(Ahmed Sheriff)
అది 2022. ఒక పెళ్ళీ జరుగుతోంది . పెళ్ళికొడుకు తండ్రికీ, పెళ్ళి కూతురు తండ్రికి మధ్య వాగ్వాదం. పెళ్ళికొడుకు తన ఇమ్మ్యూనిటీ పాస్ పోర్ట్ నమోదు చేయలేదట. అందుకే పెళ్ళి ఆగిపోయింది.
ఒక ప్రయాణీకుడు విదేశాలకు వెళుతున్నాడు. తనిఖీ ఆఫీసరు ఆ ప్రయాణీకుడి పాస్పోర్టు తో పాటు ఇమ్మ్యూనిటీ పాస్ పోర్ట్ అడిగాడు. అది లేనందుకు ఆ ప్రయాణీకుడి ప్రయాణం వాయిదా పడింది. నీశరీరంలో కోవిడ్-19 ని ఎదిరించే యాంటీబాడిలున్నట్లు ఇమ్యూనిటీ పాస్ పోర్టు వెరిఫై చేశాకే ఇమిగ్రేషన్ అధికారులు మమ్మల్ని విమానంలోకిఅనుమతిస్తారు. అంతేకాదు, ఆదేశపు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం తప్పనిసరి. అపుడది మీద కదలికలను గమనిస్తూ ఉంటుంది.
ఒక ఆసుపత్రిలో వార్డు బాయ్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఇమ్మ్యూనిటీ సర్టిఫికేట్ లేదని విద్యార్హత వున్నా ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు.
క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్ కమ్ సర్టిషికేట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డులాగా మనకొక ఇమ్యూనిటీ సర్టిఫికేట్ రోజూ అవసరమయ్యే పరిస్థితులొస్తున్నాయో అనిపిస్తుంది.
ఇప్పట్లో ఇలాంటి విషయాలు జోకులుగానో, అతిశయోక్తులుగానో అనిపించ వచ్చు . కానీ కోవిడ్-19 పాండెమిక్ కుదుటపడిన తరువాత కొరోనా వైరస్ కి వాక్సిన్ కానీ మందు కానీ లేకపోవడం, దాని బారినుంచి బయటపడటానికి వున్న ఒకే ఒక మార్గం ఇమ్యూనిటీ (రొగ నిరోధక శక్తి) కలిగి వుండటమే. ఇలాంటి నేపధ్యంలో ఇవి నిజాలుగా మారే అవకాశం ఎంతైనా వుందని నిఫుణులు చెబుతున్నారు. ఈ చర్చ చాాలా దేశాల్లో మొదలయింది. కొన్ని దేశాలు అపుడే అమలు పెట్టే చర్యలు మొదలుపెట్టాయి.
పెళ్ళికొడుకు కొరోనా బారిన పడకుండా పది కాలాలపాటు వుండి భార్యా పిల్లల్ని చూసుకోగలడు అని, కుటుంబ వ్యక్తులు అనుకోవడం లో తప్పు లేదు.
విదేశాలకు వెళ్ళే వారు తమలో రోగనిరోధక శక్తి వుందని ఋజువు పరిచే సర్టిఫికేట్ తీసుకురావాలని ఆతిధ్య దేశం అంక్షలు విధించడం లో తప్పు లేదు కదా. ఎందుకంటే వచ్చే ప్రయాణికుడు రొగనిరోధక శక్తి కలిగి వుంటే అతడి ద్వారా ఈ వ్యాధి సంక్రమించడానికి గానీ, వ్యాప్తి చెందడానికి కానీ ఆస్కారం లేదు.
ఆసుపత్రుల్లో బాంకుల్లో , జన సమ్మర్ధం వున్న ప్రాంతాల్లో రోగ నిరొధక శక్తి కలిగి వున్న వుద్యోగి, కొరోనా బారిన పడకుండా, దాని వ్యాప్తిని నిరోధించే వాడుగా వుండడం సంస్థల అభీష్టం కావచ్చు
ఇమ్యూనిటీ పాస్ పోర్ట్ అంటె ఏమిటి?
