రాష్ట్రంలో అనేక దేవాలయాలలో దర్శనాలను రద్దు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆలయ ప్రాంతాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆలయాలను భక్తులకు మూసేసి ఏకాంత సేవలకే పరిమితం చేస్తున్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా లోని అరసవల్లి ఆలయం దర్శనాలను రద్దుచేశారు.
రేపటి నుంచి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనాలు వుండవని ఎవరూ రావద్దని అధికారులు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
మరొక వైపు తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ప్రతిఅదివారం మూసేయాలని నిర్ణయించారు.
తిరుపతి, తిరుమల లో కూడా ఆలయాలను మూసేయాలని ప్రజలనుంచి వత్తడి వస్తూ ఉంది. రేప తిరుమల దర్శనాలను బంద్ చేసే విషయం మీద నిర్ణయం ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే, టిటిడి ఉద్యోగులతోపాటు ఆర్చకులకు కూడా కరోనా సోకింది. ఎవరినీ సాధారణ కలవని పెద్ద జీయర్ స్వామివారికి కూడా కరోనా సోకింది. ఆయనను హోం క్వారంటైన్ లో ఉంచారు.