ఈ రోజు కవర్ పేజీ కెక్కిన వినాయక విగ్రహం ప్రపంచంలోనే అరుదైన విగ్రహం.
ఇది 2010, ఫిబ్రవరి రెండో వారంలో లో ఇండోనేషియా, యోగ్యకర్తా లోని ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ ఇండోనేషియాలో ఒక భవన నిర్మాణానికి తవ్వకాలు జరుగుతున్నపుడు బయటపడింది.
ఇది క్రీ.శ 9వ శతాబ్దానికి చెందిందని చరిత్రకారులు చెప్పారు. ఈ విగ్రహం చెక్కుచెదరకుండా అక్కడి భూమిలో పూడిపోయి ఉన్న ఒక ఆలయంలో కనిపించింది.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/entertainment/the-only-telugu-actor-who-played-both-hero-and-heorin-on-stage-and-silver-screen-vipranarayana-anr/
ఈ విగ్రహం, గుడి ఒకపుడు ఇండోనేషియా ప్రాంతంలో హిందూ సంస్కృతి వర్ధిల్లిందనేకు నిదర్శనంగా చెబుతున్నారు.
ఇపుడేమో ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం.ఇండోనేషియాలో ఇస్లామిక సంస్కృతి నాటి హిందూమత ఆనవాళ్లు చాలా కనిపిస్తాయి.
ఇండోనేషియా ఒకప్పుడు అన్ని మతాలు కలగలిసిని దేశం. ఉద్రికత్త, వైషమ్యాలు లేకుండా ఇలా మతాల సహజీవనం ప్రపంచంలో అరుదు. ఉదాహరణకు జావాలో ముస్లిం, హిందూ, బౌద్ధం సహజీవనం చేయడం చూడవచ్చు. యోగ్య కర్త నగర నడిబొడ్డున యోగ్యకర్త సుల్లాన్ ప్యాలస్ ఉంటుంది.పట్టణ శివార్లలో ప్రపంచంలోనే పెద్దదని పేరున్న భౌద్ద నిర్మాణం ‘బొరొబుదూర్’ (Borobudur) ,ఇండోనేషియాలోనే పెద్ద దయిన హిందూ ఆలయం ‘ప్రంబనన్’ ఉంటాయి.
ఇపుడుఇండోనేషియాలో 90 శాతం మంది ముస్లింలున్నారు. హిందువులు, బౌద్ధులుబాగా తక్కువ. చాలా కాలంలో జావా ద్వీపంలో హిందూ, బౌద్ధమతాలు ప్రాచుర్యంలో ఉండేవని తెలిసిందే.
ఇస్లామిక్ యూనివర్శిటీ క్యాంపస్ తవ్వకాలలో రెండు చిన్నచిన్న ఆలయాలు బయటపడ్డాయి. 1100 సంవత్సాల కిందటివి. అయినా ఏ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
“This temple is a quite significant and very valuable because we have never found a temple as whole and intact as this one,” అని ఈ తవ్వకాల నుంచి జాగ్రత్త ఆలయాన్ని వెలికి తీస్తున్న పురాతత్వ వేత్త డా. బుధీ శాంకొయో చెప్పారు. ఈ ఆలయంలో దొరికిన విగ్రహాలు, సహాజంగా ఆలయాలలో ఎక్కక ఏర్పాటు చేస్తారో అక్కడ చెక్కు చెదరకుండా ఉండటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇది మా పూర్వీకుల సంస్కృతిని అర్థం చేసుకునేందుకు పనికొస్తుందని డా. శాంకొయో అన్నారు.
ఈ విగ్రహం ఇపుడు అంతర్జాతీయ మార్కెట్లో $2,50,000 డాలర్ల దాకా చేస్తుందని, అందువల్ల దొంగలనుంచి దీన్ని కాపాడాల్సిన అవసరం ఎంతయినా ఉందని అయన అన్నారు.
ఇందులో ప్రధానాలయం 20X20 అడుగుల పరిమాణంలో ఉంది. సంపూర్ణంగా భధ్రంగా ఉన్న గణేశుడి విగ్ర హం కనిపించింది ఇందులోనే. ఈ గణేశుడు క్కడ శివలింగం పక్కనే కూర్చుని ఉన్నాడు. రెండో ఆలయం 20X13 అడుగుల పరిమాణంలో ఉంది. ఇక్కడ కూడా ఒక శివలింగం శిల్పాలను వెలికితీశారు. రెండు వేదికలను, నంది విగ్రహం కూడా ఇక్కడ బయల్పడ్దాయి. “ The temples are not so big, but they have features that we haven’t found in Indonesia before,” అని అక్కడి పురాతత్వ కార్యాలయ అధికారి హెర్ని ప్రమస్తుతి (Herni Pramastuti) చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ రాసింది.
ఈ రెండు ఆలయాలు చాలా బాగా భద్రపడి ఉన్నాయి. ఇది శతాబ్దాలుగా ఏ మాత్రం దెబ్బతినకుండా ఇలా భూమిలో భద్రంగా దాగి ఉండటం పట్ల పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమేయి ఉంటుంది?
ఇక్కడికి సమీపంలో మేరపి పర్వతం (Mount Merapi) అగ్ని పర్వతం ఉంది. దీని నుంచి పెల్లుబికిన లావా ఉత్తర దిశగా 7.5మైళ్లు ప్రవహించి అక్కడి నదిని ముంచేసి ఉంటుందని, అపుడు నదిలోని నీరు ఈ గుళ్ల మీదకు ప్రవహించి పూడ్చేసి ఉండాలని, అందుకే ఈ ఆలయాలు ఏమాత్రం దెబ్బతినకుండా ఇంతభద్రంగా ఉన్నాయని పరిశోధకులు బావిస్తున్నారు.
ఇండోనేషియాలో అక్కడక్కడ కనిపించిన హిందూ, బౌద్ధ ఆలయాలలో ఎక్కడా కనిపించనంతటి మెరుగ్గా ఈ ఆలయాల కుడ్యు చిత్రాలు కనబడుతున్నాయని పురాతత్వ కార్యాలయంలోని పరిశోధకుడు ఇండుంగ్ పంచ పుత్ర చెప్పారు.
ఇండోనేసియాలో హిందూమతం దాదాపు వెయ్యేళ్లు ప్రధాన మతంగా ఉండింది. అందుకే దాని ప్రభావం ఈ రోజు బలంగా కనిపిస్తుంది, అని గడ్జా మాదా యూనివర్శిటీ (Gadja Mada University) పురాతత్వ శాఖ ప్రొఫెసర్ తింబుల్ హర్యోనో చెప్పారు.
జావా ద్వీపానికి హిందూమతం అయిదో శతాబ్దంలో వ్యాపించింది. 15 శ శతాబ్దంనాటికి ఈ ప్రాంతం ఇస్లాం ప్రభాంలోకి వచ్చింది. ఇది అకస్మాత్తుగా వచ్చింది కాదు. నిదానంగా సాంస్కతిక సంపర్కంతో విస్తరించిచివరకు ప్రధానమతమయింది. అందుకే ఇండోనేషియాలోని తొలినాళ్ల మసీదులన్నీ మక్కా వైపు ముఖం చేసి ఉండవు. హిందూ గుళ్లలాగా తూర్పుముఖంగా ఉంటాయి. హిందూ ప్రభావం లో పెరిగినందునే, ఇక్కడి ఇస్లాం సంప్రదాయాలలో హిందూ, బౌద్ధాచారాల కోకోల్లని ప్రొఫెసర్ హర్యోనో చెప్పారు.
Like this story? Share it with friends!