(CS Saleem Basha)
పాతాళ భైరవి లో ” మోసం గురూ” అని మాంత్రికుడు ఎస్వీ రంగారావు తో చెప్పిన పాత్రధారే తర్వాతి కాలంలో హాస్యనటుడిగా తనదైన శైలిలో దాదాపు నాలుగు వందల పైచిలుకు సినిమాల్లో నటించిన “పద్మనాభం” అనబడే బసవరాజు వెంకట పద్మనాభరావు.
ఈ రోజు పద్మనాభం జయంతి (ఆగస్టు 20,1931).
కడప జిల్లా పులివెందుల దగ్గర ఉన్న సింహాద్రిపురం లో పుట్టిన పద్మనాభం సినిమా రంగంలోకి అడుగు పెట్టే సరికి రేలంగి వెంకట్రామయ్య, రమణారెడ్డి ఇ ఉద్దండులు లాంటి ఉన్నారు. ఆయన స మొదటిసారి వెండితెరకోసం ముఖానికి మేకప్ వేసుకున్నది ‘కృష్ణప్రేమ’ (1943) కోసం.పద్మనాభం వయసు 12 ఏళ్లు
గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో వచ్చిన ” మాయలోకం” ఆయన్ని నటుడిాగా నిలబెట్టింది . అప్పట్లో రేలంగి, రమణ రెడ్డి లకు జోడిగా తనదైన శైలిలో ఫిజికల్ కామెడీ పండించిన పద్మనాభం 2006లో ‘టాటా బిర్లా మధ్యలో లైసా’ సినిమా లో చివరి సారి నటించాడు. డైలాగులు పలకడంలో, ముఖకవళికలు మార్చడంలో పద్మనాభం ఉంది ప్రత్యేకమైన శైలి. 1960 నుంచి 1980 చివరి దాకా తెలుగు సినిమా కామెడీ కింగ్. 2010 లో ఆ నవ్వులు ఆగిపోయాయి.
1949 లో వచ్చిన ” షావుకారు” సినిమా తో పద్మనాభం కమెడియన్ గా స్థిర బడ్డాడు. తరువాతి సంవత్సరం విడుదలైన ” పాతాళ భైరవి” పద్మనాభానికి పేరు తెచ్చింది. దాని తర్వాత పద్మనాభం నవ్వుల రాజు గా స్థిరపడి పోయాడు. హాస్యనటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1960-70 ఈ మధ్యకాలంలో రాజబాబు సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపాడు. రాజబాబు లేనిదే సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. బయ్యర్లు రాజబాబు ఉంటేనే సినిమా కొనేవారు. అయినప్పటికీ పద్మనాభం తన శైలిలో నవ్వులు పండించాడు. ఎన్టీ రామారావు హీరోగా వచ్చిన దేశోద్ధారకుడు సినిమా లో ” ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడు అన్నారు..” అన్న పాటలు మొదటిసారి పద్మనాభం ఒక వైవిధ్యమైన పాత్రలో చక్కటి నటనను ప్రదర్శించాడు.
పద్మనాభం నిర్మాతగా 8 సినిమాలు తీశాడు. అందులో రామారావు హీరోగా తీసిన ” దేవత” (1964) సినిమా సూపర్ హిట్ అయింది. మిగతా సినిమాలు పర్వాలేదు.. దర్శకుడిగా, హీరోగా తీసిన ” పెళ్లి కాని తండ్రి” సినిమా కూడా నిరాశపరిచింది. దర్శకుడిగా శ్రీ రామ కథ, కథానాయక మొల్ల, జాతకరత్న మిడతంబొట్లు సినిమాలు పద్మనాభం ఖాతాలో ఉన్నాయి. కథానాయక మొల్ల సినిమాకు బంగారు నంది అవార్డు రావడం విశేషం.
పద్మనాభం తన మిత్రుడు నరసింహ రావు తో కలిసి ” రేఖ అండ్ మురళి ఆర్ట్స్” అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఆ సంస్థకు సంగీత దర్శకుడు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ను శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమా ద్వారా సినీరంగానికి పరిచయం చేసిన ఘనత పద్మనాభానిదే. ఆ తర్వాత కథానాయక మొల్ల ఈ సినిమాలో కూడా ఎస్పి పాడాడు.
ప్రముఖ జర్నలిస్టు, విమర్శకుడు ఇమంది రామారావు ప్రకారం, స్నేహితులు మోసపూరితంగా పద్మనాభం ఐదు సినిమాల నెగిటివ్ రైట్స్ వారి పేరు మీద రాయించుకోవడం వల్ల పద్మనాభం చాలా ఇబ్బందులు, నిరాశా నిస్పృహలకు గురి కావడం జరిగింది. సినిమాలపై దృష్టి పెట్టలేకపోయాడు. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. అలా చాలా సినిమాలు పోయాయి. చివరి రోజుల్లో ఆర్థికంగా చితికిపోయి 2010 ఫిబ్రవరి, 20 న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)