“ఏదేని ఒక ప్రభుత్వం సంస్థ లేదా ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన సంస్థ ఒక మనిషిని పరీక్షించి ఇచ్చే సర్టిపికేట్. ఈ పత్రం వున్న వ్యక్తి అంటురోగాలను నిరోధించే శక్తి (Immunity) కలిగి వున్నాడని ధృవీకరించే ఒక చట్ట బద్ధమైన ప్రమాణ పత్రం”
దీనిని ఇమ్యూనిటీ సర్టిఫికేట్ (Immunity ceritificate or risk-free-certificate) అని కూడా పిలుస్తారు. ఈ సర్టిపికేట్ ఇతనికి కరోనా సోకి ఉండిందని, అతని శరీరంలో కరోనా (SARS-Cov-2) వైరస్ ను ఎదుర్కొనే యాంటిబాడీలున్నాయని, ఇతనికి మళ్లీ కరోన సోకదనే భరోసా ఇస్తుంది.
కొరోనా పాండెమిక్ గురించి అలోచించి నఫ్ఫుడు, మనం పాజిటివ్ కేసులెన్ని, చనిపోతున్నవారెందరు, బతికి బట్ట కడుతున్న వారెందరూ అనే అలోచిస్తున్నాం . అయితే ఈ పాండెమిక్ సమాజ పరంగా, వ్యక్తి గతంగా ఎలాంటి కష్టాలను, నష్టాలను సృష్టిస్తోందో, సృష్టించబోతోందో మనం ఆలోచంచిడం లేదు.
సామాజిక దూరం వల్ల బయటి ప్రపంచం తో సంబంధ బాంధవ్యాలు తెగిపోవడంతో మనకున్న సంతోషాలెన్నో దూరమై పోయాయి. ఇప్పుడు విహార యాత్ర అనేది వుండక పోవచ్చు. పారిస్ నగరం ఇక ఏ మాత్రం రొమాంటిక్ కాదు, రోము నగరాన్ని ఎవరూ దర్శించాలనుకోక పోవచ్చు, అమెరికా లో వుద్యోగం చేయాలనే జిజ్ఞాస మనుషులకు తగ్గి పోవచ్చు. ఎవరో అన్నట్లు ముద్దులూ, కౌగిలింతలూ ఇక ఆయుధాలై పోయాయి. కొడుకులూ, కూతుళ్ళూ తల్లిదండ్రులను చూడటానికి రాకపోవడమే ఇప్పుడు గొప్ప మర్యాద.
విదేశాలకు వెళ్ళే వ్యక్తి ఒక ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలనే మరో అంక్ష కూడా వుండొచ్చు. ఈ ఆప్ ఏం చేస్తుంది అంటె ఆ మనిషి ఎక్కడి కి వెళుతు న్నా డు ఎవరిని కలుస్తు న్నా డు అని వాడి జాడను రికార్డు చేయవచ్చు. ఇది ఆ దేశపు సాంకేతిక నియమాల ప్రకారం సబబే కావచ్చునేమో కానీ , వ్యక్తిగతంగా ఆ మనిషి, తన రహస్యాలనూ, మార్మిక జీవితాన్ని ఇతరుల చేతిలో పెట్టి తన స్వేచ్చను కోల్పోవడం కాదా? నిజంగానే ఇటువంటి నియమాలు లాగూ అయితే జీవితం ఎంత దుర్భరం అయిపోతుంది.?
