రేపు సోమవారము lనాడు పరిమితులకు లోబడి ఏనుగు అంబారీ పై అమ్మవారి ఘటాన్ని సాగనంపే అనాదిగా వస్తున్న అచారాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడంవిచారకరమని హైదరాబాద్ ఓల్డ్ సిటి అక్కన్న మాదన్న మహంకాళి టెంపుల్ ట్రస్టు ప్యాట్రన్, కాంగ్రెస్ నేత గోపిశెట్టి నిరంజన్ వ్యాఖ్యానించారు.
కరోనా నియమాలు పాటిస్తూ పూరీ జగన్నాథ రథ యాత్ర కు అనుమతించిన నేపథ్యములో ఓల్డ్ సిటి అంబారీయాత్రకు పరిమితి ఇచ్చే విషయం ప పరిశీలించాలని హైకోర్ట్ పోలీసులను ఆదేశించినా రేపటి ఉత్సవానికి అనుమతి నిరాకరించడము దురదృష్టకరమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజల మత విశ్వాసాలలో జోక్యము చేసుకుని తెలంగాణ ప్రభుత్వము సంప్రదాయాలకు అడ్డు కట్ట వేయడము దురదృష్టకరమని ఆయన అన్నారు.
అమ్మవారి ఘటాన్ని సాగనంపె కార్యక్రమానికి కేవలము 10 మంది ఆలయ సభ్యులు హాజరవుతారని. ప్రజలు ఇళ్లలో నుండే దూర మాధ్యమ ప్రసారాల ద్వారా వీక్షిస్థారని తెలిపినా వినే నాధుడె లేడని నిరంజన్ పేర్కొన్నారు.
హైకోర్ట్ తీర్పు వచ్చిన తర్వాత మూడు సార్లు పోలీస్ కమిషనర్ ను కల్సి వివరించే ప్రయత్నము చేసినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు.
పోలిస్ అనుమతి ఉంటేనే చీఫ్ కన్సెర్వటర్ అఫ్ పారెస్ట్ ఇచిన ఎన్.ఒ సి చెల్లుతుందని తెల్సినా పని గట్టుకుని ఎన్.ఒ.సి రద్దు చేయించారని ఆయన చెప్పారు.
పది మందితో అమ్మ వారి ఘటాన్ని ఏనుగు అంబారీపై కరోనా సాకుతో అనుమతించని ప్రభుత్వము, హరిత హారము, ప్రారంభోత్సవాలను సత్కారాలను ఎలా సమర్థించుకుంటారని ఆయన ప్రశ్నించారు.
ఈ రోజు మందిరాలకు భక్తులు రాకుండా బ్యారికేడింగ్ చేసిన ప్రభుత్వము రేపు భారీ తరలివస్తే కట్టడి చేయలేమనడము హాస్యా స్పాదమని ఆయన అన్నారు.
కొందరు మంత్రుల, పోలీసుల అత్యుత్సాహము తో భక్తులకు తీవ్రమైన మనో వేదన కల్గిందని, ప్రభుత్వము అమ్మవారికి మరియు అమ్మ వారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని నిరంజన్ ప్రకటనలో పేర్కొన్నారు.