రాయలసీమ సాంస్కృతిక వేదిక ప్రతి సంవత్సరం మహాకవిసమ్మేళనం నిర్వహిస్తూ వస్తున్నది.
ఈ సంవత్సరం సీమ సాంస్కృతిక అంశాల నేపథ్యంగా నాలుగవ “రాయలసీమ సాంస్కృతిక కవిసమ్మేళనం” ను సెప్టెంబర్ 6, 2020, ఆదివారం ఉదయం 10-00 గంటలకు అంతర్జాల వేదిక ద్వారా నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సభ్యులు యం.రవికుమార్, పి.రాజశేఖరరెడ్డి కోరారు.ఫోన్ నెంబర్ 99639 17187.
సీమ భాష, కళలు, ఆచార సంప్రదాయాలు, జానపదం, జీవన విధానం, భౌగోళి విశిష్టత, ప్రసిద్ధ స్థలాలు, చారిత్రక ఔన్నత్యం, మహాపురుషులు, సీమ సంస్కృతికి ఎదురవుతున్న ఇబ్బందులు తదితర సాంస్కృతిక అంశాలపై కవులు పాల్గొనాలని వారు ఆహ్వనిస్తున్నారు. కవులు 99639 17187 నెంబరును సంప్రదించాలని కోరారు.
కవిత విషయానికి లోబడి, సంక్షిప్తంగా, కవితా లక్షణాలతో ఉండాలి. సీమ సాంస్కృతిక కవిసమ్మేళనం కోసమే ప్రత్యేకంగా కవిత రాయలి. ఎంపికయిన కవితలను ప్రత్యేకంగా సంకలనంగా తీసుకొస్తాం.
రాయలసీమ బాగోగులకోసం, సాంస్కృతికోద్యమంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో కవులంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరుతున్నారు.