రాజధాని బిల్లులకి ఆమోదం గవర్నర్ వ్యవస్థకు మచ్చ: నరసింహయాదవ్

 తిరుపతి :ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సిఆర్ డిఎ  బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడం గవర్నర్ వ్యవస్థకే మచ్చ అని చిత్తూరు జిల్లా టిడిపి నేత, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు.
 ఈ రెండు బిల్లులు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయని, అలాగే  శాసనమండలి సెలెక్ట్ కమిటీకి కూడా నివేదించారని చెబుతూ ఈ దశలో గవర్నర్ వాటిని ఎలా ఆమోదిస్తారని నరసింహ యాదవ్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
నర్శింహయాదవ్ ఇంకా ఏమన్నారంటే…
మూడు రాజధానులు వికేంద్రీకరణ బిల్లు, సి ఆర్ డి ఏ బిల్లు ఆమోదించవద్దని రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు వివిధ సంఘాలు విన్నవించినా గవర్నర్ అవేమీ తనకు పట్టవని ఈ బిల్లులను ఆమోదించారు.
 మూడు రాజధానులు వికేంద్రీకరణ, సిఆర్ డిఎ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్రపతికి పంపాలి. కాని  అలా చేయకుండా
Narasimha Yadav TDP Tirupati
ఆమోదించడం గవర్నర్ వ్యవస్థకే మచ్చ.

 

రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించినంత మాత్రాన కోర్టులలో ఇది నిలవదు. మొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా గవర్నర్ నియమించబడ్డ కనకరాజు లో కోర్టు ఏమిచేసిందో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈ బిల్లులకు ఇదే పరిస్థితే ఎదురు కానుంది.
ప్రతిపక్ష పార్టీల విన్నపాలను పట్టించుకోకుండా గవర్నర్ ఆమోదించడం దేనికి నిదర్శనం? ఈ బిల్లులు చట్ట వ్యతిరేకమని ఆమోదించవద్దని విపక్షాలు ప్రజా సంఘాలు చేసినవిజ్ఞప్తులులను గవర్నర్ పట్టించుకోవడం విచారం.
రాజధాని కోసం 29వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూములను రాజధాని నిర్మిస్తారని  ప్రభుత్వంపై నమ్మకముతో ఇచ్చారు. వాళ్ళ  నమ్మకాన్ని గవర్నర్ వమ్ము చేశారు.
తమకు తెలియకుండా రాజధాని తరలించకూడదని హైకోర్టు కూడా చెప్పింది. అయినా గవర్నర్ ఇలాచేయడం చట్టవ్యతిరేకం.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే వివాదాస్పద నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడం మంచిది కాదు. ఇది చారిత్రాత్మక తప్పిదం.
.