మొత్తం కరోనాకేసులలో సోమవారం నాడు 166,586 కేసులు నమోదుకావడంతో ఆంధ్రప్రదేశ్ మూడోస్థానానికి చేరుకుంది. మొదటిస్థానం 4,50,196 కేసులతో మహారాష్ట్రది. 2,63, 22 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. మరణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ (1537) ఎనిమిదో స్థానంలో ఉంది. ఆగస్టు నెలలో పెళ్లిళ్లు, కొన్ని పండగలు ఉన్నందున కరోనా కేసులు ఉధృతమవుతాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు రాష్ట్రాన్ని సమాయత్తం చేసేందుకు చర్యలు మొదలుపెడుతున్నారు. అయినాసరే, రాష్ట్రంలో కరోనాలోడో పెరిగిపోతున్నది. ఇది ఒక సవాల్ అనే అందోళన ను కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారున
దేశంలో కరొనా పరీక్షలు ఎక్కువగా జరుపుతూన్న రాష్ట్రం ఆంధ్ర్రప్రదేశే అనుమానం లేదు. అయితే, రాష్ట్రంలో తవ్వేకొదికేసులుబయటపడుతున్నాయి. ఇన్ని కేసులెక్కడ నుంచి వస్తున్నాయనే ప్రశ్న వస్తుందపుడు. ఉదాహరణకు సోమవారం నాడు విడుదల చేసిన బులెటీన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గడిచిన 24 గంటలలో 45,516 శాంపిల్స్ పరీక్షించారు. ఇందులో 7,822 కేసులు దొరికాయి. జిల్లాల వారీగా కేసులకు సంబంధించి కొన్ని జిల్లాలు కరోనా గనుల్లాగా తయారయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1113 కేసులు నమోదయ్యాయి. తరవాత విశాఖపట్టణం జిల్లాలో నుంచి 1049 కేసులునమోదయ్యాయి. అనంతపురం నుంచి 953 కేసులు నమోదయ్యితే, విజయనగరం జిల్లా నుంచి 677 కేసులు నమోదయ్యాయి.
దీనిని బట్టి ఏమనిపిస్తుంది. ఆంధ్రలో కరోన కమ్యూనిటీ ట్రాన్సమిషన్ స్టేజ్ లోకి ప్రవేశించిందని, అదాలో లోలోపు విస్తరిస్తూ పోతున్నదని, అందుకే పరీక్షలు పెరిగే కొద్ది కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అనిపిస్తుంది. రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ నడుస్తూ ఉందని అధికారికంగా ప్రకటించేందుకు అధికారలు సిద్ధంగా లేరని, తూర్పుగోదావరి వంటి జిల్లాలలో వేల సంఖ్యలో రోజూ కేసులు కనిపించేందుకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కాక ఏమవుతుంది. వైరస్ జిల్లా కేంద్రాలనుంచి మండల కేంద్రాలనుంచి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించిందని అధికారుల అంగీకరిస్తున్నారు. దీనికి కారణం ఇతర రాష్ట్రాలనుంచి ఆంద్రప్రదేశ్ కు వస్తున్నవారిలో ఎక్కువ మందికోరనా మోసుకొసున్న(క్యారియర్స్ )వారే నని అధికారులు చెబుతున్నారు.
ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ 21,10,923 శ్యాంపిల్స్ పరీక్షించింది. ప్రతి మిలియన్ మందిజనాభాకు ఆంద్రప్రదేశ్ చేస్తున్న కరోనా పరీక్షలు 39,530. రెండో స్థానంలో తమిళనాడుది . అక్కడ 36092 కేసులు. పాజిటివిటీ రేటు కూడాఆంధ్రలో చాలా ఎక్కువగా ఉంది. సోమవారం నాటి పాజిటివిటి రేటు 7.89 శాతం.పాజిటివిటి రేటులో మహారాష్ట్ర (19.52 శాతం) కేసులతో అగ్రస్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో తెలంగాణ(13.96 ) మూడో స్థానం కర్నాటక (9.50) రాష్ట్రానిది. తమిళనాడు పాజిటివిటి రేటు(9.27) ఆంధ్రప్రదేశ్ పాజిటివిటి రేటు 7.89. ఇది చాలా ఎక్కువే. కాకపోతే, జాతీయ పాజిటివిరేటు (8.93) కంటే తక్కువ అనేది కొంచెంవూరట.
శ్యాంపిల్స్ ఎక్కువ పరీక్షిస్తున్న కొలది కొత్త కేసులు పెరుగుతూ ఉండటంతో రాష్ట్రంలో కరోనా లోడ్ పెరుగుతూ ఉంది. ఇందులో కూడా తూర్పు గోదావరిజిల్లా లో మరీ ఎక్కువగా ఉంది. గత రెండు వారాల్లో తూర్పు గోదావరి జిల్లా తారుమారయింది. ఇక్కడి కేసులు విపరీతంగా పెరిగి కర్నూలు, కృష్ణాలను అధిగమించింది. జిల్లా కేంద్రం కాకినాడు కరోనా హాట్ స్పాట్ అయింది. తొందర్లో రాష్ట్ర రాజధాని కాబోతున్న విశాఖపట్నంలో కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆగస్టు నాలుగోతేదీన 1049 కేసులు ఈ జిల్లానుంచి నమోదుకావడంతో మొత్తం కేసులు 14196 కు చేరుకున్నాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాలో విశాఖ అయిదోదయింది. అగ్రస్థానంలో 23,314 కేసులతో తూ.గోదావరి జిల్లాది అగ్రస్థానం. 19,679 కేసులతో కర్నూలు జిల్లాది రెండో స్థానం కాగా,అనంతపురం జిల్లా 17,476 కేసులతో మూడో స్థానంలో ఉంది. నాలుగోస్థానంలో 16,881 కేసులతో గుంటూరుది.
అందుకేఆగస్టు నెల చాలా కీలకమయిందని అధికారులు చెబుతున్నారు. టెస్టింగ్ లు ఎక్కవవుతున్నాయి. కేసులూ ఎక్కువవుతున్నాయి. కనిపించిన కేసుల చాలా మందికి ఆసుపత్రి పడకలు అవవసరమవుతాయి. టెస్టింగ్ కెపాసిటీ 70 శ్యాంపిల్స్ కు పెంచారు. ఆంధ్రప్రదేశ్ కు ఊరట కలిగించే మరొక విషయం మృతుల సంఖ్య. ఆంధ్ర మరణాల రేటు 1.01 శాతం మాత్రమే.
ఏదిఏమయినా రాష్టరంలో ఆగస్టులో విపరీతంగా కేసులు పెరుగనున్నాయి. దీనికి తగ్గట్టుగా ఆసుపత్రులలో పడకలు పెరగాలి. ఐసియు బెడ్లు పెరగాలి.ఇపుడు 139 కోవిడ్ ఆసుపత్రులు రాష్ట్రంలో పని చేస్తున్నాయి. వీటిలో 4,300 ఐసియు పడకలు, 17,370 నాన్ ఐసియు పడకలున్నాయి. ఇపుడు రాష్ట్రంలో 1,513 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి. మరొక వేయి కొంటున్నారు. ఇవి హైరిస్క్ రోగులకు మాత్రమే పనికొస్తాయి.
దీనితో ఆరోగ్య శ్రీ కింద కోవిడ్ రోగులకు చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు ఆసుపత్రులనుకోరిం. ఆగస్టు లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నందున కేసులు పెరిగే అవకాశం ఉందని, రాష్ట్రానికి ఇదొక సవాల్ కాబోతున్నదని అధికారులు భావిస్తున్నారు.