మన దేశంలో ఏ సాంప్రదాయ వేడుక అయినా, ప్రత్యేక పూజలున్నా తమలపాకు తప్పనిసరిగా వాడతారు. తాంబూలం అనగానే ఆకు, వక్క, సున్నం ప్రధానం. తాంబూలం ఆడవారికి ప్రత్యేకంగా ఇస్తారు. కానీ ఆ ఆకును చాలామంది తినకుండా పక్కన పెట్టేస్తారు. మన పూర్వీకులు ఏ ఆచారాన్ని పాటించమని చెప్పినా దానివెనుక ఒక శాస్త్రీయ రహస్యం దాగి ఉంటుంది. తాంబూలంలో తమలపాకును ఇవ్వటంలో కూడా ఒక వైజ్ఞానిక రహస్యం దాగి ఉంది.
# తమలపాకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలో ఎముకలకు మేలు చేసే కాల్షియమ్ (calcium), ఫోలిక్ ఆసిడ్ (folic acid), విటమిన్ “ఏ” (vitamin A), విటమిన్ “సి” (vitamin C) పుష్కలంగా ఉన్నాయి.
# తమలపాకు రోగ నిరోధక శక్తిని (immunity power) పెంచుతుంది. దీనిలో ఉండే ఫైబర్ (fiber) జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్ (anti oxidant) కాబట్టి ముసలితనపు ఛాయలను కట్టడి చేస్తుంది.
# ఇంట్లో ఉండే నూనెలు చెడిపోకుండా ఉండాలంటే తమలపాకు వేసి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
# తరచూ నోటి పూత (Aphte or ulcerative stomatitis) తో బాధ పడేవారు గ్లాస్ నీళ్లలో తమలపాకు వేసి గంటసేపు అలానే ఉంచి ఆ నీళ్లతో పుక్కిలించాలి. ఇలా రోజుకి నాలుగు-ఐదు సార్లు చేస్తే త్వరగా తగ్గుతుంది. నోటి దుర్వాసన (bad breathe) కూడా దూరం అవుతుంది.
# ఊబకాయులు ప్రతిరోజూ తమలపాకుల్లో 5 మిరియాలు వేసి చుట్టి దవడన పెట్టుకుని దాని నుండి వచ్చే లాలాజలం మింగడం వల్ల ఫైటో న్యూట్రియెంట్లు (phytonutrients) శరీరానికి అందుతాయి. ఇవి కొవ్వు నిల్వల్ని తగ్గించి ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
# తమలపాకులు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేయటం వలన దురదలు ఇంకా ఇతర చర్మ సంబంధ (skin diseases) సమస్యలు తగ్గుతాయి.
# బోధ వ్యాధి గ్రస్తులు (Filariasis) ప్రతి రోజు 7 తమలపాకులను ఉప్పుతో కలిపి నూరి వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
# చెవుల మీద తమలపాకులు వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం తగ్గి తలనొప్పి తగ్గుతుంది.
# పాటలు పాడేవారు, ఉపన్యాసాలు ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్కని బుగ్గన ఉంచి చప్పరిస్తూ ఉంటే శ్రావ్యమైన కంఠం వస్తుంది.
# తమలపాకును వేడి చేసి నొప్పి, వాపు ఉన్న కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
#తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు సమస్యను (dandruff problems) నివారించొచ్చు.
# ముఖ్య విషయం ఏమిటంటే తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో సంతాన ప్రాప్తికి సమస్యలు (Infertility) వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానం కోరుకునే మహిళలు తమలపాకును తొడిమతో సహా తినకపోటం మంచిది.
# తమలపాకును ఔషధంలో పరిమితంగానే వాడుకోవాలి అలా కాకుండా రోజుకి 5 -10 ఆకులు రెండేళ్లపాటు రోజూ తినేవారు తమలపాకుకు డ్రగ్స్ మాదిరిగా బానిసలూ అవుతారని తాజా అధ్యయనం.
# అధిక రక్తపోటు (high blood pressure) కలవారు తాంబూలాన్ని తరచూ తినకూడదు. తాంబూలాన్ని తయారు చేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్ధం రక్త నాళాల మీద, రక్త సరఫరా మీద వ్యతిరేఖ ప్రభావం చూపుతుంది.
# తాంబూలానికి పొగాకు కలిపి తింటే సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ (Submucous fibrosis) అనే వ్యాధిని పడతారు. ఈ వ్యాధి నోటి కాన్సర్ (Oral cancer) కి ముందు దశ.
కాబట్టి ఔషధాన్ని ఔషధంగా వాడి ప్రయోజనాలు పొందాలి… అతిగా వాడితే అది కూడా దుష్ప్రయోజనాలకు దారి తీస్తుంది.