ఏ పండగ అయినా వంట ఇంట్లో ముందు తిష్ట వేస్తుంది బెల్లం (jaggery). తీపి పదార్ధాలలో తనదైన రుచిని పెంచుతుంది, తీపి అనుభూతులను పంచుతుంది. అంత మధురమైన ఈ బెల్లంతో ఆరోగ్యం కూడా ఎంతో పదిలం..!!! అది ఎలానో తెలుసుకుందాం….
# ఈమధ్య బెల్లం కంటే పంచదార వాడకం ఎక్కువ అయ్యింది. కానీ పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం ఎందుకంటే బెల్లంలో ఐరన్ వంటి మూలకాలున్నాయి.
# సహజ సిద్ధమైన బెల్లం తినడం వలన రక్త హీనత (anemia) తగ్గుతుంది, శరీరానికి శక్తి లభిస్తుంది.
# చాలామంది మైగ్రైన్ తో బాధపడుతూ ఉంటారు.. ఒక వారం రోజులు బెల్లం, నెయ్యి, సమపాళ్లలో కలిపి తింటే నొప్పి తగ్గిపోతుంది.
# అసిడిటీ (acidity) సమస్య ఉన్నవారు ప్రతిసారి భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కని తింటే సమస్యను తగ్గించవచ్చును.
# అజీర్తి సమస్య ఉన్నప్పుడు కూడా ఈ చిట్కాను పాటిస్తే జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది.
# కడుపులో మంటకి కూడా చిన్న బెల్లం ముక్క తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.
# నెయ్యితో బెల్లం వేడి చేసి నొప్పి ఉన్న చోట పూత వేస్తే నొప్పి తగ్గుతుంది.
# నెలసరి సమస్యలు (menstrual problems) ఉన్నవారు కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు మిరియాల గింజలు, బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వారం రోజులు రెండు పూటలా తీసుకోవాలి.
-> లేదా గ్లాస్ పాలలో పంచదారకు బదులు బెల్లం వేసుకుని తాగినా నెలసరి సమస్యలు ఉండవు.
# ఇలాంటి మేలైన ప్రయోజనాలు కలిగినది కాబట్టే బెల్లాన్ని “మెడిసినల్ షుగర్” గా వ్యవహరిస్తారు.
మరి మనం కూడా పంచదారను కొంత మేర పక్కన పెట్టి బెల్లాన్ని అక్కున చేర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.