ఒకపుడు తెలంగాణ ప్రాంతంలో ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.గత ఇరవై సంవత్సరాలలో లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేశాయి. వీటిలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయని ఎవరూచూల్లేదు.ఇక్కడి నుంచి వస్తున్న విద్యార్థుల్లో ఉద్యోగార్హత ఎంతమందికి ఉందనే విషయం కూడా ఎవరూ పట్టించుకోలేదు,ఉద్యోగాలకు అవసరమయిన స్కిల్స్ (skill development) గురించి ఎవరూ శ్రద్ధ చూపలేదు.
దీనితో చాలా ప్రయివేటు కాలేజీలు ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులను తయారు చేసే నాసిరకం ఫ్యాకరీలుగా మారిపోయింది.
యాస్పైరింగ్ మైండ్స్ (Aspiring Minds) అనే సంస్థ 2019లో చేసిన యాన్యువల్ ఎంప్లాయబిలిటీ సర్వే భారతదేశంలోని ఇంజినీరింగ్ గ్రాజుయేట్స్ లో 80 శాతం మంది విద్యార్థులకు ఇపుడు నాలెడ్జి ఎకానమి (Knowledge Economy) లోని ఉద్యోగాలకు పనికేరారు. ఇందులో కేవలం 2.5 శాతం మంది విద్యార్థలకు మాత్రమే ఇండస్ట్రీలో ఉద్యోగాలకు అసవరమయిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence-AI)లో నైపుణ్య ఉంది. ఇది తెలుగు రాష్ట్రాలకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే దేశంలో అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలున్న రాష్ట్రాలున్న నాలుగు రాష్ట్రాంలో తెలుగురాష్టాలున్నాయి.
గత ఏడేళ్లలో తెలంగాణ ప్రయివేటు ఇంజీనీరింగ్ కాలేజీల పరిస్థితి తలకిందులయిపోయింది. ఇపుడు చాలా కాలేజీలలో విద్యార్థులు చేరడమే లేదు. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లున్నాయి. దీనితో కొనాసాగేందుకు చాలా కాలేజీలకు అర్హతే ఉండటంలేదు. ఇంజనీరింగ్ కాలేజీలకే కాదు, ఫార్మసీ కాలేజీలకు ఇదే గడ్డురోజులొచ్చాయి.
తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి. ప్రతి సంవత్సరం రకరకాల కారణాలతో ఎఐసిటిటి చాలా కాలేజీలకు అనుమతులను నిరాకరిస్తున్నది.
2020-2021 సంవత్సరానికి ఎఐసిటిిఇ 186 కాలేజీలను మాత్రమే అనుమతించింది.ఇదే 2019-2020 ఆర్థిక సంవత్సరానికి202 కాలేజీలను అనుమతించారు.అంటే ఒక ఏడాదిలో 16 కాలేజీలకు అనుమతి లేదు. అంటే 16కాలేజీలలో అడ్మిషన్లు జరగలేదని అర్థం.
గత ఏడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో 133 కాలేజీలకు ఎఐసిటిఇ అనుమతి నిరాకరించింది. 2014-15 విద్యాసంవత్సరంలో తెలంగాణలో 319 ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలుండేవి. 2020-2021 నాటికి వీటి సంఖ్య 180కు పడిపోయింది ఎఐసిటిఇ అందిస్తున్న సమాచారం బట్టి అర్థమవుతుంది.
అంటే 133 కాలేజీలు మాయమయ్యాయన్నమాట. 133 కాలేజీలను తగ్గిపోయాయంటే ఆ మేరకు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు కూాడా తగ్గిపోయినట్లే. 2014-15 లో 319 ఇంజనీరింగ్ కాలేజీలలో మొత్తంగా1,87,530 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండేవి. ఇపుడు వీటి సంఖ్య1,05,119కి పడిపోయింది.
2020-2021 విద్యాసంవత్సరానికి మొత్తంగా అంటే ప్రయివేటు, ప్రభుత్వ, యూనివర్శిటీలకు అనుబంధంగా ఉండే కాలేజీలతో కలిపి 201 ఇంజనీరింగ్ కాలేజీలకు ఎఐసిటిఇ అడ్మిషన్లకు అనుమతినచ్చింది.
ఇలా ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి రాకపోవడానికి కారణం, ఈ కాలేజీలకు అడ్మిషన్లు లేకపోవడమే.
ఇపుడు అనుమతి వచ్చిన కాలేజీలలో కూడాచాలా వాటి పరిస్థితి ఏమీ బాగాలేదు. ఎందుకంటే 183క ప్రయివేటు కాలేజీలలో కూడా కేవలం 44 కాలేజీలకు 100 శాతం అడ్మిషన్ల అదృష్టం వరిచింది. ఈ 44 లో 12 యూనివర్శిటీల ఇంజీనీరింగ్ కాలేజీలున్నాయి
అంటే తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం బిటెక్ ఆడ్మిషన్లు ఉన్న కాలేజీలు కేవలం 32 మాత్రమే. గత ఏడాది మూడో కాలేజీలలో ఒక్కరు కూడా చేరలేదు.
ఇదేపరిస్థితి ఫార్మా కాలేజీలకూ ఎదురవుతూ ఉంది. 2019-2020 సంవత్సరానికి ఎఐసిటిఇ మొత్తంగా 124 ప్రయివేటు ఫార్మాకాలేజీలకు అనుమతిస్తే 2020-2021లో ఈ సంఖ్య భారీ గా పడిపోయి78కి చేరింది. ఈ ఏడాది ఎఐసిటికి 81కాలేజీలకు మాత్రమే అనుమతినిచ్చింది. వీటిలో ఉన్న సీట్ల సంఖ్య7,400 మాత్రమే.
దేశ వ్యాపితంగా కూడా ప్రయివేటు ఇంజీనీరింగ్ విద్య కుప్పకూలిపోతున్నది. 2012 -13లో దేశంలో 10,272 విద్యాసంస్థలకు ఎఐసిటిఇ అనుమతి ఉండింది. 2019-20 నాటికి వీటి సంఖ్య 9,672కు పడిపోయింది. అంటే ఎన్నికాలేజీలు తగ్గాయి. 600 విద్యాసంస్థలు మాయమయ్యాయని ఎఐసిటిఇ వెబ్ సైట్ చెబుతున్నది.