తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ రాష్ట్రకోవిడ్ పరిస్థితుల మీద తన నిస్సహయత వ్యక్తం అయ్యేలా పదే పదేే మాట్లాడటం పట్ల ఎఐసిసి కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు గవర్నర్ తనకు రాజ్యంగం ఇచ్చిన అధికారాలను ఎందుకు వినియోగించడం లేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణాలో బిజెపి, గవర్నర్, కేంద్రం ఒక చిత్రమయిన పరిస్థితిని సృష్టించి ప్రజలను మోసగిస్తున్నాయని ఆయన అన్నారు.
‘తెలంగాణ బిజెపి రోజూ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. గవర్నర్ ఇంకొకటి చెబుతారు. కేంద్రం బృందాలు ప్రభుత్వానికి మద్దతుగా మరొకటి చెబుతాయి. హైదరాబాద్ లో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమీ మాట్లాడారు. కేంద్ర బిజపి రాజకీయ లబ్ది ఎలా పొందాలా అని చేస్తుంది. ఏమిటిదంతా. ఇది తెలంగాణప్రజలను మభ్యపెట్టడం కాదా,’ అని ఆయన ప్రశ్నించారు.
బుధవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ విజృంభిస్తున్నా ప్రజలకు వైద్య సదుపాయాల కల్పనలో గాని, కరోనా వ్యాప్తి కట్టడిలో, కరోనా టెస్టుల సంఖ్య పెంచడంలో గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నదని తెలిసినా గవర్నర్ ఎలాంటి చర్య తీసుకొనకపోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు.
‘గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ఎప్పటికిప్పుడు స్పందించడం అభినంద దగ్గ విషయమే కానీ ఆమె అక్కడి తో ఆగిపోకూడదు. అలాగే సమస్యల పరిస్కారం కోసం, ప్రత్యేక బడ్జెట్ నిధుల కోసం తీసుకొచ్చే అవకాశం కేంద్రాన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్న రాజ్యాంగ ఏర్పాటును ఆమె ఉపయోగించాలి. తప్పులు వెతకడం కాదు, వాటిని పరిష్కరించడం కోసం ముందుండాలి,’ దాసోజు పేర్కొన్నారు.
ఐదు నెలల కిత్రం తెలంగాణ రాష్ట్రంలోకి మొదటి సారిగా కోవిడ్ 19 వచ్చిన రోజు నుండి కాంగ్రెస్ అనేక సార్లు సూచనలు, సలహాలు ప్రభుత్వానికి చేసిందని, అయినా ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు రాలేదని చెబుతూ ఇపుడు గవర్నర్ ప్రస్తావిస్తున్నవన్నీ కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలేనని ఆయన అన్నారు.
‘ప్రధాన మంత్రి, రాష్ట్రపతికి కేంద్రానికి నిేవేదికలు పంపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగు హెచ్చరికలు చేయించే అవకాశం ఉంది. అలాగే సమస్యల పరిస్కారం కోసం ప్రత్యేక బడ్జెట్ నిధుల కోసం తీసుకొచ్చే అవకాశం ఉంది. వాటన్నిటిని పక్కన పెట్టి నిస్సహాయంగా ఉంటున్నారే, మరొక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు,’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన మహాకవి గురజాడ అప్పారావ్ చెప్పిన ‘వొట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్,’ అన్న హెచ్చరికను గుర్తుచేశారు.
‘ రాజ్యాంగ హోదా ఉన్న గవర్నర్ కేవలం ప్రతిపక్ష నాయకురాలిలాగా మారిపోయి, ఉత్తి నిస్సహాత నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి , కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు చేపట్టే విధంగా గవర్నర్ మార్గదర్శకత్వం ఉండాలి,’ అని దాసోజు అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడి, కరోనా టెస్టుల సంఖ్య పెంచడం విషయంలో , కరోనా మరణాల అరికట్టడంలో, ప్రభుత్వ దవాఖానలో పడకలు అందాబాటులోకి తీసుకురావడంలో, ప్రైవేటు హాస్పిటళ్లలో లక్షల రూపాయల ఫీజు వసూలు నివారణలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అయితే కేంద్ర ప్రభుత్వం బృందాలు రెండు సార్లు రాష్ట్రానికి వచ్చి , ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పడం ఏమిటి. ఇది అనుమానాలకు తావిస్తున్నది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు సరిగా లేదని బిజెపి మాట్లాడుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ బృందాలు మాత్రం పనితీరు బాగుందని చెబుతాయి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, కేంద్ర బీజేపీ రాజకీయ లబ్ది కోసం పొందాలని చూస్తున్నదని అనుకోవాలి. నిజగానే ప్రజలకు లాభం చేయాలనే ఆలోచన ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలి. ఆపని ఎందుకు చేయడం లేదు