ఆడవేషం వేసి తండ్రితో తన్నులు తిన్న నటుడు అస్తమయం

హైదరాబాద్‌: పాత తరానికి చెందిన  ప్రముఖ ప్రముఖ సినిమా నటుడు, రచయిత రావి కొండలరావు  ఈ రోజు హైదరాబాద్ మరణించారు.  బేగంపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంత కాలంగా హుద్రోగ సమస్యలతో ఆయన బాధపతున్నట్లు తెలిసింది. ఆయన భార్య ప్రముఖ రాధాకుమారి. కొద్ది రోజుల కిందట మరణించారు.
ఆయన అసలు పేరు రావి  కొండలరాయుడు.అది ఆయన  తాతగారి పేరు. అయితే రాయుడు అనే మాటని ఆయన చాలా సార్లు రాయలేక పోయే వారు. దానికితో ఆయన చివరి అక్షరాలు రాయుడు బదులు రావు (ఏమీ రావు)అని స్థిరపడిందని ఒక సందర్బంలో ఆయన చెప్పారు.
ఆయన నటుడే కాదు, జర్నలిస్టు కూడా.పూర్వం విజయచిత్ర అని ఒక గౌరవ ప్రదమయిన సినిమా పత్రిక ఉండేది. ఈ తరానికి ఇది అంతగా తెలియని పేరు. ఈ పత్రికకు  ఆయన 36 సంవత్సరాలు  సంపాదకుడిగా ఉన్నారు. ఆరోజుల్లో సినిమా గురించి సరైన కచ్చితమయిన సమాచారం తెలియాలంటే  విజయచిత్రమే చదవాలి.
తన ఆత్మ కథ ‘నాాగావళి నుంచి మంజీర వరకు’ పేరుతో రాశారు. ఇది సినిమా జీవితయాత్ర. ఇందులో ఆనేక ఆసక్తికరమయిన సంఘటలను ఆయన రికార్డు చేశారు. ఆయన తొలి నాటక వేషాల గురించి ఒక విషయం చెెప్పారు. చిన్నప్పుడే ఆయనకు నాటకాల పిచ్చి వచ్చింది. అయితే, వారిది సాంప్రదాయిక కుటుంబం కావడంతో నాటకాలాడటానికి అంగీకరించడం లేదు. అయినా సరే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నాటకాలేస్తూ వచ్చారు. అయితే నాయనమ్మ మాత్రం ఆయనలో ఉన్న నటనాసక్తికి గుర్తించారు.
ఒక రోజు  ఒక నాటకలో ఆయన ఆడవేషం వేయాల్సి వచ్చింది. వేశాడు. బాగా నటించాడు.అంతాపొగిడారు. అపుడు నాటకం నుంచి ‘అమ్మాయి’ని మెచ్చుకున్న వారిలో ఆయన తండ్రి చిదంబరం కూాడా ఉన్నాడు. ఉండబట్టలేక ఆయన  పక్కనున్న వారిని అడిగారు, ఆ అమ్మాయి ఎవరు? చక్కగా నటించిందని. అపుడు వాళ్లంతా నవ్వి, ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ అబ్బాయి, రావి కొండలరాయడు అని చెప్పారు. అంతే, ఆయనకు కోపం నషాలానికి అంటింది. వెంటను కుప్పించి స్టేజీ మీదకు ఎగిసి వాళ్లబ్బాయిని పట్టుకుని విగ్గు లాగేసి చీర చించేసినంత పని చేశాడు.
ఆయన  సుమారు 600చిత్రాలలో నటించారు. తొలిచిత్రం 1957లో వచ్చిన శోభ. దీని దర్శకుడు కె. కామేశ్వరరావు,  నిర్మాత పి వసంతకుమార్ రెడ్డి.  ఆయన సొంతంగా మూడు చిత్రాలు నిర్మించారు.  అవి:  బృందావనం, బైరవ ద్వీపం, శ్రీకృష్ణ విజయం. వరకట్నం, పెళ్లి పుస్తకం, బ‌ృందావనం లలో ఆయన నటకు బాగా గుర్తింపు వచ్చింది. పెళ్లిపుస్తకం కథ రాసిందాయనే. సుమారు వందకు పైగా రేడియో నాటికలు కూడా రాశారు.
ఆయన ఫిబ్రవరి 11 శ్రీకాకుళంలో జన్మించారు. ఆయన  రాథాకుమారి 2012  మార్చి 9న  చనిపోయారు.  ఆమెకూడా 600 చిత్రాలలో నటించారు. ఆమె తొలిచిత్రం తెనే మనషులు (1962). అందులో ఆమె హీరో కృష్ణ తల్లిగా నటించారు.  ఒక అవార్డు స్వీకరించేందుకు రావికొండలరావు  గల్ఫ్ వెెళ్తున్నపుడు ఆయన ఆమె మరణ వార్త అందింది. అనేక చిత్రాలకు సంభాషణలు కూడా రాశారు. ఆయనకు అనే అవార్డులొచ్చాయి. ఆరుసార్లు నంది అవార్డు గెల్చుకున్న ఘనత ఆయనదే.
ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన పాఠశాలలో  పౌరాణిక పాత్రలు పోషిస్తూ వచ్చారు. ఈ  నాటకాల పిచ్చితోనే ఆయన తన 16 వ యేటనే సినిమాలలొనటించాలనే ఆశతో మద్రాసుకు చెక్కేశారు. అయితే, సినిమా జీవితం,లోతుపాతుల గురించి ఏమీ తెలియకపోవడం ఆయన చిత్రాల్లో నటించాలన్న ఆయన ప్రయత్నం విజయవంతం కాలేదు.దీనితో ఆయన ఇంటికి తిరిగొచ్చిబుద్ధిగా చదువుకున్నారు.
అయితే, 1954లో ఆయన మద్రాసు వెళ్లే అవకాశం లభించింది.  అయితే సినిమా వేశాల పనిమీద కాదు, అక్కడి ఒక పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగం కోసం. ఇలాఆయన మద్రాసు చేరుకున్నాక, మొదట రచయిత తలెత్తుకు తిరిగారు. తర్వాత డబ్బింగ్ అర్టిస్టు అవతారమెత్తారు. ఆపైన అసిస్టెంట్ డైరెక్టయ్యారు. ఈ మధ్యలో చిన్నచిన్ని వేషాలేస్తూ వచ్చారు. చివరకు ఆయన బాపు రమణల కంటపడ్డారు. వారి సాయంతో మంచి వేషంతెచ్చుకున్నారు.
1964లో  ప్రేమించి చూడులో అక్కినేని నాగేశ్వరరావు తండ్రి పాత్ర పోషించారు. దీనితో ఆయన మంచి గుర్తింపు వచ్చింది. తానెపుడే కమేడియన్ కావాలని అనుకోలేదు. నా పాత్ర వల్ల ప్రేక్షకులు నవ్వినపుడు నాకు సంతోషమేసేదని ఆయన చెబుతూండే వారు.ఆయనభార్య రాథాకుమారితో కలసి సుమారు 100 చిత్రాలలో నటించారు.
ఆయన ఎన్నో నాటకాలు రాశారు. పట్టాలు తప్పిన బండి, నాలుగిళ్ల చావిడి,  కుక్కపిల్లదొరికింది ఇందులో ప్రముఖమయినవి.
వాహిని మీద పుస్తకం
ఆయన వాహిని స్టూడియోస్ మీద ప్రతిష్టాత్మక సినిమా సంస్థ వాహిని అనే పేరు మీద పుస్తకం కూడా రాశారు.  తెలుగు సినిమా గురించి అనేక ఆసక్తి కరమయిన విషయాలను ఇందులో చెప్పారు. చాలామందికి తెలుగుసినిమా ఎపుడు పుట్టిందో తెలియదు.  1832లో తెలుగు సినిమా పుట్టింది. తొలి సాంఘిక చిత్రం ప్రేమ విజయం.  1936లొ దీనిని  చిత్రకారుడు గూడవల్లి రామ బ్రహ్మం తీశారు. అంతవరకు అన్నీ పురాణ చిత్రాలే వచ్చాయి. అందుకే ఆయన ప్రేక్షకులను సాంఘిక చిత్రాలవైపు మళ్లించాలని ఈ ప్రయోగం చేశారు.1938లొమాాల పిల్ల తీశారు. అది కనకవర్షం కురిపించింది. ఆసంవత్సంలోనే మరొక సాంఘిక చిత్రం గృలక్ష్మి కూడా వచ్చింది.1939 నుంచి 1969 దాకా వాాహిని వారు కేవలం 13 చిత్రాలనే తీశారు.అవన్నీచరిత్రలో నిలిచిపోయారు. చిత్తూరు నాగయ్య,  సముద్రాల రాఘవాచార్య, కె రామనాథ్, మార్స్ బార్ ట్లే, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి, డివి నరసరాజు, ఘంటసాల, పాలగుమ్మి పద్మరాజు వంటి వారిని వెండితెరకు పరిచయం చేసింది వాహినీయే… ఇలాాంటి విషయాలెన్నో ఆయన పుస్తకంలో ఉన్నాయి.  ఇదే విధంగా ఆయన మాయాబజార్, మళ్లీ శ్వరి చిత్రాల మీద కూడా పుస్తకాలు రాశారు.
1997 లో ఆయన రాసిన సున్నిత హాస్య కథలు రావికొండల రావు కథలుగా అచ్చయింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి ‘రావి’ : ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ సంతాపం
విలక్షణ నటుడు, రచయిత, జర్నలిస్ట్, శ్రీకాకుళానికి చెందిన రావి కొండలరావు మృతి పట్ల ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, జర్నలిస్టుగా పనిచేసిన రావికొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలను కుటుంబసమేతంగా చూసే వాళ్ళమని కృష్ణదాస్ గుర్తుచేసుకున్నారు. 600కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణమన్నారు. ఆయన స్వర్గస్తులు కావడం కళా రంగానికి తీరని లోటని కృష్ణ దాస్ చెప్పారు.

 

If you like this story, pl share it with a friend!