ఇలాంటి అంక్షలు ఇప్పటికే కొన్ని దేశల వారు అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకుంటే మరికొన్ని దేశాలూ వీటి మీద తర్జన భర్జనలు చేస్తున్నాయి. అయితే ఈ ఇమ్యూనిటీ పాస్ పోర్ట్ మనుషుల ఆంతరంగిక జీవితాల మీదా, ప్రభుత్వ యంత్రాంగాల నిర్దేశాల మీదా, సాంకేతిక పరిజ్ఞానపు లాభ నష్టాల మీదా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇమ్మునిటీ పాస్ పోర్ట్ మీద నైతిక విలువల దృష్ట్యా మానవ హక్కుల సంఘం అందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈసర్టిఫికేట్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది.” There is currently no evidence that people who have recovered from COVID-19 have antibodies are protected from a second infection,” అని ప్రపంచ బ్యాంక్ కూడా వ్యాఖ్యానించింది.
అయినా సరే ఇమ్యూనిటీ పాస్ పోర్ట్ అమలు చేయాలని అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ లతో పాటు అనేక దేశాలు సీరియస్ గా ఆలోచిస్తున్నాయి. చాలా మందికి భూతల స్వర్గాలుగా కనిపించే దేశాలివేగా. ఇక్కడి పోవాలనుకుంటారు. అందుకే ఈ దేశాలు ఇమ్యూనిటీ పాస్ పోర్ట్ అంటున్నాయి. ఈ సర్టిఫికేట్ అనివార్యం చేస్తే,అన్ని విధాల ఆరోగ్యంగా ఉండి, కేవలం SARS-COV-2 యాంటి బాడీలు లేని వాళ్లకు విదేశాలకు వెళ్లే అర్హత పోతుంది. చాలా ప్రయోజనాలు దెబ్బతింటాయి. చాలా మందికి విదేశీ ప్రయాణాలనే కాదు, ఉద్యోగాలను కూడా నిరాకరించవచ్చు. ప్రజలు రెండువర్గాలుగా విడిపోతారు, ఇమ్యూనిటీ సర్టిఫికేట్ఉన్నవాళ్లు (COVID antibody elite), లేని వాళ్లు అని. మన సమాజం‘ ఉన్నోళ్లు, లేనోళ్లు’ అనే కొత్త అర్థం తో రెండుగా చీలిపోతుందన్నమాట.
న్యూయార్క్ లో ఎంజరుగుతున్నదో బిబిసి (BBC) వివరించించింది. అక్కడ ప్రజలు ‘మేము సురక్షితం,కరోనాసోకింది,పోయింది. మాలో యాంటీ బాడీస్ డెవెలప్ అయ్యాయి,’ అని ప్రకటించుకోవలసివస్తున్నది.
“In New York, people are using antibody tests showing that they have been exposed to the virus and have recovered- as way of suggesting they are safe to date).
ఇలా రుజువుచేసుకున్నపుడే రేపు ఉద్యోగాలలకు అనుమతించే దుస్థితి రావచ్చు. ఇదే అపార్ట్ మెంట్లలో అద్దె ఇళ్లకూ వర్తించవచ్చు.
ఈ సర్టిఫికేట్ అనివార్యమైతే, దీన్ని పొందడానికి కొంతమంది కొరోనాను ఆహ్వానించ వచ్చు, దొంగ సర్టిఫికేట్ల బ్లాక్ మార్కేట్ పెరగవచ్చు. ఒక ప్రక్క దీనివల్ల సాంఘిక, పౌర, ఆర్థిక వ్యవహారాల్లో కట్టుబాట్లు వచ్చి ఇప్పుడున్న జాతి, కుల,మత, లింగ బెధాలు అధికం కావచ్చు. మరో ప్రక్క అందర్నీ సమానం చేసేస్తే తమ వల్ల రోగ వ్యాప్తి జరగకుండా కాపాడే శక్తి కలిగివున్న “ఇమ్మ్యూన్” ప్రజలు వారి లాభాన్ని పొందలేక పోవచ్చు
కోవిడ్ 19 పాండెమిక్ ప్రపంచంలో శారీరక ఆరోగ్యం పై కంటే మానసిక ఆరొగ్యం పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందా? ఆన్నది వేచి చూడాలి.
* Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM,Consultant, PMP Certification, Project Management, Quality, Mob: +91 9849310610