నంద్యాల మెడికల్ కాలేజీకి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ భూములా?

((బొజ్జా దశరథ రామి రెడ్డి))
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (RARS) , నంద్యాల రైతు శిక్షణా కేంద్రం, నంద్యాల బయోలాజికల్ ల్యాబ్ భూములతో పాటు వాటి నిర్మాణాలను వైద్య కళాశాలకు బదలాయించాలన్న ప్రభుత్వం ఆలోచన రాయలసీమ అఖిలపక్ష, రైతుల సంఘాల సమావేశం వ్యతిరేకించింది.
నంద్యాల ప్రజల చిరకాల వాంఛ ప్రభుత్వ వైద్య కలశాలను నంద్యాలలో ఏర్పటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రైతులకు విశిష్ట సేవలందిస్తున్న నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను ప్రభుత్వ వైద్య కళాశాలకు బదలాయించాలన్న ప్రతిపాదనను వ్యతిసమావేశం వ్యతిరేకించింది.  వ్యవసాయరంగ అభివృద్ధికి తూట్లుపొడవమే నని  సమావేశం భావించింది.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్వర్యంలో జూలై 15, 2020 వెబ్ ద్వార మరియు జూలై 16, 2020 న దూరవాణి ఈ సమావేశాలు జరిగాయి.
ఈ సమావేశాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధి బొజ్జా దశరథ రామి రెడ్డి, తెలుగు దేశం పార్టి ప్రతినిధి భూమ బ్రహ్మానంద రెడ్డి, BJP పార్టి ప్రతినిధి డాక్టర్ బుడ్డా శ్రీకాంత రెడ్డి, CPM పార్టి ప్రతినిధి రమేష్, CPI పార్టి ప్రతినిధి బాబా ఫకృద్దీన్, కాంగ్రెస్స్ పార్టి ప్రతినిధి లక్ష్మి నరశింహ యాదవ్, AP రైతు సంఘం (CPM) ప్రతినిధులు రాజ శేఖర్ మరియు నరసింహులు, AP రైతు సంఘం (సిపిఐ) ప్రతినిధి సామన్న, నంది రైతు సమాఖ్య ప్రతినిధులు ఉమామహేశ్వర రెడ్డి, కృష్ణా రెడ్డి మరియు చంద్ర శేఖర రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి సిద్దా రెడ్డి, అంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య ప్రతినిధి వై ఎన్ రెడ్డి, బొజ్జా వెంకట రెడ్డి అగ్రికల్చరల్ ఫౌండషన్ ప్రతినిధి సుధాకర్, బనగానపల్లి మండల రైతు సంఘం ప్రతినిధి సుబ్బా రెడ్డి పాల్గొన్నారు
 సమావేశాలలో పలు తీర్మానాలను నాయకులు ఆమోదించారు.
తీర్మానాలు:
వ్యవసాయ పరిశోదన, విత్తనాభివృద్ధి, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం విస్తరణలో అగ్రగామిగా వుంటూ నంద్యాల పట్టణానికి, రాయలసీమకు ఎనలేని గుర్తింపు తెచ్చిన నంద్యాల వ్యవసాయ పరిశోదన స్థానం భూములను ప్రభుత్వ వైద్య కలశాలకు లేదా మరే ఇతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించరాదని తీర్మానించడమైనది.
క్రింద వివరించిన నంద్యాల ప్రాంతీయ పరిశోదన స్థానం పరిశోదన సేవలు, ప్రత్యేకతలు, చారత్రిక నేపధ్యంలో వైద్య కళాశాల ఏర్పాటును ప్రత్యామ్నాయ స్థలంలో చేపట్టాలని తీర్మానించడమైనది.
నవనందుల నిలయమైన నంద్యాలలో 114 సంవత్సరాల క్రితం 1906 వెలసిన ఆధునిక దేవాలయం నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం. దేశంలోని అత్యున్నత పరిశోధన స్థానాలలో RARS కు కీలక స్థానం ఉంది. ఈ పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన వివిధ పంటల రకాలు జాతీయ అంతర్జాతియ ఖ్యాతిని ఆర్జించాయి.
వివిధ రకాల పంటల పరిశోదనకు అనువైన నేలలు, వాతావరణం, నీటి వనరులు, మెట్ట పంటల పరిశోదనకు అవసరమైన వర్షాలు పడే ప్రాంతం RARS సొంతం.
RARS గత 114 సంవత్సరాల కాలం లో పత్తి పరిశోధన స్థానంగా, అత్యల్ప వర్సపాత మండల (కర్నూలు, అనంతపురం జిల్లాలకు) పరిశోదన స్థానంగా, ప్రాంతీయ పరిశోదన స్థానంగా , రూపాంతరం చెంది మానవాళికి కావలసిన ఆహార ఉత్పత్తుల అభివృద్దికి ఎనలేని కృషి చేసింది.
ఈ స్థానంలో జరిగిన పరిశోధనల పలితంతో పత్తి లో నరసింహ, HYPS 152, వరి లో నంద్యాల సోన, జొన్నలో తెల్ల జొన్న 1,2,3,4 & 5 మరియు పచ్చ జొన్న13, 14, 15, శనగ లో ధీర, నంద్యాల శనగ 1, NBeG 47, 49 & 119, కొర్రలో నరసింహరాయ, సూర్యనంది, ఎన్ ఐ ఏ 3085 & 3156, గరుడ, రేనాడు తదతర రకాలు రూపొందించడమైనది. ఈ పలితాలు రైతుల అభివృద్ధి తో పాటు, జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు కావలసిన వ్యవసాయ ఉత్పాదన సాధనలో అత్యంత కీలక పాత్ర వహించాయి.

