తమిళనాడు గవర్నర్ కు కూడా కరోనా సోకింది. గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ కోవిడ్ పాజిటివ్ అని కావేరీ హాస్పిటల్స్ ఒక హెల్త్ బులెటీన్ విడుదల చేసింది. ఆయన లో ఎలాంటి రోగ లక్షణాలు లేవని, క్లినికల్ గా నిలకడగా ఉన్నారని ఆసుపత్రి పేర్కొంది. ఇన్ ఫెక్షన్ మైల్డ్ గా ఉండటంతో ఇంట్లోని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన ఆరోగ్యాన్ని కావేరీ ఆసుపత్రికి చెందిన వైద్య బృందం పరీక్షిస్తూ ఉంటుంది.
రాజ్ భవన్ లో 84 మంది సిబ్బందికి కరోనా సోకడంతో కొద్ది రోజుల కిందట ఆయనను ఐసోలేట్ చేశారు. అయితే, ఈ మధ్యాహ్నం తర్వాత ఆయనను కావేరీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రాజ్ భవన్ లో కరోనా కల్లోలం గురించి జూలై 23నే బయకుకు తెలిసింది. తర్వాత రాజభవన్ ని క్రిమిసంహాకర రసాయనాలతో శుభ్రం చేశారు.