కోవిద్ నిబంధనలు పాటిస్తూ వినాయక మండపాలను ఏర్పుటుచేసుకొని వేడుకలను జరుపుకొనే వారికీ ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దు అని పోలీస్ , రెవిన్యూ , ఇతర అధికారాలను ఆదేశించాలని ముఖ్యమంత్రి వై యస్ . జగన్ మోహన్ రెడ్డి గారికి వైసిపి రెబెల్, నర్సపూర్ ఎంపి రఘరామ కృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు
రాష్ట్రం లో వినాయకు మండపాల మీద ఆంక్షలు విధిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ అన్ని ప్రముఖ దేవాలయాలు తెరిచి వినాయక వేడుకలు జరుపుకొనే మండపాల విషయంలో అనుమతులు ఇవ్వక పోవడం , వాటికీ ఆటంకాలు కలిగించడం మంచిది కాదని ఆయన ముఖ్యమంత్రి ని కోరారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
“హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ వినాయకచవితి ఉత్సవాలు . అన్ని విగ్నాలను తొలిగించే దేముడుగా వినాయకుడుని హిందువులు భావిస్తారు . ఏ పని మొదలు పెట్టిన ముందుగా వినాయకుడిని పూజిస్తారు .
ఎంతో ప్రాముఖ్యత వున్న వినాయక వేడుకలకు నిబంధనలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం విఘ్నలు కలిగించడం హిందువుల మనోభావాలను గాయపరచడమే .
స్వాతంత్ర ఉద్యమ కాలం నుండి వినాయక వేడుకలు సామూహికంగా కుల , మతాలకు అతీతంగా జరుపుకొనే సంప్రదాయం వుంది . అటువంటిది వినాయక మండపాల ఏర్పాటు చేసుకొంటున్న వారిని రాష్ట్రం లో అనేక చోట్ల పోలీసులు, ఇతర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు . దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను .
స్వాతంత్రం నా జన్మ హక్కు అన్ని మొట్టమొదటి సారిగా నినాదం ఇచ్చిన లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్ ప్రజలంతా సామూహికంగా కుల , మతాలకు అతీతంగా వినాయక వేడుకలు జరుపుకొనే పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
వినాయక వేడుకలను ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకునే హక్కును రాష్ట్ర ప్రభుత్వం హిందూ మత పెద్దలతో , స్వామిజీలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షం గా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు .
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వినాయక మండపాలకు అనుమతి ఇస్తునట్లుగానే ఈ సంవత్సరం కూడా అనుమతులు ఇవ్వాలని , వినాయక నిమజనాలకు క్రేన్లు , ఇతర ఏర్పాట్లు చెయ్యాలని కోరుతున్నాను .
రాష్ట్ర ప్రభుత్వం వినాయక వేడుకలు , మండపాలు ఏర్పాటు తదితర అంశాలు పై హిందుమత పెద్దలు, స్వామీజీ లు, మఠాధిపతులతో, హిందూ సంస్థలతో చర్చించాలని కోరుతున్నాను.”