తిరుపతి: మత్తు నుండి ప్రజల విముక్తి అంటూ మందుబాబులను శానిటైజర్,నాటుసారా, మిధైల్ ఆల్కహాల్ సేవించకుండా నివారించేందుకు తిరుపతి అర్బన్ పోలీసులు ఏడు రోజులపాటు స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు.
మీరీ ముఖ్యంగా మత్తుకు బానిసయిన వారు ఈ మధ్య కరోనావైరస్ శానిటైజర్ తాగి ప్రాణం మీదకు తెచ్చుకుంటూ ఉండటంతో శానిటైజర్ ప్రమాదకరమని చెప్పేందుకు ఈ ప్రచారం మొదలుపెట్టారు.
గత వారం ప్రకాశం జిల్లా కురిచేడుమండలంలో అల్కహాలుకు అలవాటు పడిన 11 మంది వ్యక్తులు శానిటైజర్ సేవించి మృత్యవాతపడ్డారు.ఇది దేశవ్యాపితంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో మద్యపానం నిషేధం పేరుతో లిక్కర్ ధరలను విపరీతంగా పెంచారు.దీనితో అలవాటు మానుకోలేని వారు నాటుసారాతో పాటు శానిటైజర్ కూడా సేవిస్తున్నట్లు వార్తొలొస్తూనే ఉన్నాయి. కురిచేడు ఘటనలో మృతులంతా గత పదిరోజులుగా శానిటైజర్ సేవిస్తున్నట్లు కుటుంబ సభ్యులు అంగీకరించారు.
ఇటీవలి కాలంలో అంటే రాష్ట్రంలో లిక్కర్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పెంచినప్పటినుంచి శానిటైజర్, సర్జికల్ స్పిరిట్ వంటి అల్కహాల్ ఉన్న వాటిని సేవించి 36 మంది దాకా చనిపోయారని టైమ్ ఆఫ్ ఇండియా రాసింది. పశ్చిమగోదావరి, విశాఖ పట్నం, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, కడప జిల్లాలలో ఇలాంటి మరణాలు సంభవించాయి. శానిటైజర్ పెరగుతున్నాయని, ఇలా అమ్మకాలు పెరుగడానికి కారణం దానిని మరొక విధంగా దుర్వినియోపరుస్తూ ఉండటమే నని మెడికల్ సప్లయర్స్ చెబుతున్నారు. కేవలం చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు శానిటైజర్ ను వాడితే, నెలకొక బాటిల్ సరిపోతుందని, అయితే, కొంతమంది భారీగా ఈ బాటిల్స్ ను కొనడం చూస్తే దీనిని దుర్వినియోగపరుస్తున్నట్లుగా భావించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. అందువల్ల చాలా చోట్ల శానిటైజర్ తాగి చనిపోతున్న వారి మరణాలు రికార్డులకెక్కడం లేదనే వాదన కూడా ఉంది.
ఈ నేపథ్యంలో తిరుపతి పోలీసుల ప్రచారం మొదలయింది.రాష్ట్రంలో శానిటైజర్ దుర్వినియోగం గురించి ప్రజలను చైతన్యం వంతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదే మొదలు.
శానిటైజర్ గురించి, మత్తు వ్యసనం దుష్ఫలితాల గురించి ప్రజలను చైతన్య పరచడమే ముఖ్య ఉద్దేశమని ఈ క్యాంపెయిన్ గురించి చెబుతూ తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి వెల్లడించారు. ‘శానిటైజర్ సేవించడం ప్రమాదకరం. శానిటైజర్, మీథైల్ ఆల్కహాలు, సారాయి ఎవరయినా విక్రయిస్తుంటే టోల్ ఫ్రీ నెంబర్ 80 99 99 99 77 గాని 100 గాని సమాచారమివ్వాలి’ అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘మత్తు మిమ్మల్ని చిత్తు’ ప్లకార్డులు ప్రదర్శించి పోలీసులు ప్రజలను చైతన్యం చేసేందుకుపూనుకున్నారు.
‘కరోనా నుంచి కాపాడుకునేందుకు వాడుతున్న శానిటైజర్ ను యువత మత్తు కోసం వాడి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.ఇలాగే ప్రమాణాలు పాటించ కుండా సారాయి, మీథైల్ ఆల్కహాల్ వాడి శానిటైజర్ లను తయారిచేస్తున్న వారి పై దాడులు నిర్వహిస్తాం. శానిటైజర్ సేవించి ఇటీవల ప్రకాశం జిల్లాలో ఏడుగురు కడప జిల్లాలో నలుగురు చిత్తూరు జిల్లాలో ఇరువురు మృతి చెందిన విషయం గుర్తు చేస్తూ మద్యం మత్తుకు బానిసైన వారిని విముక్తులను చేసేందుకే స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం,’ అని రమేష్ రెడ్డి చెప్పారు.