ఎవరినీ కలవని తిరుమల అర్చకులకు కరోనా ఎలా సోకింది: నవీన్ రెడ్డి ప్రశ్న

ఎవరినీ కలవని, బయటకు రాని తిరుమల తిరుపతి అర్చకులకు కరోనా ఎలా సోకిందని తిరుపతికి చెందిన యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
చివరకు పెద్ద జీయర్ స్వామీజీకి కూడా కరోనా సోకిందని చెబుతూ కేవలం హుండి రాబడి కోసం తిరుమల,తిరుపతి కరోనా విషయాన్ని గోప్యం పెట్టి టిటిటి తిరుపతి ప్రజలకే ముప్పు తెస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు.
తిరుమలను అధికారు దేవస్థానంగా కాకుండా ఎటిఎం అనుకుంటున్నారని,అందుకే కాసులకు కక్కుర్తి పడి కరోనా విస్తరణను దాచిపెట్టి భక్తులను రండి రండి అని పిలుస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ తో మాట్లాడుతూ చెప్పారు.
 ఈ విషయాాలను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యిల్ చేశారు. అయితే ఈ లేఖ విశేషాలివే:
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్లు టీటీడీ ఈవో తిరుమలకు మూడవసారి వచ్చిన అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు!!
తిరుమల తిరుపతిలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందస్తు జాగ్రత్తలలో భాగంగా కొద్దిరోజుల పాటు దర్శనానికి భక్తులను అనుమతించకండి అని శ్రీవారి భక్తునిగా నేను చెపితే నాపై కేసు పెట్టారు మరి ఈ రోజు తిరుమలలో తిరుపతిలో వైరస్ కేసుల సంఖ్య వందల సంఖ్యలో పెరిగింది మరి తిరుపతి ప్రజలు ఇప్పుడు టిటిడి ఐఏఎస్ అధికారుల పై కేసులు ఎందుకు పెట్టకూడదు!!
తిరుపతిలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆసుపత్రిలలో క్వారింటైన్ సెంటర్లలో బెడ్ల కొరత ఏర్పడుతుంది!!
కరోనా వైరస్ బారిన పడిన టీటీడీ ఉద్యోగస్తులతో పాటు తిరుపతి ప్రజలకు సైతం టీటీడీ మెరుగైన సౌకర్యాలు అందించాలి. ఉచితంగా వైద్యం అందించాలి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే ఉద్యోగంతో పాటు ఎక్స్ గ్రేషియో చెల్లించే బాధ్యత టీటీడీ ఐఏఎస్ అధికారులదే!!
టీటీడీ ఈఓ,అడిషనల్ ఈవో తీరుతో శ్రీవారి భక్తులలో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది!!
టీటీడీ లోని ఐఏఎస్ అధికారుల తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది!!
టీటీడీ కి ఐఏఎస్ అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొంతమంది ఉద్యోగస్తులు స్వప్రయోజనాల కోసం అలాంటి అధికారులకు వత్తాసు పలకడం మానుకోవాలి తిరుపతి ప్రజల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి టీటీడీ ఉద్యోగస్తులకు అర్చకులకు తిరుపతి వాసులకు ప్రాణనష్టం జరిగితే ఇప్పుడు వత్తాసు పలికే కొంత మంది ఉద్యోగ సంఘం నాయకులు రేపు బాధ్యత వహించాల్సి వస్తుంది!!

తిరుపతి నగరంలో అలాగే టీటీడీ ఉద్యోగస్తులలో ఎవరికైనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతే ఈఓ తిరుమల అధికారి బాధ్యత వహించాలి!!
శ్రీవారి ఆన్ లైన్ సేవా టికెట్లు శ్రీ వాణి ట్రస్ట్ టికెట్లు అనుమతించడంతో తిరుపతిలో వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది!!
శ్రీవారి ఆలయాన్ని ఆదాయం సమకూర్చే ఏటీఎం మిషన్ లా చూడకండి!!
టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలిని తప్పుదోవ పట్టిస్తున్నారు!!
తిరుమలలో ఇటీవల జరిగిన ఆణివార ఆస్థానం అభిషేకం సేవలలో పెద్ద జీయర్ స్వామి తో పాటు పాల్గొన్న వారి జాబితా బహిర్గతం చేయాలి!!
తిరుపతి నగరంలో వెంటనే “మద్యం షాపులను” మూసివేసేలా ఆదేశాలు ఇవ్వండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తిరుపతి ప్రజల ప్రాణాలు కాపాడండి ప్లీజ్…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సహృదయంతో తిరుపతి ప్రజల శ్రీవారి భక్తుల మొర ఆలకిస్తారని ఆమోదయోగ్యమైన నిర్ణయం వెంటనే ప్రకటిస్తారని ఆశిస్తున్నాము!!