ఆంధ్రా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కొత్త మార్పులు ప్రవేశపెడుతూ ఉంది. నిజానికి మంచిజీతాలు, సుశిక్షితులయిన అధ్యాపకులు, భవనాలున్నది, విశాలమయిన ఆటస్థలాలున్నదీ ప్రభుత్వ జూనియర్ కళాశాలకే. ఈ వసతులను ఉపయోగించుకుని విద్యార్థులు కాంపిటీటివ్ పరీక్షలకు తయారయ్యేలా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఏ స్థాయిలో కూడా తల్లితండ్రులు ఖరీదయిన ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు తమ పిల్లలను పంపకుండా ఉండేలా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 10  సూత్రాలు ప్రకటించింది. ఈ చర్యలు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలులోకి వస్తాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యారంగంలో మార్పులను ప్రవేశపెడుతున్నారు. విద్యాసంవత్సరం కోవిడ్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయం దినోత్సవం నాడు అంటే సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమవుతుందని కూడా ఆయన ప్రకటించారు.  ఆయన ప్రకటించిన విషయాలు:
1.జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్, జేఈఈఈ, ఐఐఐటీ వంటి కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలి.
2.ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలి..
కార్పొరేట్ కళాశాలల దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహించాలి.
3.రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు.
4.ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్ద పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్ స్థాయి పోస్టులు ఏర్పాటు.
5.చ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రి ప్రైమరీ ఎడ్యూకేషన్, ఎల్ కెజి, యుకెజి  తరగతులు ప్రారంభిస్తారు.
6.రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్ కేజీ, యూకేజీ బోధనలు సాగుతున్నాయి.  వాటిలో 11,657 అంగన్వాడీ కేంద్రాలు  ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానం చేస్తారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కలిసి విద్యా బోధన సాగించాలి.
6. నాడు-నేడు పథకాన్ని ఫేజ్-2, ఫేజ్-3లో జూనియర్, డిగ్రీ కళాశాలలను చేరుస్తారు. విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీగా చర్యలు తీసుకుంటారు.
7. లైఫ్ స్కిల్స్ కార్యక్రమాలపై ఎనిమిదో తరగతి నుంచే విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి.   కంప్యూటర్ నిర్వహణ, హార్డవేర్, స్పోకెన్ ఇంగ్లీష్  వంటి అంశాలపై ఈ శిక్షణ ఇవ్వాలి.
8.కడపలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజేత స్కూల్ మాదిరిగా రాష్ట్రంలో దివ్యాంగు విద్యార్థులకు విద్యా బోధన సాగించాలి. దీనికోసం రాష్ట్రంలో విజేత స్కూల్ మోడల్ గా ప్రతి నియోజకవర్గంలోనూ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
9. డైట్ సెంటర్లను టీచర్ ట్రయినింగ్ సెంటర్లగా మార్పు చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాకొక టీచర్ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారు.
10. ఆన్ లైన్లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేస్తారు. ఇకపై ప్రతి ఏటా అకాడమిక్ ఆడిటింగ్ నిర్వహిస్తారు.