అధిక దిగుబడి పంట రకాలతోపాటు ఉత్తమ యాజమాన్యం, పురుగు మరియు తెగుల్లను తట్టుకునే విధానాలను ఈ పరిశోధన స్థానం అభివృద్ధి చేస్తున్నది. పరిశోధన స్థానాల టెక్నాలజీ మరియు పరిశోధన పలితాలను రైతులకు చేరవేయడం లో RARS కీలక పాత్ర వహిస్తున్నది. దీని ద్వార రైతులు పంటల సాగులో ఖర్చును తగ్గించుకొని లాభసాటి వ్యవసాయం చేయడానికి దోహదపడుతున్నది.
రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి RARS లో మధ్య కాలిక విత్తన బీజనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని పంటల బీజ భద్రత చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు విత్తన రక్షణ కేంద్రంగా అభివృద్ధి జరుగుతుంది.
RARS నంద్యాలలో ఉండడం వలన రైతులు విత్తన ఉత్పత్తిలో నైపుణ్యము పొందారు. గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. దీనితో విత్తన ఉత్పత్తిదారులకు ప్రోత్శాహం లభించడంతో, ఈ ప్రాంతం విత్తన అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చెందింది. రైతుల ఆదాయం పెరగడంతో పాటు అనేక ఉపాధి అవకాశాలు రావడంతో ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధికి దోహద పడింది.
కింద వివరించిన ప్రత్యామ్నాయ ప్రదేశాలు లేదా ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించి అక్కడ ప్రభుత్వ వైద్య కలశాలను ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు.
ప్రభుత్వ వైద్యశాలకు పక్కనే ఉన్న పాత మార్కెట్ యార్డ్ స్థలం,నంద్యాలకు అతి సమీపంలో నిరుపయోగంగా ఉన్న నంద్యాల స్పిన్నింగ్ మిల్లు స్థలం.
నంద్యాలకు అత్యంత సమీపంలో ఉన్న నంద్యాల చెక్కర కర్మాగారముకు సంభందించిన 100 ఎకరాల భూములు. (నంద్యాల ప్రాంత రైతుల బాగాస్వామ్యంతో ఏర్పాటు చేసిన చెక్కర కర్మాగారం ప్రభుత్వ తప్పుడు విధానాలతో ప్రైవేటు సంస్థకు అమ్మడం జరిగింది. ప్రైవేటు సంస్థ కొన్ని సంవత్సరాలు చెక్కర కర్మాగారం నడిపి తరువాత మూసివేసింది. మూతపడిన చెక్కర కర్మాగారం భూములను ప్రజా అవసరాల నిమిత్తం వైద్య కళాశాల ఏర్పాటుకు మరియు కాబోయే నంద్యాల జిల్లా కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు భూ సేకరణ చట్టం కింద సేకరించాలి.)
నంద్యాల రైల్యే స్టేషన్ దగ్గర వున్న CWC గిడ్డంగులకు ఉన్న స్థలం, (నంద్యాల నడిబొడ్డున ఉన్న CWC గిడ్డంగులకు ఇపుడు సరుకు ఎదురయిన  రవాణాసమస్య  దృష్ట్యా గిడ్డంగులను నంద్యాల స్పిన్నింగ్ మిల్లు స్థలం లోనికి మార్చడానికి అవకాశం వుంది)
నంద్యాల పరిసర ప్రాంతాలలో భూసేకరణ చట్టం ద్వారా సేకరించి, ఎవరికీ పంచని మిగులు భూములు. (రెవెన్యూ శాఖ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం వున్నది)
రైతులకు అత్యంత కీలకమైన సేవలను అందిస్తున్న రైతు శిక్షణ కేంద్రం, బయోలాజికాల్ ల్యాబ్ ల భూములను మరియు నిర్మాణాలను నంద్యాల వైద్య కళాశాల ఏర్పాటుకు సేకరించడాన్ని కూడా నిలుపుదల చేయాలనీ తీర్మానించడమైనది.
నంద్యాల చరిత్రలో విశిష్టమైన స్థానం ఉన్న నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానంను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రైతుల అభివృద్ధికి, దేశ ప్రజల ఆహార అవసరాలను సమకూర్చడానికి నూతన వంగడాల అభివృద్ధి మరియు వ్యవసాయ శాస్త్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం భూములను ఇతర అవసరాలకు సేకరించడం మానుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రైతు సేవలో, వ్యవసాయరంగ అభివృద్దిలో కీలక పాత్ర వహిస్తున్న రైతు శిక్షణ కేంద్రం మరియు బయోలాజికాల్ ల్యాబ్ ల భూములను మరియు నిర్మాణాలను కుడా సేకరించడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

(బొజ్జా దశరథ రామి రెడ్డి, అఖిలపక్ష మరియు రైతు సంఘాల సమావేశ ప్రతినిధి)