వరంగల్ వరదలకు కారణమిదే, ప్రజలతో ఏకీభివించిన కెటిఆర్

వరంగల్ వరదలు ఆసక్తి కరమయిన, ఆందోళన కరమయిన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. అది  మునిసిపల్ అధికారుల అలసత్వం. నగరంలో పెద్ద ఎత్తున నాలాల మీద ఆక్రమ నిర్మాణాలొస్తున్నా అధికారులు పట్టించుకోనక పోవడంతోొ  11 లక్షల జనాభాతో పాటు రాష్ట్రంలోరెండవ పెద్ద నగరమయిన పట్ణణానికి వరద బెడద వచ్చింది.
వరంగల్ లో వరదలనే విషయం తెలంగాణను షాక్ కు గురి చేసింది. ఈ వరదలకు కారణం, ఆక్రమణాలే నని రాష్ట్ర మునిసిపల్ ఐటి శాఖ  మంత్రి కెటి రామారావు స్వయానా అంగీకరించారు.
కాకపోతే, ఇది ఇప్పటి సమస్య కాదు, ఎప్పటినుంచో వచ్చిన సమస్య అని ఆయన అన్నారు. ఏమయినా ఆయన అక్రమ నిర్మాణాలను అనుమతించడమే వరదలకు కారణమని అంగీకరించారు.  ఈ సమస్య ఏ నగరానికయినా భవిష్యత్తు లో ఎదురు కావచ్చు.
ఒక్క రోజుతో, ఒక్క వరదతో వరంగల్ మునిసిపల్  కార్పొరేషన్ ప్రక్షాళన జరుగుతుందా, అక్రమ నిర్మాణలను తొలగించడం అంతసుళువా? అక్రమ నిర్మాణలను నెలరోజుల్లో తొలగిస్తానని మంత్రి ప్రకటించడం ఆపత్సమయంలో ప్రజలకు ఊరట కల్గించేందుకు చేసిన ప్రకటనయా? దీనికి సమాధానంకోసం నెలరోజులాగాల్సిందే.  ఈరోజు ఆయన వరద వరంగల్ ను సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఫిర్యాదులు కూడా విన్నారు.

ఏమో గాని, ఈ రోజు మంత్రి కెటి రామారావు వరంగల్ పర్యటనలో ఆయన ఒక నిజమయితే అంగీకరించారు.
నిజానికి సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా వరంగల్  రావలసి ఉండిందని, ఆయన రాకవల్ల సహాయక చర్యలు కుంటువడతాయని, అందుకే తనని పంపించారని కెటి ఆర్ చెప్పారు
ఆయన వరంగల్ ఏం చెప్పారంటే…
నగరంలో  నాలాలపై ఆక్రమణల వల్లే  వరద నీరు ముంచెత్తిందని, ఆక్రమణల వల్ల నీరు బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని ఈ విషయంలో ప్రజల చెప్పిన దానితో తాను ఏకీభవిస్తున్నట్లు మునిసిపల్ , ఐటి శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు.

నగర పర్యటనలో ప్రజలంతా ఇదే విషయాన్ని ముక్త కంఠంతో చెప్పారని ఆయన వెల్లడించారు.
‘జనావాసాలు జలమయమయ్యేందుకు కారణం  ప్రజలు  చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమణలున్నాయి. వాటిని తక్షణం తొలగించాలి. ఈ విషయంలో రాజీ పడేది లేదు. ఈ విషయం లో . రాజకీయ వత్తిళ్లకు తావీయం,’ అని ఆయన చెప్పారు.

పెద్ద పెద్ద నిర్మాణాలు తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పని వెంటనే ప్రారంభం కావాని, ఇంకా నీటి ప్రవాహానికి నాలాలలో  ఏమైనా అడ్డంకులుంటే పరిశీలించి తొలగించాలని ఆయన  ఆదేశించారు.
 కలెక్టర్ చైర్మన్ గా జిల్లా ఒక టాస్క్ ఫోర్స్ ను నియమిస్తున్నట్లు ఆయన చెప్పారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఎయుడి కమిషనర్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తారని, వీరిద్దరిలో ఒకరు ప్రతీ వారంలో ఒక రోజు వరంగల్లో పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.

 

‘నెల రోజుల్లోగా మొత్తం ఆక్రమణలు తొలగిస్తాం.  అక్రమ నిర్మాణాలు   పేదల ఇండ్లయితే  వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం. రిజిస్ట్రేషన్ ఉన్న వారివైతే నష్ట పరిహారం చెల్లించి తొలగిస్తాం. ఏదేమైనా సరే, మొత్తం నాలాలపై ఆక్రమణలను నెల రోజుల్లో తొలగిస్తామన,’ ఆయన హామీ ఇచ్చారు.
తొందర్లో  వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ వస్తుందని ఆయన వెల్లడించారు. దీనితో  పాటు కొత్తగా టిఎస్ బి పాస్ కూడా వచ్చిందని చెబుతూ ప్రణాళికలకు అనుగుణంగా వరంగల్ లో ఇకపై నిర్మాణాలుండాలని . నగరం ఎటు పడితే అటు, ఎట్ల పడితే అటు నిర్మాణాలు జరగాడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.

‘ సిఎం ఆదేశాల మేరకు వరంగల్ నగరంలో 20 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాలకు చెందిన 4,500 మందికి ఆశ్రయం కల్పించాం. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బోట్లు, పరికరాలతో సహా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను పంపాం. వారంతా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సోమవారం స్వయంగా వరంగల్ రావాలనుకున్నారు. కానీ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో మానుకున్నారు. ఇవాళ మమ్మల్ని ప్రత్యేకంగా పంపించారు,’ అనిఆయన చెప్పారు.