ప్రముఖ వాగ్గేయకారుడు,ఉత్తరాంధ్రలో విప్లవోద్యమాలకు పాటతో వత్తాసు పలికిని వంగపండు ప్రసాదరావు(77) మృతి చెందారు. ఉత్తరాంధ్రలో పాట అంటే వంగపండు.అక్కడి జానపదాలను తీసుకుని ఆయన కమ్యూనిస్టు పోరాటాలను కీర్తిస్తూ, భావజాలాన్ని ప్రచారం చేస్తూ పాటలు కట్టేవారు. ఆయన పాటకున్న వశీకరణ శక్తి అంతా ఇంతకాదు. పూర్వం విప్లవరచయితలతో కలసి నడించారు. ఆ తర్వాత ఈసంస్థకు దూరమయ్యారు.ఇపుడాయనకుటుంబం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు దగ్గిరయింది.
ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు . పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు మృతి చెందార. వందలాది ప్రజల పాటలను రచించిన వంగపండు ప్రసాదరావు అనేక జానపద కళారూపాలను నాటి విప్లవోద్యమ ప్రచార పాధానలుగా మార్చారు. వూరూరు తిరిగారు. కుర్రకారును ఊర్రూత లూగించారు. ఎంతో మందని విప్లవోద్యమం వైపు మళ్లించారు.
వంగపండు 1943లో పెదబొండపల్లిలో జన్మించారు.
‘అర్థరాత్రి స్వాతంత్య్రం’తో సినిమాతో వంగపండు సినీ ప్రపంచంలోకి వచ్చారు.1972లో ఆయన నాటి మరొక ప్రజాకవి గద్దర్, బి నర్సింగరావుతో కసలి మావోయిష్టు పార్టీ సాంస్కృతిక సంస్థ ‘జననాట్యమండలి’ని స్థాపించారు. అపుడే ఆయన ‘ఎం పిల్లడో ఎల్దమొస్తవా’ ‘యంత్రమెట్టా నడుస్తు ఉందంటే… ’ వంటి పాటలురాశారు. ఆయన రాసిన వందలాది పాటు పలు భాషల్లోకి అనువాదమై అక్కడి ప్రజలను ఉత్తేజపరిచేయి.
విప్లవరాజకీయాలనుంచి బయటకు వచ్చాక ఆయనకు రాజకీయ ప్రత్యామ్నాయమేమీ కనిపించలేదు. అందుకే ఒక కొత్త పార్టీ కూడా స్థాపించారు. 2012లో వంగపండు ప్రజాదండు స్థాపించారు. తన పార్టీ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం కోసం, అభివృద్ధికోసం పనిచేస్తుందని ప్రకటించారు.