శ్రీశైలం : తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు, మరణించి వారు:
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్‌రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
8,9 హైదరాబాద్‌కు చెందిన అమరాన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్
రెస్క్యూ టీమ్ అయిదుగురు మృత దేహాలను బయటకు తీసుకొచ్చారు.. మిగిలిన నాలుగు మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రమాద సమయంలో 19 మంది సిబ్బంది ఉండగా వారిలో 10 మంది సురక్షితంగా బయట పడ్డారు.
జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొలుత ప్యానల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జలవిద్యుత్ కేంద్రం మొత్తం వ్యాపించాయి.
ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ కేంద్రంలో 30 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడ్డారు. సహాయక సిబ్బంది మరో ఆరుగురిని రక్షించారు.
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్, ట్రాన్స్‌కో సీఈ రమేశ్ తదితరులు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు