జగన్ కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: టిడిపి ఎమ్మెల్యే అనగాని

(అనగాని సత్య ప్రసాద్, ఎమ్మెల్యే, తెలుగుదేశం)
రాష్ట్రంలో స్కూళ్లు ఓపెన్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు. కరోనా కి భయపడి తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ముందుకు రావడం లేదు.
రాష్ట్రంలో రోజుకి 10 వేల కు పైగా కరోనా కేసులు నమోదవుతుంటే ఈ సమయంలో స్కూళ్లు ఓపెన్ చేస్తారా?
మీ పథకాల ప్రచార అర్భాటం కోసం పిల్లల ప్రాణాల తో చెలగాటమాడుతారా?
జగనన్న విద్యా కిట్స్ పంపిణీ చేయాలంటే వాలంటీర్ల చేత ఇంటిఇంటికి వెళ్ళివిద్యార్థులకు అందజేయాలి. అంతే తప్ప మీ రాజకీయ ప్రచారం కోసం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దు.
విద్యా శాఖ మంత్రి కరోనా బారిన పడి ఇతర రాష్ట్రాల్లో ఉండినా ఏపీలో మాత్రం స్కూళ్లు తెరుస్తామనటం వింతగా ఉంది.
వైసీపీ ప్రభుత్వం మద్యం షాపులు తెరిచి మందు బాబులకు టీచర్లను కాపలా పెట్టి వందల మంది టీచర్లను కరోనా బారిన పడేశారు.
ఇప్పుడు స్కూళ్లు తెరచి విద్యార్థులను కరోనా బాధితుల్ని చేస్తారా? మన రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి ముఖ్యమంత్రి బయటకు రావడం లేదు.
విద్యార్థులు బడులకు ఎలా వస్తారు? ఎస్సి, బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో కరోనా దృష్ట్యా అదనంగా ఎలాంటి సదుపాయాలు కల్పియించలేదు. మరి స్కూళ్లు ఎలా తెరుస్తారు?
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు తెరవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి.