగా సన్నిధికి తీసుకువచ్చారుు
ఈ కార్య్రకమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈవో శ్రీమతి వరలక్ష్మీ, సూపరింటెండెంట్లు శ్రీరాజ్‌కుమార్ తదితరులు పాలొన్నారు.