కేంద్రం విద్యావిధానంలో సమూలమయిన మార్పులు తీసుకువస్తూ నూతన విద్యావిధానం 2020 ప్రకటించడంతో, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం బోధన అమలుచేయడం కష్టమని ఒక సెక్షన మేధావులు చెబుతున్నారు.
ఇందులో భాగమే డాక్టర్ నాటుబాంబుల సుధాకరెడ్డి వర్షన్. ఎన్ ఇ పి-2020 అమలులోకి వస్తున్నందున ముఖ్యమంత్రి తన ఇంగ్లీష్ మాద్యమం గురించి పట్టుదలకు పోకుండా ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన అమలు చేయక తప్పదని సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు.
రాష్ట్రంలో కాన్వెంట్ విద్యేకావాలని, తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియాలో చదువుకోవాలనే డిమాండ్ బాగా ఉంది. జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెడుతూ జివొ విడుదల చేయగానే, భగ్గున మండింది ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటున్న గ్రామీణ పిల్లల తల్లితండ్రులు కాదు. జీవితంలో బాగా సెటిలయిన పట్టణ ప్రాంతమేధావులే అనే విమర్శ వచ్చింది. ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు మీడియం, కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడిమయా అని వాళ్లు ప్రశ్నించారు. కార్పొరేట్ స్కూళ్ల లో తెలుగు మీడియం కంపల్సరీ చేయాలని ఈ మేధావులెవరూ డిమాండ్ చేయకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది.
జగన్ కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం అని ప్రకటించాక రాష్ట్రంలోని మేధావులు రెండువర్గాలు విడిపోయారు. ఒక వర్గం వారు, ఇది అపరాధం, మాతృభాషకు తీరని ద్రోహ, మాతృభాషలో బోదిస్తేనే పిల్లల్లో మేధశక్తి పెరుగుతుందని వాదించారు. ఇక రెండో వర్గం వారు ఇంగ్లీష్ మీడియాన్ని స్వాగతించారు. డబ్బులన్నోళ పిల్లలు కార్పొరేట్ స్కూళ్లలో చక్కగా ఇంగ్లీష్ మీడియం లో చదవుతూ ఉంటే పల్లెత్తు మాట అనని మాతృభాషా వాదులు, ప్రభుత్వ పాఠ శాలల్లో చదివే పేదలపిల్లలు ఎబిసిడిలు నేర్చుకుంటామంటే, తెలుగు భాషకకు వచ్చే నష్టమేంటి, ఇదంతా హిపోక్రసీ, యాంటిపూర్ అని వారు గద్దించారు. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లివచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇపుడు మాతృభాష బోధన, సంస్కృతం అంటూ కొత్త విద్యావిధానం తీసుకువచ్చింది.
దీని మీద ముఖ్యమంత్రి జగన్ నుంచి ఇంకా స్పందన వెలువడలేదు.
ఈ లోపు మాతృభాషా వాదుల వాదన చూద్దాం. ఇది సీనియర్ జర్నలిస్టు, ప్రాక్టిసింగ్ సైకాలజిస్టు డాక్టర్ ఎన్ బి రెడ్డి ఏమంటున్నారో చూడండి
( డా.ఎన్ బి సుధాకర్ రెడ్డి, సీనిరయర్ జర్నలిస్టు, సైకాలజీలో డాక్టొరేట్ చేశారు.సైకాలజీలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, తిరుపతి లో ఉంటారు. ఫోన్ నెం. 9440584400)