వ్యక్తి గౌరవం, దేశ ఐక్యత, సమగ్రతకు భరోసా ఇచ్చే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం కోసం పోరాడుతున్న వ్యక్తులకు, సంస్థలకు ఒక అత్యవసర సూచన.
వివిధ రంగాలలో ప్రాతినిధ్యం, ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్న సామాజిక, రాజకీయ ఉద్యమకారులు వారి వారి నమ్మకాలు, సామర్ధ్యాలను బట్టి ప్రజలను సమీకరించే, చైతన్యపరచే వ్యూహాలను, ఆచరణను ఎంచుకుంటున్నారు. అయితే, అంతా గుర్తుంచుకోవలసిన విషయాన్ని నేను అందరిముందుంచుతున్నా.
చదువు వున్నానేటి కొత్త తరం యువత వివక్షను, అవమానాలను ఎదుర్కొంటూ ఉంది. కార్పొరేట్ మీడియా, కుల తత్వ, మతతత్వ సంస్థల, పార్టీల ఐటి సెల్స్ సృష్టించే సంవాదంలో పడిపోతూ ఉందనే వాస్తవాన్ని మనమందరం గ్రహించాలి.
పేదల, వెనుకబడినవర్గాల, కార్మికుల, రైతుల, యువత, మహిళల మైనారిటీల జీవనోపాధి గురించిన చర్చ ప్రధాన ప్రసార మాద్యమాలలో ఎక్కడా జరగకుండా వాళ్లు అడ్డుకుంటున్నారు.
ఉన్నత వర్గాల వ్యాపార, కులతత్వ రాజకీయ ప్రయోజనాల కోసం బిసి వర్గాలన్నీ తమ విద్య, ఆరోగ్యం, ఉపాధి, ప్రాతినిధ్యం అన్నింటిని పొగొట్టుకుంటున్నాయి. అలా జరగడానికి వీల్లేదిక.
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా వెనకబడిన వర్గాలకు లభించే చిన్నచిన్న అవకాశాలను కూడా వ్యాపార ప్రయోజనాలు కులతత్వ శక్తులు వమ్ము చేస్తున్నాయి. దాన్నడ్డుకోవాలి.
రిజర్వేషన్లు, వివిధంగా ఒబిసిలకు ప్రాతినిథ్య వంటి ప్రజాస్వామిక హక్కులను అణగదొక్కడానికి ఒక వైపు కుట్ర పాలకవర్గాలు కుట్ర చేస్తున్నాయి. మరోవైపు రాజ్యాంగ విరుద్ధమైన తమ ‘కుల రిజర్వేషన్ల’ను ప్రోత్సహిస్తూ ఉన్నత కులాలకు, వర్గాలకు అవకాశాలను అందించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది ప్రమాకరమయిన పరిణామం.
సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబళీకరణలో భాగంగా ప్రభుత్వాన్ని ప్రైవేటీకరించడం దగా. దీని వెనక రిజర్వేషన్ ఫలాలు వెనకబడి వర్గాలకు అందకుండా చేసే దురుద్దేశం ఉంది. అందుకే రిజర్వేషన్ల రంగంలో సర్వత్రా సంక్షోభం ఏర్పడుతూ ఉంది.
వెనకబడిన వర్గాలకు వివిధ రంగాలలో ప్రాతినిధ్యాన్నికల్పించే రిజర్వేషన్ లను కాంగ్రెస్ , బిజేపీలు ఎప్పుడూ వ్యతిరేకించాయి.అయితే, ఈ వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేయకుండా, ప్రయివేటీకరణ విధానం అమలుచేస్తున్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, మహిళలకు ప్రభుత్వా అవకాశాలు అందకుండా చేసే ప్రయత్నమే ప్రయివేటీకరణ అని మరువరాదు.
నాడు, 1993 సంవత్సరానికి ముందు వాస్తవానికి ఒబిసి అనే మాటకు నిర్వచనం లేక, గుర్తింపు లేక ఓబీసీలు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందలేదు. ఇపుడు,1991 తర్వాత వచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబళీకరణ వల్ల ప్రభుత్వాన్ని ప్రయివేటీకరించి, అందిన ఫలాలు వమ్ము చేస్తున్నారు.
కులవాద దేశంతో ఏమి చేయాలి?
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తో యువత సాయధం అయింది. వెనకబడిన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించి, ఆత్మగౌరవం సమకూర్చే సామాజిక దేశం ఎర్పాటుచేసేందుకు ఎదరుచూస్తున్నది. నేపథ్యంలో జరుగుతున్న ఆగస్టు 7, 25 ఉత్సవాల సందర్భంగా మండల విప్లవం గురించి చర్చించుకుందాం.
ఆగస్టు 25: సామాజిక సంస్కర్త బిపి మండల్ జయంతి
ఆగస్టు 7: 1990, ఆగస్టున ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సు కోసం రిజర్వేషన్లు అమలు చేసిన రోజు.
ఈ రెండు ఒక నెలలోనే రావడం విశేషం. బిసిల హక్కుల పోరాటచరిత్రలో ఈ రెండు తారీఖులు మరిచిపోలేనివి. దేశంలో రాజకీయాలను పూర్తిగా మతతత్వ శక్తులు, కులతత్వ శక్తులు తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకుని, ప్రయివేటీకరణ బాటపడుతున్నాయి. ఎంతో కాలంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఈ వర్గాలు, రిజర్వేషన్లను వమ్ముచేసేందుకు ఎంచుకున్న మార్గం ప్రయివేటీకరణ.
అందుకే ఈ రాజకీయాలను క్షుణ్ణంగా అధయ్యనం చేయాల్సిన అవసరం ఉంది. దృఢంగా వ్యతిరేకించాల్సిన అవసరమూ ఉంది. ఆగస్టు 7, ఆగస్టు 25 తేదీలకోసం ఎదుచూస్తూ ఉండండి.
-ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి, అధ్యక్షుడు, సమాజ్ వాది పార్టీ, తెలంగాణ