ట్రంప్ మళ్లీ చిట పట , జర్మనీ నుంచి సైనికుల ఉపసంహరణ

ట్రంప్ ను అదుపు చేయడం ఎవరి తరమూ కాదు.  ప్రపంచమంతా తన చిటికేస్తే సెల్యూట్ కొట్టాలనుకుంటాడు. లేదంటే వెళ్లిపో అంటాడు. లేదంటే తనైనా వెళ్ళిపోతాడు. ఈ రోజుకు కోపాన్ని అణచుకోలేక తానే వెళ్లిపోతానన్నాడు. నాటో అగ్రిమెంట్ ప్రకారం జర్మనీలో ఉన్న సైనికులను వెనక్కి రమ్మన్నాడు.ఇక జర్మనీని మేం రష్యానుంచి ఎందుకుకాపాడుతూరావాలి,అంటూ 12000 వేలమంది సైనికులను వెనక్కి రమ్మన్నాడు. అసలు నాటో అనేదే ఒక పనికి మాలిన సంస్థ. ఎపుడో  కమ్యూనిస్టు రష్యా బూచి  చూపి,   కమ్యూనిస్టు తిరుగుబాట్లు రాకుండానో, దేశాలు రష్యా కూటమిలో చేరకుండా ఉండేందుకు  ఏర్పాటు చేసిన కిరాయిసైన్యం. నాటో కు కట్టుబడి ఉండే దేశాలలో అమెరికా  తన సైన్యాన్ని కాపల పెడుతుంది. దానికి ఫీజువసూలు చేస్తుంది. ఇలా జపాన్, ఫిలిలప్పీన్స్, సౌత్ కొరియా, జర్మనీ వంటి అనేక దేశాలలో అమెరికా సైనికులున్నారు. ఇపుడు సోవియట్ యూనియన్ లేదు. కమ్యూనిజమూ లేదు. ఇక నాటో తోపనేంటనే ప్రశ్న వస్తూన్నది. దానికి అమెరికా ఇపుడు అగ్రరాజ్యమేమీకాదు. వాళ్ల డాలరు కుప్పకూలుతూఉంది. అందువల్ల అమెరికాతో నష్టాలు, కష్టాలే తప్ప ప్రయోజనం లేదని చాలా దేశాలు  అమెరికా సైన్యాలు వద్దంటున్నాయి. రష్యాతో వ్యాపారలావా దేవీలు పెట్టుకుంటున్నాయి. ఇలా జర్మనీ రష్యానుంచి గ్యాస్ కొనాలనుకుంది.
ఇది ట్రంపుకు నచ్చలే. అంతే చిటచిటలాడాడు. రష్యా నుంచి  జర్మనీ గ్యాస్ కొనుకుండా అన్ని రకాల అడ్డంకులు సృష్టించాడు. ట్రంప్ మాటలు జర్మనీ వినలేదు. రష్యానుంచిగ్యాస్ కొనేందుకు పైప్ లైన్ వేయడం మొదలుపెట్టింది. దీనితో ఈ రోజు ట్రంపు సైనికులను ఉపసంహరించుకుంటున్నట్లు ట్వీట్ వదిలారు. నాటోచెల్లించాల్సిన 2 శాతం  ఖర్చు కూడా రిఇంబర్స్ చేయడం లేదని గద్దించాడు.

 

 

రష్యానుంచి గ్యాస్ కొనేందుకు జర్మనీ వేయాలనుకుంటున్న నోర్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైను వేయాలనుకున్నప్పటినుంచి అమెరికా కోపంగానే ఉంది. ఈ పని కొనసాగిస్తే,ఈ ప్రాజక్టుకు సామాన్లు రవాణా చేస్తున్ననౌకల మీద అంక్షలు విధిస్తామని బెదిరించాక ఈ ప్రాజక్టు గత ఏడాది పనులుఆపేసింది. అయితే, ఇపుడు జర్మనీ ఈ బెదిరింపులను ఖాతరు చేయడం లేదు. యూరోప్ ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఇంధన కొనాలో నిర్ణయుంచుకునే సర్వసత్తాక హక్కు యూరోప్ కే  ఉంది కాని అమెరికా ఏంది మధ్యలో అని జర్మనీ ప్రకటించింది. 
ఎందుకంటే రష్యానుంచి గ్యాస్ కొనుగోలు చేయడం చౌక అని యూరోప్ దేశాలన్నీ భావిస్తున్నాయి. అలాంటపుడు ట్రంపు మాటవిని కడుపుకాల్చుకోలేరు గా.
జర్మనీ పాలసీని శాసించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూ ఉండటంతో జర్మనీకి బాగా ఇరుకున పడింది. అందుకే ఈ మధ్య అమెరికాని వర్తమానంలో బతకమని, గతంలో దూరి తొంగిచూడవద్దని చెబుతూ జర్మనీ చాన్స్ లర్  ఎంజెలా మెర్కెల్ ఘాటుగా చెప్పారు. ఇక జర్మనీ ఎంత మాత్రం అమెరికా ‘సూపర్ పవర్‘ మీద అధారపడటం సాధ్యంకాదని చెప్పేశారు. ట్రంప్ విధించి ఆటో సుంకాలు ప్రపంచ సంపదకు ముప్పు అని తీవ్రవ్యాఖ్య చేశారు.
ట్రంప్ చైనాను గొడవపెట్టుకున్నాడు. రష్యాతో గొడవలో ఉన్నాడు. ఇపుడు తాజాగా జర్మనీ తగవుపడ్తున్నాడు. మొత్తానికి ట్రంపు అమెరికాని ఎటూకాని వైపు తీసుకుపోతున్నాడని అర్థమవుతుంది.