ఒకనాడు హిందీ వెండితెర మీద తిరుగులేని తారగా ప్రకాశించిన వైజయంతి మాల బర్త్ డే నేడు (ఆగస్టు 13, 1936). ఆమె 84వ యేట ప్రవేశించారు. ఆమె సినిమాలనుంచి తప్పుకుని దశబ్దాలయినా, టఆమె చిత్రాలు, ఆమె నటన ఇంకా అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి.ఉంటాయి కూడా.నటిగానే కాకుండా,భరతనాట్యం నర్తకిగా కూడా ఆమె కు బాగా పేరుంది.నిజానికి చాలా చిత్రాల్లో ఆవకాశాలు ఆమెకు నాట్యం తెలిసినందు వల్లే లభించాయి.
2007లో ఆమె జ్ఞాపకాలు Bonding… a Memoir అనే పుస్తకంగా వచ్చాయి. ఇందులో అనేక ఆసక్తి కరమయిన విషయాలను ఆమె వెల్లండిచారు. బిమల్ రాయ్ దేవదాస్ లో నటించినందుకు సపోర్టింగ్ యాక్టర్ గా ఆమెకు ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది.అయితే, ఆమె దానిని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే చంద్రముఖిగా తాను పోషించిన ప్రాత హీరోయిన తో సమానం, అది పారూ (సుచిత్రా సేన్ )కు ఏమాత్రంతీసిపోదు. అలాంటపుడు సపోర్టింగ్ యాక్టర్ అవార్డేమిటి అని ఆమె అసంతృప్తి. ఫిలిమ్ ఫేర్ అవార్డు తిరస్కరించిన తొలి నటిఆమెయే.
ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారంటే..
1950 దశాబ్దంలో కొత్త ఐడియాల కోసం బాలివుడ్ మద్రాసు రాష్ట్రం వైపు చూసేది. అపుడు దక్షినాది సినిమా కేంద్రం మద్రాసే కదా.అలాగే తమిళ నిర్మాతలు కూడా పెద్ద మార్కెట్ కోసం హిందీ వైపు చూసే వారు. ఇలా రెండు సినిమా రంగాల చూపులుకలిశాయి.
తమిళ సినిమాని హిందీలో రీమేక్ చేయాలన్న ఆలోచన మొదట ఏవిఎం ప్రొడక్షన్స్ కు వచ్చింది. 1951 లో వారి రీమేక్ హిందీ చిత్రం అక్టోబర్ 26న విడుదలయింది. ఆచిత్రం పేరు బహార్ (Bahar). ఇదే ఇండియాలో తొలి రీమేక్ చిత్రం.
వైజయంతిమాలను హీరోయిన్ గా హిందీకి పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే. హీరో కరణ్ దీవాన్. సంగీతం ఎస్ డి బర్మన్.పాటలు రాజేంద్ర క్రిషన్.
బహార్ 1949 లో తమిళంలో సూపర్ హిట్టయిన వాళ్ కై (Vazhkai) రీమేక్.
దాని దర్శకుడు ఎంవి రామన్. ఆయనే వైజయంతిమాలను ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయంచేశారు. బహార్ ఎవిఎం ప్రొడక్షన్స్ వారి తొలి హిందీ చిత్రం కూడా. హిందీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంతో వైజయంతిమాల తొలి చిత్రంతోనే హిందీలో పాపులర్ అయ్యారు. ఇదిగో ఈ పాట ఇప్పటికీ సూపర్ హిట్టే.
వాళ్ కై 1949లో మద్రాసు కోడంబాకమ్ లో ఏవిఎం స్టూడియోస్ లో నిర్మాణమయిన తొలిసినిమా కూడా. నిజానికి వాళ్లు తమ కరైకూడి స్టూడియోలో ఈ చిత్రాన్ని కొంతవరకు తీశారు. అయితే, అది ముందకు సాగలేదు. తర్వాత మద్రాసు స్టూడియో నిర్మాణం పూర్తయ్యాక వాళ్ కై కి మోక్షం లభించింది. ఈ చిత్రానికి ఒక చక్కటి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి హీరోయిన్ గా కావాలి. ఎవియం మైయప్పన్ హీరోయిన్ కోసం వెదుకుతున్నపుడు రామన్ తనకు తెలిసిన వైజయంతిమాల గురించి చెప్పారు.
ఆమ్మాయి ముఖంలోని కళ, రంగు, నాట్యం, మాటతీరు అన్ని నిర్మాతకు తెగ నచ్చాయి. మూడేళ్ల కాంట్రాక్టుతో వైజయంతిమాలను ఎవియం చిత్రాల్లోకి తీపుకు వచ్చింది. హీరోయిన్ ప్రాతని వైజయంతిమాల డ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని బాగా మార్చారు. చిత్రంలో ఆమెకు మూడు డ్యాన్సలున్నాయి. అందులో ఒకటి భారత దేశం మీద సుబ్రమణియన్ భారతి రాసిన దేశభక్తి గేయం ఉంది.దీనిని డికె పట్టమ్మాళ్ పాడారు. ఇతర పాటలను కర్నాటకసంగీత విద్వాంసురాలు ఎమ్ ఎల్ వసంతకుమారి పాడారు.