సాధారణంగా అందరికళ్లూ అమెరికా మీద ఉంటాయి. అమెరికా దేశానికి, డాలర్ కు ఉన్న ఆకర్షణ అది. మరొక వైపు చూసేందుకు ప్రజలెవరూ పెద్దగా ఇష్టపడరు. ఒక వేళ పక్క చూపూ పడిందంటే అది అమెరికా తర్వాతే.
రష్యాలాంటి దేశాలు ఎబ్రాడ్ జాబితాలో చాలా కిందుంటాయి. లేదా అసలుండకపోవచ్చు కూడా. అందుకే పత్రికల్లో అమెరికా వార్తలే ఎక్కువగా వసుంటాయి.
ఆమెరికా ఇంకా సూపర్ పవర్ అని మనచేత ఒప్పించే వార్తలే ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్లే రష్యావాళ్లు, గాని ఇతరచిన్నచిన్న దేశాలు తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ గురించి పెద్దగా మనకు వినిపించదు.
అక్స్ ఫోర్డ్ వ్యాక్సిన్ , కేంబ్రిడ్జి వ్యాక్సిన్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ , భారత్ బయోటెక్ వ్యాక్సిన్, చైనా వ్యాక్సిన్ … అని అనేక దేశాల ప్రయోగాల మీద పిచ్చి పిచ్చిగా మీద వార్తలు, వూహాగానాలు వస్తుంటాయి.
రష్యా వ్యాక్సిన్ తయారీ వార్తలు బాగా అరుదు.వచ్చిన ఎక్కడో మూలనపడుతుంది, మనకంటికి ఆనదు. అయితే, రష్యాలో కూడా వ్యాక్సిన్ తయారీ జోరుగా సాగుతూ ఉంది. అంతేకాదు, రష్యాలో ఒక వ్యాక్సిన్ ఎపుడో తయారయిందని, దానిని గోప్యంగా ‘పెద్ద’ వాళ్లందరికీ ఇస్తున్నారని అమెరికా పత్రికలు గోలచేయడం కూడా మొదలయింది.
ఈ రష్యా వ్యాక్సిన్ గోల ఎంత వరకు వెళ్లిందంటే రష్యాలో వ్యాక్సిన్ తయారయిందని, దాని మొదటి డోస్ ప్రయోగాత్మకంగా ఏకంగా దేశాధ్యక్షుడు పుతిన్ కే ఇచ్చారనే దావానలంగాగా అంటుకుంది. ఇతర అధికారపార్టీ, ప్రభుత్వ ప్రముఖులకు, బలిసిన వ్యాపారస్థులకు ఈ వ్యాక్సిన్ అందించారని అమెరికాలో వార్తలొచ్చాయి. Russian Elite Given Experimental COVID-19 Vaccine Since April అని నిన్న బ్లూమ్ బెర్గ్ వేసిన బాంబ్ షెల్ ఇది.
The Gamaleya vaccine, finance by the state-run Russian Direct Investment Fund and backed by the Defense Ministry, lase week completed a phase 1 trial involving military personnel. The Institute has not published results for the study, which involved about 40 people, but has begun the next stage of testing with a larger group: అని బ్లూమ్ బెర్గ్ రాస్తూనే రష్యా ఖండించింది.
బ్లూమ్ బెర్గ్ వంటి పత్రికలు రాస్తే దేశాధ్యక్షుడు వ్లడిమీర్ పుతిన్ కే మొదటి సారి ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్ ఎక్కించారని వూహాగానాలు రాక ఏంచేస్తాయి.
పుతిన్ కు ట్రయల్ వ్యాక్సిన్ ని ఎక్కించారన్న వార్తలను రష్యా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ ఖండించారు. ధృవీకరించని ఒక వ్యాక్సిన్ ను ఒక దేశాధ్యక్షుడికి ఇవ్వడం మంచిది కాదు, (“not very good for the head of state to receive an uncertified vaccine.”) అని పెస్కోవ్ చెప్పారు. తాను కోవిడ్ పాజిటివ్ అని రష్యా అధ్యక్షుడుపుతిన్ ఎపుడో మే నెలలోనే ప్రకటించారు.
