విమ్స్ (వైజాగ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ) పరిస్థితి ఇలా ఉందని ఆసుపత్రి నుంచి ఒక యువకుడు పంపిన వీడియో ఇపుడు వైరలవుతూ ఉంది. అక్కడ నేల మీద ఒక మహిళపడిపోయి ఉంది. ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అదే విధంగా ఈ వీడియో తీస్తున్నపుడు వార్డులో సిబ్బంది ఎవరూ లేరని పరస్థితి దారుణంగా ఉందని ఈయువకుడు చెప్పాడు. వీడియో చూడండి.
కరోనాకేసుతో వచ్చిన ఒక యువకుడు అక్కడి పరిస్థితి చూసి భయపడి దుంఖిస్తూ ఈ వీడియో షేర్ చేశారు. నిన్న రాత్రి ఒక మనిషి విలపిస్తూ వచ్చి అక్కడే పడిపోయి చనిపోయాడని ఆయన చెప్పాడు. అపుడు ఆసుపత్రిలో అతనికి సాయం చేసేందుకు ఎవరూ లేరు. ఇపుడు తన పరిస్థితి కూడాఇలాగే ఉందని ఆయన బాధపడుతున్నాడు. తనకు పిల్లలున్నారని, తను ఇక్కడి జబ్బు నయం చేసుకుని ఇంటికిపోతానో లేదో నని ఆయన భయపడుతున్నాడు. ఇలా ఆసుపత్రులలో చేర్చుకుని పేషంట్లను గాలికి వదిలేసి వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారన ఆయన చెబుతున్నాడు. ఈ వీడియోలు చూడండి.