ప్రపంచంలో సంపన్నదేవుళ్లలో తిరుమల వేంకటేశ్వరుడు ఒకరు. ఆయనకు వడ్డీ కాసుల వాడని పేరు. భక్తులకు వరాలిస్తాడు. కానుకలు తీసుకుంటాడు. ఆయన విష్ణుమూర్తి అవతారం కదా. ఆయన భార్య లక్ష్మీదేవి.ఆమె ధనలక్ష్మి. పేదవాళ్లు పైసలు కానుకగా ఇచ్చినా కోటీశ్వరులు కోట్ల కానుకలిస్తున్నారు. ఇలా ఏడుకొండలవాడిసంపద విపరీతంగా పెరిగిపోయింది. ఆయన ఆస్తి వేలకోట్లకు చేరుకుంది. ఆయన దగ్గిర ఉన్న బంగారం కూడా వేలకేజీలకు చేరింది.
అయినా సరే, ఈ సారి శ్రీవారికి కాసుల కష్టాలు మొదలయ్యాయి. కరోనా లాక్ డౌన్ తో తిరుమల భక్తుల రాక నిలిచిపోయింది. వడ్డి కాసుల వాడికి కాసుల కటకటమొదలయింది. లాక్ డౌన్ సడలించినా భక్తుల రాక అనుకున్నంతగా పెరగలేదు. దానితో రాబడి పడిపోయింది. అందువల్ల నెల వారీ ఖర్చుల కోసం శ్రీవారి పేర బ్యాంకులలో ఉన్న డిపాజిట్ల నుంచి వడ్డీని నెలనెలా డ్రాచేసుకోవాలనుకుంటున్నారు.
శుక్రవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇంతకి శ్రీవారి పేర బ్యాంకులలో ఉన్న డిపాజిట్లు ఎంతో తెలుసా? అక్షరాల 12 వేల కోట్లరుపాయలు. ఇంతవరకు ఈ డిపాజిట్ల మీద మూనెళ్లకొకసారి, ఆరునెలల కొకసారి వడ్డీ వసూలు చేసుకుంటూ వచ్చింది.అయితే నెలనెలా ఖర్చుకోసం నెలానెలా డబ్బు వచ్చేలా డిపాజిట్ల అడ్వయిజరీ మార్చాలని నిర్ణయించింది.
ఇలా వచ్చిన డబ్బుతో సిబ్బంది జీతాలు, స్వామి కైంకర్యాలకయ్యే ఖర్చులను భరించాలని నిర్ణయించింది. బ్యాంకులలో ఉన్న 12 వేల కోట్ల పైబడిన డిపాజిట్ల మీద యేడాదికి రు. 706 కోట్ల వడ్డీ వస్తుంది. శ్రీవారికి హుండీ తర్వాత వచ్చే పెద్ద ఆదాయం ఈ వడ్డీ కాసులే.
హుండీనుంచి ఈ ఏడాది 1,313 కోట్లరుపాయలు వస్తాయని బడ్టెట్ లో పేర్కొన్నారు. ఈ వార్షిక బడ్జెట్ రు. 3,309 కోట్లు. అయితే, రాబడి పడిపోవడంతో బడ్జెట్ ప్లాన్ తలకిందులయింది.
ఎందుకంటే, కోవిడ్ కారణంగా గుడిని మొత్తంగా 80 రోజుల పాటు మూసేశారు. లాక్ డౌన్ సడలించాక రో జూ పది పన్నెండు వేల మంది భక్తులను అనుమతించాలని భావించారు. అయితే, కరోనా భయం కారణంగా ఏ ఒక్క రోజూ కూడా అయిదు వేల మించి భక్తులు రాలేదని తెలిసింది. అందువల్ల డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ తొ టిటిడి కార్యకలాపాలు నడిపించాలని నిర్ణయించారు.దీనికోసం షార్ట్ ట ర్మ్ డిపాజిట్లను లాంగ్ టర్మ డిపాజిట్లుగా మార్చితే కొంత ఎక్కువగా వడ్డీ వస్తుందని టిటిడి అధికారులు ఆశిస్తున్నారు.
ఇపుడు గోల్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ 2.5 శాతమే. ఈడిపాజిట్లను 12 సంవత్సరాల కాలానికి పెంచితే వడ్డీరేటు పెరుగుతుంది.
టిటిడి కి భక్తులు కేజీకేజీల ఆభరణాలను కానుకలుగా సమర్పిస్తుంటారు. ఇందులో కిరీటాలు, వడ్డాణాలు, ఇతర అభరణాలు ఉంటాయి. అయితే,వీటిని ఎపుడూ శ్రీవారికి అలంకరించరు. దీన్నంతా జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేస్తారు.
జాతీయ బ్యాంకులలో నే డిపాజిట్ చేయాలని 2000 సంవత్సరంలో ప్రభుత్వం ఆదేశించింది. అయితే 2015 రిజర్వు బ్యాంక్ గోల్డ్ మానేటైజేషన్ టిటిడి 5,387 కేజీల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసింది. మరొక 1938 కేజీలు ఇండియన్ వోవర్ సీస్ బ్యాంకులో, 1,381కేజీలు పిఎన్ బిలో డిపాజిట్ చేశారు. ఈ మధ్య పిఎన్ బి డిపాజిట్ ను కూడా స్టేట్ బ్యాంక్ కు మార్చారు.