వైసిపి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తనకు కరోనా వచ్చిందని ప్రకటించారు. అయితే, తాను, క్షేమమని, తన పరామర్శించేందుకు ఎవరూ రావద్దనిచ ఫోన్ లు కూడా చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ఏదయినవిశేషం ఉంటే తానే తెలియపరుస్తానని కూడా చెప్పారు. అలాగే కరోనా జాగ్రత్తలు అంతా పాటించానలి,సామాజిక దూరం పాటించాలని కూడా ఆయన ఫేస్ బుక్ ద్వారా విజ్జప్తి చేశారు. ఆయన హైదరాబాద్ లో చికిత్సచేయించుకుంటున్నట్లు సమాచారం.
శిల్పా చక్రపాణి రెడ్డి ఫేస్ బుక్ లేఖ ఇదే…
“నా ప్రియమైన శ్రీశైలం నియోజకవర్గం మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, బంధు మిత్రులందరికీ …మీ శిల్పా చక్రపాణి రెడ్డి తెలియజేయడం ఏమనగా … స్వల్ప అనారోగ్యం వల్ల సందేహం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో *నాకు పాజిటివ్* అని తేలింది. దీంతో నేను క్వారంటైన్ లో తగిన చికిత్స చేయించుకుంటున్నాను.
ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యం తో ఉన్నాను . అయినప్పటికీ covid పరీక్షల్లో నెగటివ్ వచ్చేంతవరకు నేను క్వారంటైన్ లోనే ఉండవలసిన అవసరం ఉంది .
ఈ సందర్బంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం ఏమనగా … చికిత్స కాలం ముగిసే వరకూ నన్ను పరామర్శించేందుకు ఎవరూ రావద్దు . కనీసం ఫోన్ లో కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయవద్దు . ఏమైనా update ఉంటే నేను స్వయంగా సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. మరో ముఖ్యమైన అంశం ఏమంటే .. గడిచిన కొన్ని దినాలుగా నాతో సన్నిహితంగా మెదిలిన బంధు మిత్రులకు కూడా పరీక్షలు చేయించడం జరిగింది . వారందరికీ నెగటివ్ వచ్చింది .
ఇటీవల నేను నియోజకవర్గం లో పర్యటించినప్పుడు నాతో కలిసి ప్రయాణించిన వారు , సన్నిహితంగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే తక్షణమే పరీక్షలు చేయించుకొన గలరు . కోవిడ్ లక్షణాలు ఏమున్నా వెంటనే వైద్యాధికారులను సంప్రదించండి .
జన సమూహం లోకి వచ్చినప్పుడు … సామాజిక దూరం పాటించమని , మాస్కులు ధరించమని నేను పదే పదే మీకు విజ్ఞప్తి చేసిన సంగతి మీకు విదితమే .
కనుక ఇప్పటికైనా కరోనా ప్రోటోకాల్ పాటించి మిమ్మల్ని మీరు ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవాలి అని చేతులెత్తి మరీ వేడుకుంటున్నాను . మీ అందరి ఆశీస్సులు , ప్రార్థనలు ఆశిస్తూ … ఎల్లవేళలా మీ క్షేమాన్ని కోరుకునే…
మీ శిల్పా చక్రపాణి రెడ్డి , ఎమ్మెల్యే , శ్రీశైలం.కర్నూలు జిల్లా