అనంతపురం జిల్లాలో రేపు (03.08.20) మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా కోవిడ్ నమూనాలు సేకరిస్తారు. కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలనుకునే వారు ఈ ప్రాంతాలకు వెళ్ల వచ్చు.
గత 24 గంటలలో అనంతపురం జిల్లా నుంచి 696 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో జిల్లాలో మొత్తం కేసులు 16523కు చేరాయి. యాక్టివ్ కేసులు 8390 ఉంటే మొత్తం మరణాలు 122 నమోదయ్యాయి. గత 24 గంటలలో జిల్లాలో ఇద్దరు వ్యక్తులు కరోనా వ్యాధితో మృతి చెందారు.
నమూనా సేకరించే ప్రాంతాలు:
1.క్రిష్టిపాడు
2. రాయలచెరువు
3. కళ్యాణదుర్గం అర్బన్
4. ధర్మవరం (శివనగర్,ఎల్ సి కె పురం,గర్ల్స్ హై స్కూల్)
5. కదిరి టౌన్
6. హిందూపురం
7.తాడిపత్రి (మునిసిపల్ పార్క్, జూనియర్ కాలేజ్ గ్రౌండ్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్)
8. పుట్టపర్తి (జడ్పీ హైస్కూల్, ఎనుముల పల్లె జడ్పీ హైస్కూల్, బ్రాహ్మణపల్లి ఎంపీపీ స్కూల్)
9. గుంతకల్ అర్బన్ (ఎస్ జె పి స్కూల్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హైస్కూల్, పాత గుత్తి రోడ్డు లోని కూరగాయల మార్కెట్)
10. గుత్తి (రైల్వే స్టేషన్ గ్రౌండ్, తాడిపత్రి రోడ్డు, గుత్తి కోట)
అనంతపురంలో ఫిక్స్డ్ లొకేషన్స్ వివరాలు :
11. ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల
12. సిడి హాస్పిటల్, ఓల్డ్ టౌన్
13. ఆర్ట్స్ కళాశాల
14. ఓల్డ్ రిలయన్స్ ఆఫీస్, రుద్రంపేట.
ఈ ప్రాంతాలతో పాటు పిహెచ్ సి లు, సిహెచ్ సి లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల నుండి కూడా శాంపిల్స్ సేకరిస్తారు. కోవిడ్ లక్షణాలున్న వారు పరీక్ష చేయించుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రేపు అనంతపురం రానున్న ఆరోగ్య మంత్రి
3వ తేదీ సోమవారం 10గంటలకు అనంతపురం జిల్లా ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కలెక్టర్ ఆఫీస్ కు చేరుకుంటారు. కలెక్టర్ ఆఫీస్ నుండి అనంతపురం జిల్లా లో క్వారంటైన్ సెంటర్ లో ఉన్న కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. అనంతపురం జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా తీసుకోవలసినచర్యలను ప్రజాప్రతినిధులు.అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షిస్తారు.