అమరావతి: వందలాదిమంది కరోనా పాజిటివ్ పేషంట్లు కనిపించకుండా పోయి తిరుపతి అధికారులకు షాకి చ్చారు. సుమారు 236 మంది తిరుపతి పాజిటివ్ పేషంట్లని ట్రేస్ చేయలేకపోయారు. వారు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే స్విచాఫ్ చేసినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా స్వాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు. స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకునే సమయంలో కొంతమంది రాంగ్ ఫోన్ నంబర్లు, తప్పుడు అడ్రస్‌ల ను ఇస్తున్నారని అనుమానిస్తున్నారు. టెస్ట్‌ల్లో రిపోర్ట్ పాజిటివ్ వచ్చాక వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా రాంగ్ నంబర్ అని వస్తోందని అధికారులు చెబుతున్నారు. దీనితో అధికారులు వారిని ఎలా ట్రేస్ చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
ఇలా ప్రచారంలో ఉన్న జాబితాలో మొత్తం 232 మంది పేర్లున్నాయి.