తిరుపతి నగరంలో “కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల” దోపిడిని అరికట్టేందుకు “టోల్ ఫ్రీ నెంబరు” ప్రకటించండని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్జప్తి చేశారు.
తిరుపతి పట్టణంలో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నందున ప్రభుత్వం ఆసుపత్రుల బెడ్లు దొరకడంలదేని, ప్రయివేటు ఆసుపత్రులు దీనిని బాగా సొమ్ముచేసుకుంటున్నాయని ఆయన కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
“కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి” కరోనా సోకిన పేద ప్రజలు బలైపోతున్నారని చెబుతూ తిరుపతి నగరంలో కరోనా చికిత్స కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఫీజుల ధరల పట్టిక బాధితులకు తెలిసేలా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
తిరుపతి ప్రైవేట్ హాస్పిటల్ లలో ఏ బాధితుడి కైనా ట్రీట్మెంట్ సమస్య వచ్చినా లేక అధిక బిల్లులు వసూలు చేసినా వెంటనే జిల్లా కలెక్టర్ , జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి(DMHO) దృష్టికి బాధితులు తెలియజేసేలా “టోల్ ఫ్రీ” నెంబర్లు ప్రకటించాల్సిన అవసరముందని ఆయన చెప్పారు.
టిటిడి పరిపాలనా భవనం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఏంజరిగిందో ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఒక పేషెంట్ 30వ తేదీన అడ్మిట్ అయ్యాడు. ఆయనను 31వ తేదీ డిశ్చార్జ్ చేశారు. అంటే కేవలం ఒక్క రోజు మాత్రమే ఆసుపత్రిలో ఉన్నాడు. దీనికి ఆ పేషెంట్ కు 72,000 వేలు బిల్లు ఇచ్చారు. దీని దోపిడిీ మీద విచారణ జరిపించాలని ఆయన జిల్లా కలెక్టర్ ను కోరారు.
నవీన్ కుమార్ లెవనెత్తిన మరిన్ని అంశాలు:
తిరుపతి నగరంలో ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో నైనా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చిన వెంటనే ఆ ఆసుపత్రి లైసెన్స్ ను రద్దు చేయండి!!
కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రాణాలతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం చెలగాటం ఆడటం బాధాకరం!!
వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు దగ్గు వచ్చినా అనేకమంది ప్రజలు అభద్రతాభావంతో వైద్యులను సంప్రదిస్తున్నారు అలాంటి వారిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేయకండి!!
ప్రభుత్వ ఆసుపత్రిలో వైరస్ బాధితుల సంఖ్య పెరగడంతో బెడ్ ల కొరత కారణంగా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు!!
రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ చికిత్సను “ఆరోగ్యశ్రీ” పథకంలో చేర్చారా?? లేదా?? స్పష్టమైన ప్రకటన చేయాలి!
వైద్యో నారాయణో హరి అంటారు వైద్యులు దైవంతో సమానంగా భావిస్తారు ఇలాంటి కష్ట కాలంలో మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా!!