అనంతపురం జిల్లా గుత్తి పట్టణ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువ నమోదు అవుతున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పట్టణ ప్రజల ప్రాణాలను రక్షించుకొనుటలో భాగంగా *రేపటి రోజు నుండి రోజు మార్చి రోజు బంద్ పాటించాలని నిర్ణయించారు.
మునిసిపల్ కమీషనర్ గంగిరెడ్డి, ఎమ్మార్వో బ్రహ్మయ్య, సిఐ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఒక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇది బంద్ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టేదాకా పాటించాలని నిర్ణయించారు. ప్రజలందరూ రేపటి రోజు నుండి మునిసిపాలిటీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టేంత కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి పౌరుడు విధిగా మాస్క్ ధరించాలని సామాజిక దూరం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు.
బంద్ వివరాలు:
సోమవారం , బుధవారం, శుక్రవారాలలో మాత్రమే ఉదయం 6.00 నుండి 11.00 వరకు మాత్రమే వ్యాపార కలాపాలు (అత్యవసర సేవలు మరియు Covid-19 మార్గదర్శకాలు సడలింపు) జరపాలి.
మంగళవారం,గురువారం,శనివారం, ఆదివారాలను పూర్తి బంద్ గా (అత్యవసర సేవలు మరియు Covid-19 మార్గదర్శకాలను పాటించాలి) పాటించాలి.
ప్రజల ప్రాణాలను రక్షించుకునే విధంగా కరోనా వైరస్ నిర్మూలనకు పట్టణ ప్రజలందరూ పూనుకోవాలి. అత్యవసరము అనిపిస్తెనే బయటికి రావాలి. సంబంధిత వార్డు అధికారుల అనుమతి ప్రకారం బయటి ప్రదేశాలలో ఏదైనా కొనుగోలుకు రావాలి.
,అనవసరమైన కారణాలతో బయటికి వచ్చి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. ప్రజలంతా పోలీసు సిబ్బందికి, మునిసిపల్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, వైద్య ఆరోగ్య సిబ్బంది వారికి తమ వంతుగా సహకరించాలని మునిసిపల్ కమీషనర్ , ఎమ్మార్వో, సిఐ విజ్ఞప్తి చేశారు.