శ్రీశైలం వెళ్లకుండా మల్లు రవి, రేవంత్ అరెస్ట్, ఇది అప్రజాస్వామికం : కాంగ్రెస్

శ్రీశైలం పవర్ హౌస్ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళుతున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవిని అరెస్టు చేయడాన్ని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య ఖండించారు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని దానిని కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారనీ ఈ రోజు తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అత్యంత హీనా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

‘శ్రీశైలం దుర్ఘటన బాధితులకు కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా? ఈ సంఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ వెళ్లేత ముఖ్యమంత్రి కెసిఆర్ కు భయమెందుకు? దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? ’ అని కొమరయ్య ప్రశ్నించారు
ప్రప్రత్వంభు వెంటనే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డినీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, సి.ఎం.డి ప్రభాకర్ రావు పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

ఇదే విధంగా మృతుల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 

విలేకరుల సమావేశంలలో  భుసనవేని సురేష్ గౌడ్, నెత్తేట్ల కుమార్, వేముల రాజు, సుత్రపు పరమేశ్, బొడ్డుపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు