తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్స్ ఆగష్టు 10న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నట్టు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నియమించే నర్సులను ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ విధానంలో భర్తీ చెయ్యాలి.
నర్సింగ్ ఆఫీసర్స్ ఎవ్వరు కూడా ఈ తాత్కాలికంగా నియమించే పోస్టులలో జాయిన్ అవ్వకూడదు.
హైకోర్టులో పెండింగ్ ఉన్న పిటిషన్పై ప్రభుత్వం చొరవ తీసుకుని 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయాలి.
వైద్యులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి. అమరుడైన డాక్టర్ నరేష్, నర్సింగ్ ఆఫీసర్ జయమణికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే ప్రకటించాలి. వారి కుటుంబం లో ఒకరికి జాయింట్ కలెక్టర్ ఉద్యోగం కల్పించాలి. 500 గజాల స్థలాన్ని వారి ఇంటి నిర్మాణం కొరకు ఇవ్వాలి. వారి ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి కరోనా వైరస్ మహమ్మారి పై యుద్ధం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించాలి. కరోనా పై యుద్ధంలో అమరుడైన డాక్టర్ నరేష్, నర్సింగ్ ఆఫీసర్ జయమణి కి అశ్రునివాళి ఘటించాలని కోరుతున్నాం.
రాష్ట్రంలో ప్రతి నర్సింగ్ ఆఫీసర్ ఉన్నచోటనే బ్లాక్ రిబ్బన్ లేదా బ్లాక్ జెండా పట్టుకొని తమ నిరసన వ్యక్తం చెయ్యాలి అని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే నిరసన వ్యక్తం చేస్తున్న ఫోటోలను వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్టు చెయ్యాలి లేదా అసోసియేషన్ వారి వాట్సప్ నంబర్ కు పంపగలరు : 9700015427 అని ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (తెలంగాణ రాష్ట్ర శాఖ ) రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( ప్రభుత్వ ఉద్యోగుల సంఘం) మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.