తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కోవిడ్ తో మృతి చెందారు. గత కొద్దీ రోజుల క్రితం దీక్షితులకు కరోనా సోకింది. దీనితో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసమూర్తి దీక్షితులు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు.
తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20ఏళ్లకు పైగా శ్రీనివాసమూర్తి దీక్షితులు అని చేశారు. సాధారణంగా మాజీ ప్రధాన అర్చకులకు ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాలి. అయితే, ఇపుడు కోరనా వల్ల పరిస్థితులు దీనికి అనుకూలంగా లేవు.
ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేదు. ఎందుకంటే మునిసిపల్ సిబ్బంది మాత్రమే అంత్యక్రియలు కరోనా ప్రొటోకోల్ ప్రకారం చేశారు.
గత ప్రభుత్వంలో టిటిడి మీద తిరుగుబాటు చేసిన నలుగురు వంశపారంపర్య పురోహితులలో ఆయన ఒకరు.
2018 మే నెలలో పుట్టా సుధాకర్ యాదవ్ ఛెయిర్మన్ గా ఉన్నపుడు టిిటిటి పరిపాలనలో అవినీతి సాగుతున్నది అప్పటి ప్రధాన అర్చకుడు ఎవి రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. దాని మీద టిటిడి రమణ దీక్షితులతో సహా నలుగురురిని 65 సంవత్సరాలు దాటాయనే కారణంతో పదవీ విరమణ చేయించింది. అందులో శ్రీనివాస మూర్తి దీక్షితులు ఒకరు. మిగతా ఇద్దరు నరసింహదీక్షితులు, నారాయణ దీక్షితులు.
శ్రీనివాస మూర్తి దీక్షితులు ప్రభుత్వం చెల్లించిన రు.30లక్షల రిటైర్ మెంట్ పరిహారాన్ని తిరస్కరించి టిటిడితో పోరాటానికి సిద్దమయ్యారు.
రమణదీక్షితులు అపుడు చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి టిటిడినిధులు పక్కలు మళ్లుతున్నాయని, నిధలు స్వాహాఅవుతున్నాయని ఆరోపణలు చేసితిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.