(CS Saleem Basha)
చాలామంది , సైకాలజిస్ట్ ,రచయితలు, ABCD of Happiness గురించి చాలా రకాలుగా చెప్పారు. అవేంటో మనం కూడా చూద్దాం
Accept whatever happens in life.
జీవితంలో ఏం జరిగినా వాటిని స్వీకరించటం. జీవితంలో చాలా విషయాలు మన చేతుల్లో ఉండవు. వాటి గురించి ఆందోళన పడకుండా ఏం జరిగినా యధాతధంగా స్వీకరించడం, సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుంది
Believe in yourself.
మనమీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం మనం ఏదైనా సాధించడానికి ఉపయోగపడే పరికరం. మనల్ని మనం నమ్మినప్పుడు ఆనందంగా పని చేయగలం.
Common sense is a sense of happiness
ఇంగిత జ్ఞానం కలిగి ఉండడం, సంతోషకరమైన జీవితానికి అవసరం. ఇంగిత జ్ఞానం అంటే తర్క బధ్ధమైన జ్ఞానం. దాన్ని కలిగి ఉంటే సంతోషం కలిగి ఉన్నట్లే
Decide to be happy
సంతోషంగా ఉండాలని నిర్ణయం మనమే తీసుకోవాలి. సంతోషంగా ఉండాలని మనకి ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. ఎవరు చెప్పరు కూడా! సంతోషంగా ఉండాలంటే మనమే ఒక నిర్ణయం తీసుకోక తప్పదు
Exercise frequently.
ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే కేవలం శరీరానికే కాదు, మనసు, మెదడుకు కూడా వ్యాయమం ఉండాలి. అంటే నలుగురితో కలివిడిగా ఉండటం మనసుకు, పుస్తకాలు చదవడం మెదడుకు వ్యాయామం అని అర్థం చేసుకోవాలి
Forgive others
క్షమించడం వల్ల మనకు సంతోషంగా ఉంటుంది. క్షమించడం వల్ల మనకు లాభం. మనసు తేలికవుతుంది. అనవసరమైన విషయాలను మోయాల్సిన అవసరం ఉండదు. అందుకే క్షమ గొప్పది
Giving gives you happiness
ఇవ్వడం తీసుకోవడం కన్నా గొప్పది. “Giving ennobles you” అని మదర్ తెరిసా అభిప్రాయం. ఇవ్వడం అన్నది చాలా ఉదాత్తమైనది. ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది
Humor yourself and others.
హాస్యం సంతోషానికి మరో రూపం. నవ్వు గురించి ఎంత చెప్పినా తక్కువే. ” నువ్వు రోజులో ఒక్కసారి కూడా నవ్వకుండా ఉంటే ఆరోజు వృధా అయిపోయినట్లే” అన్నాడు చార్లీ చాప్లిన్
Involve in works you like.
మనకు ఇష్టమైన పనిలో నిమగ్నమై ఉండాలి. “Do the job you love or love the job you do” అన్నాడు ఖలీల్ జిబ్రాన్. నచ్చిన పని చెయ్యటం లో ఉన్న ఆనందం. నచ్చని పని చేయడంలో ఉండదు
Judging others is not out job
ఇతరులను జడ్జ్ చేయడం సరైంది కాదు. “ we are judges for other’s
mistakes and advocates for others mistakes”. ఇతరుల గురించి తొందరగా ఒక నిర్ణయానికి రావటం సరైంది కాదు.
Kindness is a way to happiness
కరెక్ట్ గా ఉండడం కన్నా, దయతో ఉండడం కరెక్ట్. “if you want to choose between being right and being kind, choose being kind and you will always be right” అన్న మహాత్మా గాంధీ మాట ఆనందానికి మూలం
Love is better than hatred
ద్వేషం కన్నా ప్రేమ గొప్పది. ద్వేషం వల్ల నష్టం మనకే. అందుకే ప్రేమ మనల్ని సంతోషంగా ఉంచుతుంది
Mathematics of happiness
సంతోషం లెక్క చిత్రమైంది. సంతోషాన్ని Divide చేస్తే multiply అవుతుంది. అదే ఎవరికైనా పంచితే (మైనస్ చేస్తే) Add అవుతుంది.
Now is the time to be happy
ఈ క్షణమే ఆనందంగా ఉండాలి. దీన్నే live in the moment అంటారు.
Openness opens the doors of happiness
మన జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి. జీవితంలో పారదర్శకత మనల్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. స్వచ్చత అంటే సంతోషం
Positive thinking is the essence of happiness
పాజిటివ్ థింకింగ్ అంటేనే సంతోషమని ప్రపంచమంతా ముక్త కంఠంతో మొర పెట్టుకుంటోంది.
Quit everything which is a block to happiness
కోపం, నిరాశ నిస్పృహలు, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, ఇలా నెగటివ్ అంశాలు ఏవైనా సరే, సంతోషానికి మబ్బుల్లాగా అడ్డుపడతాయి. వాటిని వెంటనే వదిలేయాలి. అప్పుడు సంతోషం అనే వెలుతురు మన జీవితాల్లో ప్రసరిస్తుంది
Recreation creates happiness
ఆటపాట ఆనందానికి దగ్గరి దారి. “All work no play and all play no work is bad” వినోదభరితమైన ఆటలు పాటలు సంతోషంతో పాటు, విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి
Smile often.
నవ్వు నలభై నాలుగు విధాలా మేలు. “నవ్వడం భోగం, నవ్వించడం యోగం. నవ్వకపోతే రోగం” అన్నారు జంధ్యాల గారు. ఇంతకన్నా ఏం చెప్పాలి
Tolerance is a ticket to a movie called “happiness”
సహనం సంతోషానికి మూలం. ఇతరుల పట్ల, వ్యతిరేక ఆలోచనల పట్ల సహనం చాలా అవసరం. అది మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది
Understand first and expect to be understood
ముందు మనం ఇతరులను అర్థం చేసుకోవాలి తర్వాత మనల్ని ఇతరులు అర్థం చేసుకోవాలని
ఆశించాలి. దాంతో ఇతరులకు మన పట్ల గౌరవం పెరుగుతుంది.
Value “values” in life
“విలువలకు” విలువ ఇవ్వాలి. విలువలతో కూడిన జీవితం సంతోషకరమైన జీవితానికి రహదారి
Wisdom is better than knowledge
పరిజ్ఞానం కన్నా జ్ఞానం గొప్పది. ఉదాహరణకు ఆటం బాంబు ఎలా తయారు చేయాలో తెలియడం పరిజ్ఞానం (knowledge). దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం జ్ఞానం(wisdom)
X press gratitude very often
కృతజ్ఞతను ఎప్పటికప్పుడు ప్రకటించాలి. కృతజ్ఞత భావం అన్నది మనిషికి మానసికంగా చాలా బలం. కృతజ్ఞులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మన కృతజ్ఞతతో ఇతరులు కూడా ఆనంద పడతారు
Youthfulness is happiness
వయసు అన్నది కేవలం ఒక సంఖ్య మాత్రమే. యవ్వనానికి వయసు లేదు, ఆనందానికి కూడా వయసు అడ్డం కాదు. ఏ వయసులోనైనా, ఎప్పుడైనా సంతోషంగా ఉండొచ్చు
Zealous always
ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. ఉదయం లేచినప్పటి నుండి, రాత్రి పడుకోబోయే వరకూ ఉత్సాహంగా ఉండడం వల్ల, సంతోష హార్మోన్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి.
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)