దేశంలో పాఠశాలలను పున: ప్రారంభించడం గురించి కేంద్రం యోచిస్తూ ఉంది. వచ్చే మూడునెలల్లో పరిస్థితి చక్కబడుతుందని, పాఠశాలు తెరిచేందుకు అనవయిన పరిస్థితులు నెలకొంటున్నాయని భావిస్తూ ఉంది.అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలలో తల్లితండ్రుల అభిప్రాయాలు తెలుసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నది.
కొన్ని రాష్ట్రాలు పాఠశాలలను పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా నియమాలు పాటిస్తూనే పాఠశాలలను రీఒపెన్ చేసేందుకు అనుమతినీయాలని హర్యానా ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కరోనా కేసులు పెరుగుతున్నా దశల వారీగా పాఠశాలను తెరవాలని కర్నాటక చాలా ఆత్రంగా ఉంది. నిజానికి జూలై 1 నుంచి పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు కూడా గతంలో ప్రకటించింది. అయితే, ఇది అమలుకాలేదు.తదుపరి తేదీ కోసం ఎదురుచూస్తూ ఉంది.
ఇపుడు దేశమంతా జాతీయ విపత్తుల చట్టం అమలులో ఉన్నందున ఏ దైనా రాష్ట్రం పాఠశాలలను రీవొపెన్ చేయాలంటే కేంద్రం అనుమతి అవసరం. దేశమంతా ఆన్ లైన్ పాఠాలకు అనుమతినిచ్చినా ఈ విధానాన్ని పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలలో అమలుచేయడం కష్టం.అందువల్ల పాఠశాలలను పున: ప్రారంభించడం తప్పమరొక మార్గం లేదు. అందేకు కేంద్ర రాష్ట్రాలనుంచి అభిప్రాయసేకరణ మొదలుపెట్టిందది.
ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ రాష్ట్రాలకు లేఖ ను రాసింది.
రాష్ట్రాల్లో స్కూళ్లు రీ ఓపెన్ చేసేముందు విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రభుత్వాలకు కేంద్ర మానవ వనరుల శాఖ అండర్ సెక్రెటరీ రాజేశ్ సంప్లే రాష్ట్రాలకు లేఖ రాశారు.
కేంద్రం మూడు విషయాలమీద రాష్ట్రాలనుంచి సమాచారం కోరింది.
స్కూళ్ల రీ ఓపెనింగ్ మీద విద్యార్థుల తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో స్కూళ్లు తెరవడం వాళ్లకి అనుకూలంగా ఉంటుందా?
2. స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలు ఏ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
3. దీని మీద ఇంకా సలహాలు సూచనలు ఉన్నాయా?
ఈ వివరాలను జూలై 20వ తేదీలోపు తమకు తెలియజేయాలంటూ రాజేష్ సంప్లే ఈనెల 17న రాసిన లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరిచే ఆలోచనలో ఉంది. తెలంగాణలో స్కూళ్ల పున:ప్రారంభం మీద అనిశ్చితి కొనసాగుతూనే ఉందది