ప్రజలకోసం నిలబడిన న్యాయవాది మహబూబ్ బాషా నిన్న కరోనా వ్యాధితో నెల్లూరు చనిపోయారు.
బాషా మృతి నన్ను తీ వ్రం గా కలిచివేసింది. కడు పేదరికం నుంచి వచ్చాడు. ఒక్క రోజు కూడా స్కూలుకు కానీ, కాలేజీకి కానీ వెళ్లకుండా స్వయం కృషితో లా వరకు చదివాడు.
చాలా కాలం విప్లవ రాజకీయాల్లో ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు. దేవులపల్లి వెంకటేశ్వరావు గారి క్లాసుల్లో మూడు రోజులు పాఠాలు విన్నాం. అప్పుడే బాషా తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం చివరి వరకు కొనసాగింది.
నేను పత్రికా రంగంలోకి, బాషా న్యాయవాద వృత్తిలో కి వచ్చేసాం. ఆంధ్రభూమి నెల్లూరు స్టాఫ్ రిపోర్టర్ గా 1991 లో వెళ్ళినప్పుడు కాలి నడకన ఊరంతా చూపించాడు. తన జీవితాన్ని రేఖా మాత్రంగా నా కళ్ళ ముందు ఉంచాడు .
బాషా చిన్న తనం లోనే తండ్రి పోయాడు. తల్లి బూబమ్మ ఇళ్ళలో పాచిపానులు చేసుకునేది. శివాలయంలో ప్రసాదాలు తిని, కొలాయిలో నీళ్ళు తాగి ఆ శివాలయం రాల్లపైనే కూర్చుని చదువు కొన్నాడు. టెన్త్ అవగానే వాచ్ మన్ గా చేరాడు. అలాడిగ్రీ, తరువాత లా కూడా పాసయ్యాడు. ప్రాక్టీస్ పెట్టాడు.
పెట్టగానే కేసులు రావు క దా! పుట్టినప్పటి నుంచి ఆకలి, దారిద్య్రం బాషాకు అలవాటు అయిపోయిన తో బుట్టు వులు. ఎన్నో కస్తాలు పడి నోటరీ గా నిలదొక్కు కొన్నాడు. ముగ్గురు ఆడ బిడ్డలు. బాగా చదివించి పెళ్లిళ్లు చేశాడు. చివరి కూతురి పెళ్లికి నేను వెళ్ళాను.
న్యాయవాద వృత్తి కంటే ముందు వైద్యం కూడా చేశాడు. న్యాయ వాదిగా ఉంటో కూడా ప్రాథమిక వైద్యం అందించాడు. మాయదారి కరోనా బారిన పడి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు వదిలాడు.
బాషా విప్లవ కమ్మ్యూ నిస్తు మాత్రమే కాదు, ఎదుటి వారి ఇబ్బందులను గమనించ గల మానవతావాది. ఒక సారి బాషా కూ ఫోన్ చేసాను. అరగంట మాట్లాడాడు. ఫోన్ పెట్టే సాక నా సెల్ కు రీఛార్జి చేశాడు. నాకు సిగ్గనిపించింది. ఏమిటి బాషా ఇది అంటే, రిటైర్ అయిపోయారు, పెన్షన్ కూడా రాదు కదా . పడినంత కాలం కష్టాలు పడ్డాను. నా పరిస్థితి బాగుంది. నెలకు 50 వేలు వస్తోంది. ఆ మాత్రం చెయ్య లేనా అని నవ్వేశాడు. నా మిత్రుడు బాషా మృతికి ఈ జ్ఞాపకాల అక్షర నివాళి.