ఇకనుంచి గోల్డ్ ను కుదవపెడితే ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు లోన్ గైడ్ లైన్స్ మార్పు చేసింది. ఇంతవరకు అమలులో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం బంగారు తాకట్టు పెడితే బంగారు మొత్తం విలువలో 75 శాతం దాకా లోన్ తీసుకునే అవకాశం ఉండింది. ఇపుడు ఈ నియమాలను మార్చి మొత్తం బంగారు విలువలో 90 శాతందాకా లోన్ తీసుకునే అవకాశం కల్పించారు. వచ్చే మార్చి 31 దాకా ఈ కొత్త నియమం అమలులో ఉంటుంది. కోవిడ్ 19 తో ప్రజలకు,చిన్న చిన్న వ్యాపారస్థులకు,బిజినెస్ వాళ్లకు ఎదురవుతున్న ఆర్థికభారాన్ని తగ్గించేందుకు రిజర్వు బ్యాంకు లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి (LTV) 75 శాతం నుంచి 90 శాతానికి పెంచింది.
కరోన సంక్షోభం మొదలయ్యాక బంగారు మీద రుణాలు తీసుకోవడం బాగా ఎక్కువయింది. ప్రజలు ఇతర రుణాలు తీసుకోవడం కంటే బంగారును తాకట్టుపెట్టి రుణం పొందడం సురక్షితం అనుకుంటున్నారు.