ఈ డబ్బున్న వాళ్లకు అందుబాటులోకి వచ్చిందని చెబుతున్న ఈ ‘ఎలిట్ కోవిడ్-వ్యాక్సిన్’ ఫేక్ న్యూస్ అని రష్యా కొట్టి పారేసినా నిజమేంటో ఎప్పటికీ తెలిసే అవకాశంలేదు.
అయితే, ఈ లోపు రష్యన్ మిలిటరీ మరొక వార్త ప్రటించింది. కోవిడ్-19 వ్యాక్సిన్ ను మనుషుల మీద జరుపుతున్న తుది ప్రయోగానికి ముందుకు వచ్చిన వలంటీర్లు వ్యాక్సిన్ తీసుకుని ఒక మిలిటరీ ఆసుపత్రి నుంచి నుంచి విడుదలయ్యారని తెలిపింది. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేసిందనే విషయం ఆగస్టు మొదటి వారంలో తెలుస్తుందని కూడా అధికారులు ప్రకటించారని rt.com రాసింది.
ఈ వ్యాక్సిన్ మాస్కోలోని Gamalei Institute of Epidemiology, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా తయారు చేశాయి. తమ వ్యాక్సినే ప్రపంచంలో మాస్ ప్రొడక్షన్ కి వచ్చే తొలి వ్యాక్సిన్ అవుతుందని రష్యా కూడా గొప్పగా ప్రకటిస్తూ ఉంది.
ఆక్స్ ఫోర్డు జెన్నెర్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తాము ప్రపంచంలో మొదటి వ్యాక్సిన్ విడుదల చేస్తామని చెప్పుకుంటున్నారు. ఈ రోజు భారత్ లో ఐసిఎంఆర్-భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ పూర్తిచేసుకుని స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 నాటికి విడుదల చేసేందుకు చూస్తున్నామని ఐసిఎం ఆర్ పదే పదే ప్రకటిస్తూ ఉంది.
ఇలాంటపుడు రష్యా తన వ్యాక్సిన్ గురించి సమాచారం వెల్లడించింది.
మిలిటరీ శాస్త్రవేత్తల నుంచి వచ్చిన ఈ వ్యాక్సిన్ వలంటీర్ యువతీ యువకులలో రోగనిరోధక శక్తిని పెంపొందించిందనేది ప్రాథమిక సమాచారం. చెప్పుకోదగ్గ దుష్పలితాలు లేవని కూడా అధికారలు చెప్పారు.
రెండు దశల ప్రయోగాలను మాస్కోలోని బుర్డెన్కో (Burdenko) సెంట్రల్ మిలిటరీ ఆసుప్రతిలో జరిపారు. మూడో దశ ప్రయోగాలు అవసరం లేదని కూడా రష్యా అధికారులు చెబుతున్నారు.
జూన్ లో మొదటి దఫా 9 మంది మీద ఈ రికాంబిటాంట్ వ్యాక్సిన్ ను పరీక్షించారు. రెండో దశ పరీక్షలను 20 మంది తో జరిపారు. నిన్నటితో ఈ వలంటీర్ల ఐసోలేషన్ ముగిసింది. వారి మీద చివరి దశ పరీక్షలు జరిపడంతో వారు విడుదలయ్యారు.
ఈ పరీక్షలకు ఎంచుకున్న వలంటీర్లు మిలిటరీ నుంచే కాకుండా ప్రజలనుంచి కూడా వచ్చారు. ప్రయోగాత్మంగా ఎక్కిస్తున్న ఈవ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు వారంతా దాదాపు 40 రోజుల పాటు డాక్టర్ల పరిశీలనలో ఉన్నారని ఇక ఫలితాలు రావడమే ఆలస్యమని రష్యా అధికారులు ప్రకటిస్తున్నారు.
If you like this story, share it with a friend!